Village Development: మహబూబాబాద్ జిల్లాలోని జంగిలిగొండ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామస్తులకు విద్య, పారిశుధ్యం, తాగునీరు మౌలిక వసతులు కల్పిస్తూ.. పారదర్శక పాలన అందించే దిశగా పాలకవర్గం అడుగులు వేస్తోంది. గ్రామ అభివృద్ధికి తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తోంది. గ్రామస్తుల మెజార్టీ అభిప్రాయం మేరకే పనులు చేపడుతున్నారు. గ్రామానికి వచ్చిన ఆదాయం.. చేసిన ఖర్చులు, మిగిలిన నిధుల వివరాలు ఎప్పటికప్పుడే వెబ్‌సైట్‌లో నమోదు చేస్తోంది. కల్పనే ధ్యేయంగా పాలన సాగిస్తోంది.
ఇక మూసివేతకు దగ్గరవుతున్న ప్రభుత్వ పాఠశాలకు గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయాలు జీవం పోశాయి. ప్రభుత్వ స్కూల్‌లో చదివే పిల్లల కుటుంబాలకు ఇంటి పన్ను, నల్ల పన్ను వసూలు చేయకూడదని పాలవర్గం నిర్ణయించింది. జీపీ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గతంలో 10 మంది మాత్రమే ఉంటే.. ప్రస్తుతం 50కి చేరింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని అంటున్నారు.
Also Read: పాకిస్తాన్ పతనానికి బాబర్ ఆజం కుట్రలే కారణం…వాడి వల్లే అందరూ దోషులయ్యారు
పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ విద్యకు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తున్న జంగలిగొండ గ్రామం.. ప్రగతి పథంలో మరింత దూసుకెళ్లాలని కోరుకుందాం..
Also read: చిన్న పట్టణాల్లో జోరందుకున్న ఉద్యోగాల వేట.. అసలు రహస్యమిదే?