E-Paper
Advertisement

వైసీపీలో పోలిటికల్ వార్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కాపు నేతపై ఆసక్తికర చర్చ!

వైసీపీలో పోలిటికల్ వార్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కాపు నేతపై ఆసక్తికర చర్చ!
Advertisement

Kapu Politics: ముద్రగడ పద్మనాభం మరణంతో కాపు రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఇప్పుడు ఆయన ప్లేస్‌ని రీ ప్లేస్ చేయడానికి వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రీసెంట్ డేస్ లో వారి యాక్టివిటీస్, వారి కామెంట్స్ ఈ ప్రశ్నలకు కారణం అవుతున్నాయి. ముద్రగడ సంతాప సభలో చట్టాపట్టాలేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు.

జగన్‌తో అంబటికి..

అంబటి రాంబాబుపై దాడి, కేసులు, అరెస్ట్, బెయిల్ తర్వాత ఆయన కాస్త స్పీడ్ అయ్యారు. ఇదే స్పీడ్‌ని కంటిన్యూ చేసి ముద్రగడ లేని లోటుని ఫిల్ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్‌తో అంబటికి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉందని కొందరి ఆలోచన. కాపు మార్కుని చూపిస్తూ తన పొలిటికల్ టార్గెట్‌ని కూడా రీచ్ అవ్వడానికి అంబటికి ఇది మంచి ఛాన్స్ అనే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే ముద్రగడతో ఉన్న రాజకీయ సంబంధాలను పదేపదే ఆయన గుర్తు చేస్తున్నారని టాక్.

Advertisement

Also read: చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!

పరిణామాలు తీవ్రం..

ముద్రగడ స్థానాన్ని భర్తీ చేయాలని టీడీపీలో బోండా ఉమా కూడా ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది. రీసెంట్ డేస్‌లో ఆయన వైసీపీపై ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సొంత సామాజిక వర్గం బలాన్ని చూసుకొనే ఆయన ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారని ఓ అంచనా. ఏపీలోని కాపులకు తానే ప్రత్యామ్నాయమని చూపించే ప్రయత్నం ఉమా చేస్తున్నారని అమరావతి సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

కాపు నేత ఎవరు అవుతారు?

Advertisement

ఓ వైపు బోండా, మరోవైపు అంబటి.. ఈ ఇద్దరిలో రేపటి కాపు నేత ఎవరు అవుతారు? ముద్రగడ పద్మనాభం ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు? అనుకుంటే ఆ స్థానం వస్తుందా? అనే ప్రశ్నలకు ఫ్యూచర్ ఫాలిటిక్స్ సమాధానం చెబుతాయి.

Also read: మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!

Tags

Related News

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

Big Stories

Advertisement
×