E-Paper
Advertisement

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!
Advertisement

MG Windsor EV Indulge Edition: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న MG మోటార్, విండ్సర్ EVలో కొత్త ఇండల్జ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను రూ.17.89 లక్షలుగా నిర్ణయించింది. కొత్త షాడో గోల్డ్ కలర్, ప్రత్యేకమైన ఇంటీరియర్, వెనుక ప్రయాణికుల కోసం అదనపు సౌకర్యాలు ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అయితే, ఇది చిన్న 38kWh బ్యాటరీ ప్యాక్‌ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త కలర్‌తో ప్రత్యేక లుక్!

MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్‌లో షాడో గోల్డ్ అనే కొత్త ఎక్స్‌ టీరియర్ కలర్‌ ను అందించారు. దీనికి బ్లాక్ అల్లాయ్ వీల్స్, వెనుక క్వార్టర్ గ్లాస్‌పై ఇండల్జ్ బ్యాడ్జింగ్‌ను జోడించారు. ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మిగతా డిజైన్‌ లో పెద్దగా మార్పులు చేయలేదు. LED లైటింగ్, బాడీ క్లాడింగ్, బ్లాక్ రూఫ్, బ్లాక్ ORVMలు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కొనసాగుతాయి. కొత్త కలర్, ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో ఈ ఎడిషన్‌ ను గుర్తించవచ్చు.

క్యాబిన్‌లో అదనపు సౌకర్యాలు

Advertisement

ఇంటీరియర్‌లో బ్లాక్ అండ్ టాన్ కలర్ లెదరెట్ సీట్ అప్‌హోల్స్టరీని అందించారు. వెనుక ప్రయాణికుల కోసం రూఫ్‌కు అమర్చిన ఫ్లిప్ డౌన్ స్క్రీన్‌ ను కొత్తగా చేర్చారు. MG దీనిని  ప్రైవ్ స్క్రీన్ గా పేర్కొంటోంది. అయితే, స్క్రీన్ సైజ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ముందు సీట్ల హెడ్‌ రెస్ట్ లపై ఇండల్జ్ అక్షరాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ముందు ప్రయాణికుల కోసం నెక్ కుషన్లు, వెనుక సీట్లలో కూర్చునేవారి కోసం పిల్లోలను కూడా అందిస్తున్నారు. ఇతర ఫీచర్లు టాప్ స్పెక్ ఎసెన్స్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. అదనంగా వెనుక సన్‌షేడ్‌ లు, 3D మ్యాట్స్, క్రోమ్ గ్రిల్ యాక్సెంట్స్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లు, బాడీ సైడ్ మౌల్డింగ్, లెదర్ కీ కవర్ లాంటి యాక్సెసరీలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

బ్యాటరీ, రేంజ్ వివరాలు!

ఈ స్పెషల్ ఎడిషన్‌లో 38kWh బ్యాటరీ ప్యాక్‌ను మాత్రమే అందిస్తున్నారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇందులో ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 136hp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. MG విండ్సర్ EVలో 52.9kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ వెర్షన్‌కు కంపెనీ ప్రకటించిన రేంజ్ 449 కిలోమీటర్లు. అయితే, పెద్ద బ్యాటరీతో కూడిన వేరియంట్ ఇండల్జ్ ఎడిషన్‌ లో అందుబాటులో లేదు.

ధర ఎంత? అడిషనల్ గా ఏం ఉంది?  

Advertisement

MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్ ధర రూ.17.89 లక్షలు. ఇది సాధారణ ఎసెన్స్ వేరియంట్ కంటే రూ.89,000 ఎక్కువ. కొత్త ఎక్స్‌టీరియర్ కలర్‌తో పాటు క్యాబిన్‌లో అదనపు సౌకర్యాలు కోరుకునే కొనుగోలుదారులకు ఈ ఎడిషన్ బాగా నచ్చుతుంది.

Read Also: జస్ట్ 150 యూనిట్స్.. BYD సీలియన్ 7 కొత్త ఎడిషన్ వచ్చేసింది!

Tags

Related News

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

జస్ట్ 150 యూనిట్స్.. BYD సీలియన్ 7 కొత్త ఎడిషన్ వచ్చేసింది!

సిట్రోయెన్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కారు.. లుక్ ఏంది భయ్యా ఇంత బాగుంది!

కొత్త సస్పెన్షన్‌ తో మహీంద్రా థార్ రాక్స్.. త్వరలో అప్‌డేట్ వెర్షన్ విడుదల!

హ్యుందాయ్ బేయాన్ వచ్చేస్తోంది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

కొత్త టీవీఎస్ రేడియాన్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×