E-Paper
Advertisement

Automobile: భారత్‌ మార్కెట్లోకి ‘డుకాటీ’ బైక్.. ఖరీదు కోటి, ముంబైలో తొలి డెలివరీ, ఇంతకీ ఫీచర్లేంటి?

Automobile: భారత్‌ మార్కెట్లోకి ‘డుకాటీ’ బైక్.. ఖరీదు కోటి, ముంబైలో తొలి డెలివరీ, ఇంతకీ ఫీచర్లేంటి?
Advertisement

Automobile: భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ బైక్స్ వస్తున్నాయి. తాజాగా డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని బైక్ అడుగు పెట్టేసింది. ఈ బైక్ మొదటి డెలివరీ ముంబైలో అయ్యింది. ఇంతకీ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. ఇంతకీ ఖరీదైన బైక్ ఫీచర్స్ ఏంటి?

భారత్‌ మార్కెట్లోకి ‘డుకాటీ’ బైక్

Advertisement

ఇటాలియన్ తయారీ సంస్థ డుకాటీ అత్యంత ప్రీమియం బైక్‌లను భారత మార్కెట్‌కి పరిచయం చేసింది. పరిమిత ఎడిషన్ గల డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గినిని ఇండియాలో అడుగుపెట్టింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర కోటి రూపాయలు. ఈ సూపర్ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ పూర్తి అయ్యాయి. తాజాగా తొలి బైక్‌ను ముంబైలో డెలివరీ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

భారత్‌కు వచ్చిన అరుదైన బైక్ ల్లో ఇది కూడా ఒకటి. డుకాటీ సంస్థ పని గేల్ వీ4 లంబోర్గిని పేరిట బైక్‌లను ప్రపంచవ్యాప్తంగా కేవలం 630 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేకమైన స్పెషాలీ క్లయింటి ఎడిషన్‌ను తయారు చేస్తోంది కూడా. ప్రపంచవ్యాప్తంగా 63 యూనిట్లలో తయారు చేస్తోంది. లంబోర్గిని కార్ల యజమానుల కోసం వీటిని తయారు చేస్తోందట. యజమానులు తమ కార్ల రంగుల్లో బైక్‌ను కాన్ఫిగర్ చేసుకునే సదుపాయం ఉంది.

Advertisement

ఖరీదు కోటి, ముంబైలో తొలి డెలివరీ

పానిగేల్ V4 S ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్‌ సైకిల్, లంబోర్ఘిని రెవుయెల్టో స్ఫూర్తితో వీ4ను తీసుకొచ్చారు. డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 లంబోర్గిని-డయావెల్ 1260 లంబోర్గిని తర్వాత డుకాటీ-లంబోర్గిని కలిసి తీసుకువచ్చిన మూడో బైక్ ఇది. దీన్ని డుకాటీ సెంట్రో స్టైల్-లంబోర్గిని సెట్రో స్టైల్ డిజైన్ బృందాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది.

బైక్ బరువు తగ్గడానికి కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ఫెయిరింగ్, మడ్ గార్డ్స్, హీల్ గార్డ్స్, చైనా గార్డ్, ఎగ్జాస్ట్ ప్రొటెక్షన్, ట్యాంక్ ప్రొటెక్షన్, రేడియేటర్ డక్ట్ వంటి భాగాలను కార్బన్ ఫైబర్‌తో తయారు చేసింది. ఈ బైక్‌కు 1,103సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ V4 ఇంజన్‌ కలిగి ఉంటుంది.

ALSO READ: టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.45 లక్షల తగ్గింపు!

6 స్పీడ్ గేర్ బాక్సు, స్లిప్పర్ డ్రై క్లచ్‌లు ఉంటాయి. పనిగేల్ వీ4 లంబోర్గిని బైక్ బరువు 185 కిలోలు. పనిగేల్ సిరీస్ లో వచ్చిన అత్యంత తేలికైన, పవర్‌పుల్ బైక్. డుకాటి పానిగాలే వి4 లంబోర్ఘిని భారత్‌కు వచ్చిన అత్యంత అరుదైన మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి. కేవలం ఒక యూనిట్ మాత్రమే కేటాయించబడింది. ఇది పెర్ఫార్మెన్స్ బైక్‌గా నిలుస్తుందని భావిస్తోంది.

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×