Hero Splendor Plus Price Hike: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న బైకులలో హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor+) ఒకటి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజీ, అదిరిపోయే పనితీరుతో కోట్లాది మందికి దగ్గరయ్యింది. అయితే, తాజాగా ఈ బైక్ కొనాలనుకునే వారికి హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) షాక్ ఇచ్చింది. స్ప్లెండర్ ప్లస్ అన్ని వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని మోడళ్లపై రూ.1,135 పెరగ్గా.. స్పెషల్ ఎడిషన్‌పై ఏకంగా రూ.3,086 పెరిగింది.
ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ నాలుగు వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్, XTEC, XTEC 2.0గా లభిస్తున్నాయి. వీటిలో ఒక్కో వేరియంట్‌కు ఒక్కో రకమైన స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ధరల పెంపు తర్వాత సాధారణ స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ బ్రేక్ మోడల్ ధర రూ.77,777 నుంచి రూ.78,912కు చేరింది. i3S వేరియంట్ ధర రూ.78,910 నుంచి రూ.80,045కు పెరిగింది. ఇక 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.80,531 నుంచి రూ.81,666కు చేరింది. మిగతా వాటితో పోల్చితే స్పెషల్ ఎడిషన్ ధర ఎక్కువగా పెరిగింది. గతంలో రూ.78,580గా ఉన్న ఈ మోడల్ ధర ఇప్పుడు రూ.81,666కు చేరింది. అంటే, ఇప్పుడు ఈ బైక్ కొనాలనుకునే వాళ్లు రూ.3,086 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
స్ప్లెండర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్‌ను హీరో ఇప్పుడు సూపర్ కల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో బ్లాక్ అండ్ యాక్సెంట్ పేరుతో అమ్మిన ఈ మోడల్‌కు ఇప్పుడు స్పెషల్ ఎడిషన్స్ గా పేరు మార్చింది. ఇందులో మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
XTEC వేరియంట్ లో అనలాగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా పొందే అవకాశం ఉంది. రియల్ టైమ్ మైలేజ్ వివరాలు కూడా డిస్ ప్లేలో కనిపిస్తాయి. ఈ వేరియంట్ డ్రమ్ బ్రేక్ ధర రూ.82,418 కాగా, డిస్క్ బ్రేక్ మోడల్ ధర రూ.85,461గా ఉంది. ఇక XTEC 2.0లో ఎల్ఈడీ హెడ్‌లైట్, హజార్డ్ లైట్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.84,549. అయితే, ఇందులో ముందు డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.
స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ధర కూడా పెరిగింది. గతంలో రూ.82,710గా ఉన్న ఈ మోడల్ ధర ఇప్పుడు రూ.84,042కు చేరింది. అంటే, రూ.1,332 పెరిగింది. అటు, ఇప్పటికే స్ప్లెండర్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ వెర్షన్లకు కలిపి 15,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు హీరో ప్రకటించింది.
Read Also: వైరల్ వీడియో.. బైక్ పెట్రోల్ ట్యాంకులకు రంథ్రాలు చేసి.. ఇదేం ట్రెండు?