E-Paper
Advertisement

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!
Advertisement

Tata Cars October 2026 Discounts: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2026లో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. టాటా కర్వ్‌ పై గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, నెక్సాన్‌ లో ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.75,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది.

కర్వ్‌ పై భారీ ఆఫర్

అక్టోబర్ నెలలో టాటా కార్లలో అత్యధిక బెనిఫిట్స్ కర్వ్‌ పైనే ఉంది. కర్వ్ నాన్ X వేరియంట్లపై గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ప్యాకేజీలో కస్టమర్ ప్రయోజనం, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ లాంటి పలు రకాల బెనిఫిట్లు ఉన్నాయి. కర్వ్ X వేరియంట్‌పై గరిష్టంగా రూ.20,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉంది.

నెక్సాన్‌ పై రూ.75 వేల వరకు తగ్గింపు

Advertisement

నెక్సాన్ కొనుగోలుదారులకు కూడా అక్టోబర్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై గరిష్టంగా రూ.75,000 వరకు బెనిఫిట్స్ లభిస్తుంది. స్మార్ట్+, స్మార్ట్+S, ప్యూర్, ప్యూర్ S, ప్యూర్+ లాంటి కొన్ని వేరియంట్లు ఈ ఆఫర్‌ ను అందిస్తుంది. మిగతా పెట్రోల్ వేరియంట్లపై రూ.55,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. నెక్సాన్ CNGపై గరిష్టంగా రూ.60,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో కస్టమర్ బెనిఫిట్, ఇన్సూరెన్స్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉండవచ్చు. నెక్సాన్ డీజిల్‌పై మాత్రం గరిష్ట ప్రయోజనం రూ.20,000గా ఉంది.

ఆల్ట్రోజ్‌పై కూడా డిస్కౌంట్లు

టాటా ఆల్ట్రోజ్ కొనాలనుకునే వారికి కూడా అక్టోబర్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్ట్రోజ్ CNGపై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనం ఉండగా, పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై వరుసగా రూ.35,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి కస్టమర్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ లాంటి ప్రయోజనాల్లో మార్పులు ఉన్నాయి.

టియాగో, టిగోర్‌ పైనా ఆఫర్లు

Advertisement

టాటా పాత స్టాక్ టియాగోపై కూడా ఈ నెలలో ప్రయోజనాలు ప్రకటించింది. XE వేరియంట్ మినహా ఎంపిక చేసిన పెట్రోల్, CNG వేరియంట్లపై రూ.35,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. టిగోర్‌ పై గరిష్టంగా రూ.30,000 వరకు ప్రయోజనం అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్ బెనిఫిట్‌ తో పాటు అర్హత ఉన్న ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి.

హారియర్, సఫారీపై రూ.45 వేల వరకు బెనిఫిట్స్

హారియర్, సఫారీ డీజిల్ మోడళ్లపై కూడా టాటా ఆఫర్లు అందిస్తోంది. ఈ రెండు కార్లపై గరిష్టంగా రూ.45,000 వరకు ప్రయోజనం ఉంది. అయితే, ఈ ఆఫర్లు ప్రధానంగా డీజిల్ వేరియంట్లకు సంబంధించినవి. పెట్రోల్ మోడళ్లకు కూడా ఇదే ప్రయోజనం ఉండదు.

సియెర్రాపై రూ.30 వేల బెనిఫిట్

టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ మోడళ్లపై కూడా అక్టోబర్ ఆఫర్లు ఉన్నాయి. రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లపై గరిష్టంగా రూ.30,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ తదితర కేటగిరీల్లో ప్రయోజనాలు ఉండొచ్చు.

Read Also: సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

Tags

Related News

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×