E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను బాధపెట్టిన భద్ర.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. వల్లి ఇరుక్కుందిగా..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను బాధపెట్టిన భద్ర.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. వల్లి ఇరుక్కుందిగా..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 19th :ప్రేమ ధీరజ్ తో గొడవ పడుతున్న చూసినా సీన్ ని చూస్తూ… చాలా సంతోషంగా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరిలా గొడవ పడే విడిపోవాలని కదా నేను ఇలా చేసింది చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలాగే గొడవ పడుతూ విడిపోవాలని నా కోరిక అది త్వరలోనే తీరేలా కనిపిస్తుంది అని భద్రావతి చాలా కోపంగా ఉంటుంది. కానీ నువ్వు కానీ మీ అత్తలాగే ఆలోచిస్తున్నావు అని అనడంతో ధీరజ్ ని చంప పగలగొడుతుంది. నేను అది పెట్టలేదని ఎంత చెప్తున్నా సరే నువ్వు ఎందుకు అసలు వినడం లేదు అని అంటాడు. కానీ ప్రేమ ఎంతగా చెప్పిన సరే ధీరజ్ మాటని కాకుండా వేదవతి నర్మద మాటలు కూడా వినకుండా ఉంటుంది.. ప్రేమ ఎంతగా మొండిగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని అంతగా మార్చేసారు అని ధీరజ్ నువ్వు ఈ జన్మకి మారవు అని అంటాడు.. నీ చావు నువ్వు చావు నీ దగ్గరికి కూడా రాను అని ధీరజ్ అనగానే ప్రేమ ఫీల్ అవుతుంది దాంతోపాటు భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది..

భాదపడ్డ ప్రేమ, ధీరజ్..

ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు వెతుకుతూ బాధపడిపోతూ ఉంటారు.. ప్రేమ అన్న మాటలు తలుచుకొని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అటు ప్రేమ కూడా ధీరజ్ నన్ను ఎంత బాగా చూసుకున్నాడు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడిపోతూ ఉంటుంది. అసలు ధీరజ్ ప్రేమని నేను మర్చిపోలేక పోతున్నాను అని ప్రేమ చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ఇక ధీరజ్ కూడా ప్రేమ నన్ను ఎందుకు ఇలా అనింది అని తనలో తానే బాధపడిపోతూ ఒంటరిగా ఉంటాడు. ప్రేమను చూసిన భద్రావతి ఎలాగైనా సరే తనని విడగొట్టాలి అని అనుకుంటుంది.

ప్రేమను రెచ్చగొట్టిన భద్రవతి..

Advertisement

ప్రేమ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా అక్కడికి వచ్చిన భద్రావతి నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకున్నాను. శాశ్వతంగా ఇంకా నా ఇంట్లోనే ఉంచుకుంటాను అని చాలా సంతోషంగా ఉంటుంది.. ఎలాగైనా సరే ప్రేమ మనసులో ధీరజ్ గాన్ని లేకుండా చేసి నా మేనకోడల్ని నా ఇంట్లోనే ఉంచుకోవాలి.. అప్పుడు కదా నాకు అసలు సంతోషం మొదలవుతుంది అని భద్రావతి మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత ప్రేమ దగ్గరికి వెళ్లిన భద్రావతి నువ్వు ధీరజ్ కోసం ఇంత బాధ పడుతున్నామని నాకు తెలియడం లేదు ప్రేమ నా తప్పేమీ లేదు కదా.. కోపంలో ఉన్నారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కళ్యాణ్ పేరు చెప్పి నేను ఇంకా బాధ పెడతాడని నేను అస్సలు అనుకోలేదు అని భద్ర ఇంకా ప్రేమను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నిన్ను అది నిజంగా నేను నమ్మించి మోసం చేశాడు అని ప్రేమతో చెప్పి భద్ర ప్రేమ మనసులో ధీరజ్ పై కోపాన్ని నింపుతుంది..

కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..

