E-Paper
Advertisement

ఇండియాలో ఆటో రిక్షా ఇలా పుట్టిందా? నిజంగా ఇంట్రెస్టింగ్!

ఇండియాలో ఆటో రిక్షా ఇలా పుట్టిందా? నిజంగా ఇంట్రెస్టింగ్!
Advertisement

Auto Rickshaw Unknown Facts: ఆటో రిక్షా గురించి మనందరికీ తెలుసు. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లో, పల్లెల్లో సాధారణ రవాణా వాహనంగా కొనసాగుతోంది. కానీ, చాలా మందికి ఇది ఎలా పుట్టిందో తెలియదు. వాస్తవానికి, ఆటో రిక్షా అభివృద్ధి అనేది చాలా ఆసక్తికరమైన కథ. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇటలీతో ఆటోకు అవినాభావ సంబంధం

భారత్ లోని ఆటో రిక్షాకు ఇటలీతో అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆటో రిక్షా ఆలోచన మొదట యూరప్‌లో ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటలీలో తయారైన స్కూటర్లు దీనికి ప్రేరణగా నిలిచాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు ఆర్థికంగా బలహీనంగా మారాయి. అప్పుడు తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంధనంతో నడిచే చిన్న వాహనాల అవసరం పెరిగింది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటలీలో పియాగో కంపెనీ చిన్న స్కూటర్లను తయారు చేయడం మొదలైంది. దీపికి పియాగో ఏప్ అని పేరు పెట్టింది. ఈ స్కూటర్లలో ముఖ్యంగా ఒక మోడల్ మూడు చక్రాలతో ఉండేది. ముందు భాగంలో డ్రైవర్ కూర్చునేలా, వెనుక భాగంలో సరుకు లేదా ప్రయాణికులను తీసుకెళ్లేలా డిజైన్ చేశారు. ఇదే తర్వాత ఆటో రిక్షా రూపానికి ప్రేరణ అయ్యింది.

1948లో భారత్ లో ఆటోల అభివృద్ధి

Advertisement

భారతదేశంలో ఆటో రిక్షా అభివృద్ధి 1948 లో ప్రారంభమైంది. అప్పట్లో ఇక్కడ కూడా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడానికి సరైన వాహనం అవసరం ఉండేది.  ప్రముఖ వ్యాపారవేత్త ఫిరోదియా ఇటలీలోని పియాగో అపే వాహనం గురించి తెలుసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు ఈ వాహనాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచించారు. మరక్షణమే ఇటలీ నుంచి వెస్పా స్కూటర్లను తీసుకొచ్చారు. అదే సమయంలో పియాగో ఏప్ వాహనాలను ఇండియా తీసుకొచ్చారు. ఇటలీ మోడల్‌ను ఆధారంగా తీసుకుని తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేశారు. సరుకులకు బదులుగా ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపొందించారు. ఇక్కడి రోడ్ల పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని మరింత బలమైన, సౌకర్యవంతమైన వాహనంగా తయారు చేశారు. దానికి ఆటో రిక్షా అని పేరు పెట్టారు.

మొదట్లో సరుకు రవాణాకు ఉపయోగించినా..

మొదట్లో ఈ ఆటోలు ఎక్కువగా సరుకు రవాణా కోసం వాడేవారు. కానీ క్రమంగా ప్రయాణికుల కోసం కూడా వీటిని ఉపయోగించడం ప్రారంభమైంది. చిన్న సైజు, తక్కువ ఇంధన వినియోగం, ట్రాఫిక్‌లో సులభంగా నడిపే సామర్థ్యం కారణంగా ఆటో రిక్షా త్వరగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. తర్వాత కాలంలో ఆటో రిక్షాల్లో కూడా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల నుంచి సిఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఆటోల వరకు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం పర్యావరణాన్ని కాపాడే దిశగా ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా ఆటో రిక్షా పూర్తిగా భారతదేశంలో పుట్టిన వాహనం కాదు. దీనికి మూలం ఇటలీ స్కూటర్ డిజైన్‌. కానీ, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం వల్ల ఇది మన దేశానికి ప్రత్యేకమైన వాహనంగా మారింది. అందుకే ఈ రోజు ఆటో రిక్షా దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో త్వరగా గమ్యానికి చేరుకోవడానికి మార్గంగా మారింది.

Advertisement

Read Also: లక్షా 20 వేల కి.మీ తిరిగాక కారులో రీప్లేస్ చేయాల్సిన కీ పార్ట్స్ ఇవే, పట్టించుకోపోతే బూడిదే!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×