E-Paper
Advertisement

27 కి.మీ మైలేజ్, సూపర్ సన్‌ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!

27 కి.మీ మైలేజ్, సూపర్ సన్‌ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!
Advertisement

Best Tata Cars in July 2026: టాటా కార్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న SUV విభాగంలో టాటా పంచ్ మరోసారి తన సత్తా చాటింది. జూలై 2026లో కంపెనీ అమ్మిన ప్యాసింజర్ వెహికల్స్ లో పంచ్‌ అత్యధిక అమ్మకాలు సాధించింది. సరసమైన ధర, SUV తరహా డిజైన్, మంచి ఫీచర్లు, భద్రత వంటి అంశాలు ఈ కారుకు కలిసొస్తున్నాయి.

పంచ్‌ అమ్మకాల్లో దూకుడు

జూలై 2026లో టాటా పంచ్‌ మొత్తం 21,313 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూలైలో 10,785 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే ఏడాదిలో అమ్మకాలు దాదాపు 98 శాతం పెరిగాయి. రూ.5.59 లక్షల నుంచి రూ.10.54 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలో పంచ్‌ అందుబాటులో ఉంది. కొత్త డిజైన్, LED లైటింగ్, మంచి ఫ్రంట్ గ్రిల్ దీనికి  SUV లుక్‌ను ఇస్తాయి.

ఫీచర్లకు ప్రాధాన్యం

Advertisement

పంచ్‌ క్యాబిన్‌ లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా కొన్ని వేరియంట్లలో లభిస్తాయి. భద్రత విషయంలో కూడా టాటా పంచ్‌ మంచి ప్యాకేజీని అందిస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌ గా ఉండటంతో పాటు, భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన మోడల్‌గా ఇది నిలిచింది.

పెట్రోల్, CNG ఆప్షన్లు

టాటా పంచ్‌ పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG పవర్‌ ట్రెయిన్‌ లతో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లు సుమారు 18.8 నుంచి 20.09 కి.మీ/లీ వరకు మైలేజీ ఇస్తాయి. CNG వెర్షన్‌ లో 26.99 కి.మీ/కేజీ వరకు మైలేజీ లభిస్తుంది.

నెక్సాన్‌, టియాగోకు కూడా మంచి డిమాండ్

Advertisement

టాటా నెక్సాన్‌ జూలైలో 17,471 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 36 శాతం పెరిగాయి. పెట్రోల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లు, భద్రత వంటి అంశాలు నెక్సాన్‌కు ప్లస్‌గా మారాయి.  బడ్జెట్ కార్ల విభాగంలో టాటా టియాగో కూడా మంచి పనితీరు చూపించింది. జూలైలో 7,429 యూనిట్లు సేలయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 5,575 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో 33 శాతం వృద్ధి నమోదైంది. తక్కువ ధర, మంచి మైలేజీ కారణంగా చిన్న నగరాల్లో టియాగోకు డిమాండ్ కొనసాగుతోంది.

కొత్త సియెర్రాకు మంచి ఆరంభం

కొత్తగా వచ్చిన టాటా సియెర్రా జూలైలో 6,327 యూనిట్ల అమ్మకాలు సాధించింది. గత ఏడాదితో పోల్చడానికి గణాంకాలు లేకపోయినా, తొలి దశలోనే 6,000కు పైగా యూనిట్లు అమ్ముడవడం మంచి ప్రారంభంగా చెప్పొచ్చు. SUV డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, ఫీచర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. టాటా హారియర్ జూలైలో 3,301 యూనిట్లు అమ్మింది. మరోవైపు ఏడు సీట్ల సఫారీ 1,453 యూనిట్ల అమ్మకాలతో 17 శాతం వృద్ధిని సాధించింది. అయితే ఆల్ట్రోజ్, కర్వ్, టిగోర్ అమ్మకాల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. మొత్తంగా చూస్తే టాటా మోటార్స్‌ అమ్మకాల్లో పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లు కీలకంగా నిలిచాయి.

Read Also: డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×