ప్రేమ తన పరిస్థితి ఇలా మారిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది ప్రేమ చేసిన పనికి ధీరజ్ కూడా బాధపడతాడు.. తనని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని చూసుకున్న ప్రేమ ఇలా బాధ పెట్టేలా మాట్లాడింది అని ధీరజ్ కూడా మరోవైపు కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక ధీరజ్ ప్రేమల జీవితం ఇలా మారిపోయింది అని అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరూ బాధ పడిపోతున్నారని వేదవది నా కొడుకు ఎప్పుడు ఇలా బాధపడడం చూడలేదు ఎలాగైనా సరే నా కొడుకు బాధని పోగొట్టాలి అని వేదవతి అనుకుంటుంది.

శ్రీవల్లిని కొట్టిన చందు..

Advertisement

శ్రీవల్లి చందు వెళ్లిపోతుంటే అక్కడికి వెళ్లి తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మీరు ఇలా పట్టించుకోని విధంగా ఉండే ధీరజ్ ప్రేమ ఎలా కలుస్తారు వాళ్ళు అసలే ఇలా ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతుంది శ్రీవల్లి. కానీ శ్రీవల్లి మాట విన్న చందు తన చెంప పగలగొడతాడు.. బయటికి వచ్చి మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని వేదవతి అడగగానే ధీరజ్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉందమ్మా అందుకే కొట్టాను అని అంటాడు చందు. ఎందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు.. ముందు నువ్వు మంచి దానివి ఒక అదో చూసుకో ఆ తర్వాతే పక్కన వాళ్ళ గురించి ఆలోచించొచ్చు అని నర్మద ఎంత చెప్తున్నా సరే శ్రీవల్లి మాత్రం వాళ్ళు ఎంతైనా నా మరిది చెల్లెలే కదా అందుకే నేను ఇంత బాధ పడిపోతున్నాను అని శ్రీవల్లి మంచిగా చెప్తూనే పుల్ల పెట్టేస్తుంది..

రైస్ మిల్లు కొట్టేసేందుకు ప్లాన్..

భాగ్యం ఆనందరావు పై పంచులు వేస్తూ ఉంటుంది. అయితే ఆనంద్ రావు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లి ఏం చేయాలి నాకు ఇడ్లీ తప్ప వేరే ఏమీ రాదు. ఇడ్లీలు అమ్మడం ఒకటే నాకు తరతరాలుగా వచ్చే పని అని అతను అంటాడు.. కానీ భాగ్యం మాత్రం అదృష్టం ఎప్పుడు మనల్ని ఇడ్లీలుగానే మార్చదు బంగారం తీసుకునే రేంజ్కి తీసుకెళ్లాలని అనుకుంటది. నువ్వు ముందు వెళ్లి రైస్ మిల్లు ని ఎలాగైనా మన చేతిలో పెట్టుకునేలా చూడాలి అని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు రామరాజు అన్నయ్య కూడా ఊర్లో లేడు కాబట్టి మనము ఆ రైస్ మిల్ ని సొంతం చేసుకోవాలి అని భాగ్యం ప్లాన్ చేస్తుంది.. ఇక ఆనంద్ రావు నావల్ల వీలైనంతవరకు చేస్తాను అని అంటాడు..

కొత్త విలన్ ఎంట్రీ..

భాగ్యం ఆనందరావు రైస్ మిల్ ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ఆనందంలో బయటకు వస్తూ ఉండగా లోపలికి ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. భాగ్యం ఈవిడ ఇక్కడికి కూడా వచ్చేసింది అంటే మనల్ని చంపేస్తుంది అని భయపడిపోతూ ఉంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన ఆ కొత్త విలన్ 3 లక్షలు అప్పు తీసుకొని ఊరు మార్చి పేరు మార్చారా అని అంటుంది.. మూడు లక్షల కి ఆరు లక్షలు వడ్డీ అయింది నాకు వెంటనే కట్టాలి అని కండిషన్ పెడుతుంది. కొత్తగా వచ్చిన చింతామణి క్యారెక్టర్ ఎంత వరకు భాగ్యం వాళ్ళని భయపెడుతుంది అన్నది తెలియలేదు..కానీ ప్రస్తుతం అయితే ఆమె కోసం వాళ్ళు చాలా భయపడిపోతున్నారని అర్థమవుతుంది.. మరి భాగ్యం వాళ్ళు రైస్ మిల్ ని కొట్టేసేందుకు ప్లాన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవిని రెచ్చగొట్టిన భానుమతి.. చక్రధర్ మాటకు షాక్.. పల్లవి ప్లాన్ ఇదా..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×