E-Paper
Advertisement

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!
Advertisement

Spyker C8 Preliator XXV: డచ్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్పైకర్ మరోసారి ఆటోమొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన వివాదాలతో సతమతమైన ఈ సంస్థ ఇప్పుడు C8 ప్రిలియేటర్ XXV కూపేతో రీ ఎంట్రీ ఇచ్చింది. మాంటెరీ కార్ వీక్‌ ‘ది క్వెయిల్’ కార్యక్రమంలో ఈ కొత్త సూపర్‌ కార్‌ ను ఆవిష్కరించింది. ఈ కారు కేవలం 25 యూనిట్లను మాత్రమే పరిమితం కానుంది. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కారులోనూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ఉంటుంది. అయితే, స్పైకర్ ఇప్పటి వరకు ఈ కారు ధర ఎంత అనే విషయాన్ని వెల్లడించలేదు.

మళ్లీ ట్రాక్ లోకి స్పైకర్

స్పైకర్‌ ప్రయాణం గత కొన్నేళ్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతోంది. 2021లో కంపెనీ దివాలా పరిస్థితిని ఎదుర్కొంది. ఆ తర్వాత బ్రాండ్ హక్కుల విషయంలో చాలాకాలం న్యాయపరమైన వివాదాలు కొనసాగాయి. 2025 అక్టోబర్‌లో కంపెనీ సహ వ్యవస్థాపకుడు విక్టర్ ముల్లర్ స్పైకర్ పేరుపై రైట్స్ ను తిరిగి పొందారు. ఆ తర్వాత 2026 జూన్‌లో క్రిప్టోకరెన్సీ వ్యాపారవేత్త వోలోడిమిర్ నోసోవ్ కంపెనీలో పెద్ద మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. దీంతో స్పైకర్‌ను మళ్లీ బలం పుంజుకుంది.

800hp ఇంజిన్‌ తో సూపర్ కార్ తయారీ

Advertisement

C8 ప్రిలియేటర్ XXVకి 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ ఆడి నుంచి తీసుకున్నారు. ఇది గరిష్ఠంగా 800hp పవర్, 1,000Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారు కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. దీని గరిష్ఠ వేగం గంటకు 349 కిలోమీటర్లకు మించి ఉంటుందని స్పైకర్ తెలిపింది. స్పైకర్ కార్లలో కనిపించే ఏవియేషన్ డిజైన్ ఈ కొత్త మోడల్‌ లోనూ కొనసాగింది. ప్రొపెల్లర్ తరహా అల్లాయ్ వీల్స్, ప్రత్యేకమైన ఎయిర్ డక్ట్స్, ఫైటర్ జెట్‌ ను తలపించే టెయిల్ ల్యాంప్స్, రూఫ్‌ పై సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ లాంటి కారుకు స్పెషల్ లుక్ ను ఇస్తాయి. ‘ది క్వెయిల్’లో ప్రదర్శించిన కారు క్వెయిల్ గ్రీన్ రంగులో ఉంది. దానికి రోజ్ గోల్డ్ యాక్సెంట్స్ యాడ్ చేశారు. గ్రిల్, వీల్స్, రూఫ్, ఎయిర్ ఇంటేక్‌లు, ఫ్రంట్ స్ప్లిటర్ లాంటి చోట్ల ఈ కలర్‌ ఉంటుంది.

స్క్రీన్లు కాదు.. అనలాగ్ క్యాబిన్!

ఇప్పటి సూపర్‌ కార్లలో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కనిపిస్తాయి. కానీ స్పైకర్ మాత్రం C8 ప్రిలియేటర్ XXVలో కంప్లీట్ డిఫరెంట్ విధానాన్ని ఎంచుకుంది. క్యాబిన్‌లో అనలాగ్ గేజ్‌లు, ఫిజికల్ బటన్లు, రాకర్ స్విచ్‌ లతో కూడిన డాష్‌ బోర్డ్ ఉంది. టర్బైన్ తరహా ఏసీ వెంట్లు కారు ఏవియేషన్ థీమ్‌ను మరింత ఫోకస్ చేశాయి. ‘టస్కన్ శాడిల్’ పేరుతో పిలిచే ఆరెంజ్ బ్రౌన్ లెదర్‌ను ఇంటీరియర్‌లో ఉపయోగించారు.

స్పైకర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?   

Advertisement

C8 ప్రిలియేటర్ XXV కేవలం కొత్త కారు మాత్రమే కాదని స్పైకర్ వెల్లడించింది. ఇది సంస్థ రీఎంట్రీకి మొదటి అడుగుగా భావిస్తోంది. భవిష్యత్తులో స్పైకర్ మోటార్‌ స్పోర్ట్‌ లోకి తిరిగి వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా GT3 స్థాయి ఎండ్యూరెన్స్ రేసింగ్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో 2006 జెనీవా మోటార్ షోలో పరిచయం చేసిన D8 పెకింగ్-టు-పారిస్ సూపర్ SUV ప్రాజెక్టును కూడా మళ్లీ ప్రారంభించే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×