E-Paper
Advertisement

కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాల కలకలం.. సీలింగ్ ల్యాండ్స్ నుంచి జోరుగా ఎర్రమట్టి దందా..!

కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాల కలకలం.. సీలింగ్ ల్యాండ్స్ నుంచి జోరుగా ఎర్రమట్టి దందా..!
Advertisement

Red Soil Mafia: మట్టి మాఫియాకు అడ్డాగా మారింది కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం. ఈ మండలంలోని నెరనికి, చిన్న హ్యాట గ్రామాల సమీప కొండల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ ఆపు లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా రోజూ 10 టిప్పర్‌లు, 4 జేసీబీలతో వందల టన్నుల ఎర్రమట్టి విండ్ టర్బైన్ కంపెనీలకు తరలిపోతోంది. తవ్వకాలు జరుపుతున్న భూమి.. సీలింగ్ ల్యాండ్ అని.. ఇక్కడ మట్టిని తవ్వితే పట్టాలు రద్దు చేస్తామని రైతులకు లోకల్ ఎమ్మార్వో లక్ష్మిరాజ్ హెచ్చరించారు. వార్నింగ్‌లకే పరిమితం కాలేదు. ఓసారి మైనింగ్ చేస్తున్న జేసీబీని, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు ఎమ్మార్వో. కానీ, రాత్రికి రాత్రే ఆ డ్రైవర్ రిలీజ్ అయిపోయాడు. అంటే.. ఈ మాఫియా వెనక బడాబాబులు ఉన్నారని క్లియర్ గా తెలుస్తోంది.

రోడ్డుపై హెవీ లోడ్..

మైనింగ్ కి మాత్రమే కాదు.. మట్టిని తరలిస్తున్న వాహనాలకు కూడా లైసెన్సులు లేవు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి టిప్పర్లు కర్నాటక వెళ్తున్నా.. కనీసం క్వశ్చన్ చేసేవాళ్లు కూడా లేరు. ఏపీ నిబంధనలకు అనుగుణంగా టాక్స్‌లు చెల్లించకుండా రోడ్డుపై హెవీ లోడ్ టిప్పర్‌లు తిరుగుతున్నాయి.

Advertisement

Also read: పాకిస్తాన్ ప‌త‌నానికి బాబ‌ర్ ఆజం కుట్ర‌లే కార‌ణం…వాడి వ‌ల్లే అంద‌రూ దోషుల‌య్యారు

విలేజర్స్ సీరియస్..

ఈ అక్రమ దందాపై ముద్దనగేరి, కురుకుంద, హెబ్బటం విలేజర్స్ సీరియస్ అవుతున్నారు. గ్రామ నడిబొడ్డున ఇళ్ల ముందు రాత్రిపగలు హెవీ వెహికల్స్ తిరగడంతో రోడ్డు దెబ్బతింటున్నాయి. రీసెంట్‌గా 11 కోట్ల రూపాయలతో వేసిన రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నదని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధ్వంసమైన రోడ్లకు ఎవరు మరమ్మతుల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు?

కోట్ల రూపాయలు..

Advertisement

ఎర్రమట్టి మాఫియా వల్ల ట్యాక్సుల రూపంలో రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. మైనింగ్ శాఖకు, రెవెన్యూ శాఖకు వెళ్లాల్సిన కోట్ల రూపాయలు బడా బాబుల జేబులను నింపుతున్నాయి. ఇవన్నీ తెలిసినా పొలిటికల్ ప్రెజర్‌తో RTO తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్థుల విమర్శ.

Also read: బహవల్‌పూర్‌లోని ఉగ్ర కేంద్రం మళ్లీ రీ-ఓపెన్.. కేంద్ర హోంశాఖకు సంచలన నివేదిక!

Tags

Related News

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

Big Stories

Advertisement
×