E-Paper
Advertisement

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!
Advertisement

Kia October 2026 Offers: పండుగ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని కియా ఇండియా అక్టోబర్ 2026 కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన పలు కార్లు, SUVలు, MPVలపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ, కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ బెనిఫిట్స్ లో మార్పులు ఉంటాయి. ఈ నెలలో కియా కార్నివాల్‌పై గరిష్టంగా రూ.1.70 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తోంది. కేరెన్స్ క్లావిస్‌ పై రూ.95,000 వరకు, క్లావిస్ EVపై రూ.75,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

కార్నివాల్‌పై రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

అక్టోబర్‌లో కియా కార్లలో అత్యధిక ప్రయోజనం కార్నివాల్‌పై ఉంది. కొనుగోలుదారులు గరిష్టంగా రూ.1.70 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ ప్రయోజనం, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. కార్నివాల్ కియా ప్రీమియం MPVగా కొనసాగుతోంది. విశాలమైన క్యాబిన్, వెనుక సీట్లలో సౌకర్యం లాంటి అంశాలపై ఈ మోడల్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది.

కేరెన్స్ క్లావిస్‌పై రూ.95 వేల బెనిఫిట్!

Advertisement

కేరెన్స్ క్లావిస్ ICE వేరియంట్లపై ఈ నెలలో గరిష్టంగా రూ.95,000 వరకు ప్రయోజనం ఉంది. అయితే, CNG వేరియంట్ ఈ ఆఫర్‌కు ఇవ్వడం లేదు. ఆఫర్‌ లో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్, రూ.20,000 లాయల్టీ, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. క్లావిస్ ఆరు, ఏడు సీట్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.

క్లావిస్ EVపై రూ.75 వేల వరకు తగ్గింపు

కేరెన్స్ క్లావిస్ EV కొనుగోలుదారులకు కూడా అక్టోబర్‌లో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ MPVపై గరిష్టంగా రూ.75,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో ఎక్స్ఛేంజ్, లాయల్టీ, స్క్రాపేజ్, కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ నెల క్లావిస్ EVపై ప్రత్యేక క్యాష్ డిస్కౌంట్ లేదు.

సోనెట్‌పై రూ.65 వేల వరకు బెనిఫిట్

Advertisement

కియా సోనెట్‌పై గరిష్టంగా రూ.65,000 వరకు తగ్గింపు లభిస్తోంది. 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ HTK(O) వేరియంట్‌పై ఈ గరిష్ట ఆఫర్ ఉంది. ఇందులో క్యాష్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.50,000 వరకు బెనిఫిట్ అందుబాటులో ఉంది.

సైరోస్‌పై రూ.55 వేల తగ్గింపు 

కియా సైరోస్ ICE వేరియంట్లపై రూ.55,000 వరకు ప్రయోజనం ఉంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్‌ తో పాటు ఉచిత ఎక్స్‌ టెండెడ్ వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.

కేరెన్స్, సెల్టోస్‌పై ఆఫర్లు

సాధారణ కియా కేరెన్స్‌ పై CNG మినహా ఎంపిక చేసిన వేరియంట్లకు రూ.45,000 వరకు ప్రయోజనం ఉంది. CNG వేరియంట్‌కు కూడా స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉంది. సెల్టోస్‌పై గరిష్టంగా రూ.40,000 వరకు బెనిఫిట్స్ ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే, క్యాష్.. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లేదు.

సోరెంటోపై రూ.40 వేల వరకు

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కియా సోరెంటోపై కూడా అక్టోబర్ ఆఫర్ ఉంది. గరిష్టంగా రూ.40,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.20,000 లాయల్టీ, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

Read Also: టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×