E-Paper
Advertisement

విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!

విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!
Advertisement

 Tata Sierra EV Launch Nears: భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు టాటా మోటార్స్ మరో కొత్త మోడల్‌ ను తీసుకురాబోతోంది. ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీని జూన్ 30న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి తొలి టీజర్‌ ను విడుదల చేసింది.

సియెర్రా ఈవీతో మరింత దూకుడు

టాటా మోటార్స్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో పలు ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులో ఉంచింది. ఇప్పుడు సియెర్రా ఈవీతో తన ఈవీ శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మోడల్ కంపెనీ నుంచి రానున్న ఏడో ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది. నిజానికి సియెర్రా పేరు భారత ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఒకప్పుడు టాటా బ్రాండ్‌ కు గుర్తింపుగా నిలిచిన ఈ SUV ఇప్పుడు ఆధునిక రూపంలో మళ్లీ మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వాహనంగా వినియోగదారుల ముందుకు రానుంది.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా చూస్తే, సియెర్రా ఈవీ, పెట్రోల్, డీజిల్ వెర్షన్ల మధ్య పెద్దగా తేడాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే టాటా విడుదల చేసిన ఇతర ఎలక్ట్రిక్ మోడళ్ల మాదిరిగానే, సాధారణ వాహనాన్ని ఎలక్ట్రిక్ రూపంలోకి మార్చే విధానాన్ని కంపెనీ అనుసరిస్తోంది. అందువల్ల బయటి రూపంలో కొన్ని ప్రత్యేక మార్పులు తప్ప, దాదాపు డిజైన్ ఒకేలా ఉండనుంది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, ప్రత్యేక LED లైటింగ్ సిగ్నేచర్, కొత్త స్టైలింగ్ అంశాలు ఉండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, ఏరోడైనమిక్ డిజైన్ ఎలిమెంట్లు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇంటీరియర్‌ లో కూడా లేటెస్ట్ డిజిటల్ డిస్‌ ప్లేలు, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా.

పవర్ ట్రెయిన్ గురించి..

పవర్‌ ట్రెయిన్ విషయానికి వస్తే, సియెర్రా ఈవీ తన సాంకేతికతను టాటా హారియర్ ఈవీతో పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్, పనితీరు లాంటి అంశాల్లో రెండు మోడళ్ల మధ్య సారూప్యత ఉండొచ్చు. మంచి డ్రైవింగ్ రేంజ్‌ తో పాటు మెరుగైన పనితీరు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూన్ 30న విడుదల

Advertisement

టాటా ఇప్పటికే నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ లాంటి మోడళ్లతో భారత ఈవీ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించింది. ఇప్పుడు సియెర్రా ఈవీ కూడా అదే విజయాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. జూన్ 30న జరిగే అధికారిక ఆవిష్కరణ సందర్భంగా ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లు లాంటి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టాటా సియెర్రా ఈవీ భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో మరో కీలక మోడల్‌ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×