E-Paper
Advertisement

చండూరు మార్కెట్ గోదాంలో ప్రభుత్వ ధాన్యం చోరీ కలకలం

చండూరు మార్కెట్ గోదాంలో ప్రభుత్వ ధాన్యం చోరీ కలకలం
Advertisement

Paddy Theft: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి అప్పగించిన ధాన్యం మర ఆడించి బియ్యం గా మార్చి ఇచ్చే విషయంలో కొందరూ రైస్ మిల్లర్లు జాప్యం చేయటం మిల్లర్లే స్వయంగా సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఘటనలు ఓవైపు మరోవైపు వ్యవసాయ మార్కెట్ కమిటీలో గోదాం నుంచి కమిషన్ ట్రేడర్ సూత్రధారిగా వ్యవహరించి భారీగా ధాన్యం చోరీ చేయటం సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో ఎంత మేరకు బియ్యంగా మార్చారు. ఎప్పటివరకు ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగిస్తారన్న విషయమై సివిల్ సప్లై అధికారులు నిత్యం తనిఖీలు చేస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకునే ఛాన్స్ ఉండదు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడం చోరీ కావడం వంటి విషయాలు వెలుగు చూశాక అధికారులు హడావిడి చేయడం పరిపాటిగా మారింది.

850 క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం చోరి..

నల్గొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ ధాన్యం మాయమైన వ్యవహారం రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. కమిషన్ ట్రేడర్ గా ఉన్న ఓ వ్యక్తి వ్యవసాయ మార్కెట్ గోదాంలో నకిలీ కి తో తాళాలు తెరిచి దశలవారీగా సుమారు 850 క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి గుట్టుగా తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఐకెపి కేంద్రం ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి చండూరు పరిధిలోని రైస్ మిల్లుకు అప్పగించింది. అయితే ఆ రైస్ మిల్లులో ధాన్యం నిలువ చేసే స్థలం లేకపోవడంతో ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ గోదాం లో స్టాక్ చేశారు.

రూ. 5 లక్షల వరకు డిమాండ్..

Advertisement

కాగా గత కొన్నేళ్లుగా కమిషన్ ట్రేడర్ గా కొనసాగుతున్న ఓ వ్యక్తి గత నెల రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి రూ. 23 లక్షల విలువైన ధాన్యాన్ని లారీల ద్వారా పక్కదారి తరలించాడు. అర్ధరాత్రి వేళ గుట్టుగా దాన్యం తరలిస్తున్న విషయాన్ని పసిగట్టిన కొంతమంది యువకులు ఆ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కమిషన్ ట్రేడర్ ను ధాన్యం మాయం చేస్తున్న విషయం అందరికీ చెబుతామని బెదిరించి రూ. 5 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.

Also read: తెలంగాణ రైజింగ్ కు గ్లోబల్ అంబాసిడర్లుగా మారండి ఎన్ఆర్ఐలకు సీఎం రేవంత్ పిలుపు!

రూ. 3 లక్షలు తీసుకోవడం..

Advertisement

అయితే సదరు కమిషన్ ట్రేడర్ తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ. 3 లక్షల వరకు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సదరు బ్లాక్ మెయిల్ ముఠా కమిషన్ ట్రేడర్ వద్ద రూ.3 లక్షలు తీసుకోవడంతో పాటు మిల్లు యాజమాన్యం వద్దకు వెళ్లి కమిషన్ ట్రేడర్ చోరీ చేసి గుట్టుగా ధాన్యం దాచిన విషయాన్ని చెబుతామని మరో ఐదు లక్షలు ఆ రైస్ మిల్లర్ వద్ద డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి ప్రభుత్వ ధాన్యం మాయమైన వ్యవహారం బయటికి పొక్కింది. ఇదే విషయమై చండూరు పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో ఇప్పటికే కమిషన్ ట్రేడర్ తో పాటు బ్లాక్ మెయిల్ చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

పంపకాల్లో తేడాతో గుట్టురట్టు..

అయితే చండూరు వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి భారీ ఎత్తున ధాన్యం తరలించిన విషయంలో బ్లాక్ మెయిల్ కు దిగిన ముఠా సభ్యులకు వచ్చిన డబ్బుల విషయంలో పంపకాల్లో తేడా రావడంతో పాటు గోదాం నుంచి అక్రమంగా తరలించిన ధాన్యం జాడ చెప్పేందుకు రైస్ మిల్ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ ముఠా సభ్యులు సంప్రదించడంతో గుట్టు రట్టు అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ధాన్యంపై అందిన ఫిర్యాదు మేరకు చండూరు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ కేసు విషయాలను తెలియపరుస్తామని పోలీసులు, సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.

Also read: వైసీపీలో పోలిటికల్ వార్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కాపు నేతపై ఆసక్తికర చర్చ!

Tags

Related News

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

Big Stories

Advertisement
×