E-Paper
Advertisement

కవాసకి బైక్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 56 వేలు తగ్గింపు!

కవాసకి బైక్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 56 వేలు తగ్గింపు!
Advertisement

Kawasaki Versys X-300 Discount: అడ్వెంచర్ టూరింగ్ బైక్ కొనాలనుకునే వారికి కవాసకి అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వెర్సిస్ X-300 బైక్ పై రూ.10,000 వరకు ధర తగ్గించింది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ.3.39 లక్షలకు చేరింది. ఈ ధర తగ్గింపుతో పాటు మరో ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారికి సుమారు రూ.46,000 విలువ చేసే హార్డ్ కేస్ పానియర్స్, సెంటర్ స్టాండ్‌ ను ఎలాంటి అడిషనల్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

పోటీని తట్టుకునేలా ప్రత్యేక డిస్కౌంట్లు

ప్రస్తుతం అడ్వెంచర్ బైక్‌ల మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కవాసకి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ ధరతో పాటు ఖరీదైన యాక్సెసరీలు ఉచితంగా లభించడం వల్ల ఈ డీల్‌ పై చాలా మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.

కవాసకి వెర్సిస్ X-300 గురించి..

Advertisement

కవాసకి వెర్సిస్ X-300లో 296cc లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38.8 bhp పవర్, 26 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ పనితీరు, మంచి రిఫైన్‌ మెంట్ ఈ ఇంజన్‌ కు మెయిన్ అడ్వాంటేజీలుగా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ముఖ్యంగా లాంగ్ రైడ్స్, హైవే టూరింగ్‌ ను ఇష్టపడే రైడర్ల కోసం రూపొందించబడింది. మంచి రైడింగ్ పొజిషన్, చక్కటి పనితీరు కారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మంచి ఆప్షన్ కానుంది.

అయితే, ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి చాలా కాలం కావడంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యర్థి బైక్‌లతో పోలిస్తే ఫీచర్ల పరంగా కొంత వెనుకబడి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా KTM 390 అడ్వెంచర్, TVS అపాచీ RTX లాంటి మోడళ్లలో లభించే అత్యాధునిక టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఇందులో ఉండవు. అయినా కూడా నాణ్యత, ఇంజన్ పనితీరు, మంచి విశ్వసనీయత విషయంలో కవాసకి వెర్సిస్ X-300 చక్కటి పేరు సంపాదించింది. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో ఉండటం వల్ల ఈ బైక్ పనితీరుపై వినియోగదారుల్లో విశ్వాసం కూడా ఉంది. ఒకవేళ కొనాలనుకునే ముందు ధర మాత్రమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చును కూడా చెక్ చేయడం మంచిది. కవాసకి బైక్‌ల సర్వీస్, స్పేర్ పార్ట్స్ ఖర్చు కొన్ని ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో, KTM, TVS వంటి ప్రత్యామ్నాయ మోడళ్లతో ధర, ఫీచర్లు, మెయింటెనెన్స్ ఖర్చులను పోల్చి చూసిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది.

Advertisement

Read Also: లైట్ వెయిట్.. హై సేఫ్టీ.. క్రేజీ ఇగ్నైట్ కార్బన్ హెల్మెట్లు వచ్చేశాయ్!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×