E-Paper
Advertisement

చిన్న పట్టణాల్లో జోరందుకున్న ఉద్యోగాల వేట.. అసలు రహస్యమిదే?

చిన్న పట్టణాల్లో జోరందుకున్న ఉద్యోగాల వేట.. అసలు రహస్యమిదే?
Advertisement

Festive Hiring: పండుగ సీజన్ అంటే షాపింగ్ హడావుడి మాత్రమే కాదు. కొత్త ఉద్యోగ అవకాశాలకు కూడా ఇదే పీక్ టైమ్. గతంలో ఫెస్టివ్ హైరింగ్ అంటే ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు కూడా సీజనల్ ఉద్యోగాల కేంద్రాలుగా మారుతున్నాయి. జైపూర్, లక్నో, అహ్మదాబాద్, కోయంబత్తూరు, భువనేశ్వర్, ఇండోర్, సూరత్, కొచ్చి, చండీగఢ్ వంటి నగరాల్లో తాత్కాలిక ఉద్యోగాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

ఈ ఉద్యోగాలకు డిమాండ్..

ఈ మార్పుకు ప్రధాన కారణం.. ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, ఆర్గనైజ్డ్ రిటైల్ రంగాల విస్తరణ. కస్టమర్లకు దగ్గరగా సేవలు అందించేందుకు కంపెనీలు చిన్న పట్టణాల్లోనూ గోదాములు, స్టోర్లు, డెలివరీ నెట్‌వర్క్‌లను పెంచుతున్నాయి. దీంతో డెలివరీ బాయ్స్, వేర్‌హౌస్ సిబ్బంది, రిటైల్ సేల్స్, కస్టమర్ సపోర్ట్, ఫీల్డ్ సేల్స్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ అంచనాల ప్రకారం టైర్-2, టైర్-3 నగరాల్లో ఫెస్టివ్ సీజన్ తాత్కాలిక ఉద్యోగాల గ్రోత్ మెట్రోల కంటే రెట్టింపు వేగంతో సాగుతోంది. చిన్న పట్టణాల్లో ఈ ఏడాది హైరింగ్ డిమాండ్ 20 నుంచి 25 శాతం వరకు పెరుగుతుందని అంచనా. అదే సమయంలో మెట్రో నగరాల్లో వృద్ధి 8 నుంచి 15 శాతం మధ్య ఉండొచ్చని సంస్థలు చెబుతున్నాయి.

Advertisement

Also read: మంత్రి ఉత్తమ్ సాగర్‌లో దూకండి నీళ్లున్నాయో లేదో తెలుస్తుంది: జగదీష్ రెడ్డి!

ఈ-కామర్స్ సంస్థలు..

ఓవరాల్ గా ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత పెద్ద నగరాల వైపు వెళ్లేవారు. ఇప్పుడు కంపెనీలే చిన్న పట్టణాల వైపు వస్తున్నాయి. రిటైల్ చైన్లు, ఈ-కామర్స్ సంస్థలు కొత్త స్టోర్లు ఏర్పాటు చేస్తుండటంతో స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగంలోనూ చిన్న నగరాల్లో కొత్త స్టోర్ల సంఖ్య పెరుగుతోంది.

Advertisement

Also read: మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!

Tags

Related News

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

Big Stories

Advertisement
×