E-Paper
Advertisement

డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!

డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!
Advertisement

Upcoming Hybrid Cars 2026: భారత్ లో SUVలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో పెరుగుతున్న ఇంధన ధరలు, సీరియస్ పొల్యూషన్ రూల్స్ కారణంగా వాహన తయారీ సంస్థలు కొత్త టెక్నాలజీలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇప్పుడు మిడ్‌సైజ్ SUVలలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెనాల్ట్, హ్యుందాయ్, కియా సంస్థలు ప్రముఖ SUVలకు హైబ్రిడ్ వెర్షన్లను సిద్ధం చేస్తున్నాయి. త్వరలో మార్కెట్ లోకి ఇవ్వబోతున్న మూడు సూపర్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

ఈ లిస్టులో ముందుగా ఇండియన్ మార్కెట్లోకి వచ్చే మోడల్‌గా రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్. దీపావళి సమయంలో హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావాలని రెనాల్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ SUVలో 1.8 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో 49bhp ఎలక్ట్రిక్ మోటార్, 20bhp హైబ్రిడ్ స్టార్టర్ జనరేటర్, 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. మొత్తం పవర్ సుమారు 160bhp వరకు ఉండొచ్చని అంచనా. ఈ పవర్‌ ట్రెయిన్‌తో డస్టర్ పనితీరుతో పాటు మెరుగైన మైలేజీని అందించే అవకాశం ఉంది.

2.హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్

Advertisement

హ్యుందాయ్ క్రెటా ఇప్పటికే భారత్ లో మంచి ఆదరణ పొందిన మిడ్‌సైజ్ SUVలలో ఒకటి. ఇప్పుడు కంపెనీ దీనికి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. క్రెటా హైబ్రిడ్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీని ఇంజిన్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ లాంటి పూర్తి వివరాలను హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు. ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ సహాయం అందించడం వల్ల పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.

3.కియా సెల్టోస్ హైబ్రిడ్

హ్యుందాయ్ క్రెటాతో పాటు కియా సెల్టోస్ కూడా హైబ్రిడ్ టెక్నాలజీని అందుకోనుంది. సెల్టోస్ హైబ్రిడ్ 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హ్యుందాయ్, కియా మధ్య ఉన్న టెక్నాలజీ భాగస్వామ్యాన్ని చూస్తే, భవిష్యత్ సెల్టోస్ హైబ్రిడ్‌ లో క్రెటా హైబ్రిడ్‌కు దగ్గరగా ఉండే పవర్‌ ట్రెయిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పెట్రోల్ వెహికల్ కంటే మెరుగైన ఇంధన సామర్థ్యం కావాలనుకునే వారికి, అదే సమయంలో పూర్తిగా ఎలక్ట్రిక్ కారుకు మారడానికి సిద్ధంగా లేని వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

హైబ్రిడ్ SUVలకు పెరుగుతున్న డిమాండ్

Advertisement

భారత మార్కెట్లో హైబ్రిడ్ వాహనాలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మంచి మైలేజీ, సౌకర్యం, పెట్రోల్ ఇంజిన్ అందించే సుదూర ప్రయాణ సామర్థ్యం కోరుకునే వినియోగదారులకు ఇవి ఆసక్తికరంగా మారుతున్నాయి. డస్టర్, క్రెటా, సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్లు మార్కెట్లోకి వస్తే మిడ్‌సైజ్ SUV విభాగంలో పోటీ మరింత పెరగనుంది.

Read Also: మారుతి కార్ల ధరలు పెంపు, ఆ మోడల్ పై ఏకంగా రూ. 30 వేలు జంప్!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×