E-Paper
Advertisement

కారు మెకానిక్ నుంచి ఏడంతస్తుల మేడ దాకా.. సాజిద్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు?

కారు మెకానిక్ నుంచి ఏడంతస్తుల మేడ దాకా.. సాజిద్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు?
Advertisement
Illegal Buildings: మాదాపూర్‌ మాంఛి కమర్షియల్‌ ఏరియా. రాబడి గట్టిగా వుంటుందని 50 గజాల్లో ఏడంతస్తుల  మేడ నిర్మాణం చేపట్టాడు బిల్డర్‌ సాజిద్‌.  అందులో పది గజాలు  నాలా స్థలాన్ని ఆక్రమించేశాడు. ప్రాపర్‌ ప్లానింగ్‌ లేదు. ప్రాఫిట్‌ మీద క్లారిటీ పునాదలపై లేదు.నాసిరకం పనులుతో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డర్‌ సాజిద్‌ అక్కడికి దగ్గరలోనే మరో  భవనం శ్లాబ్‌ వేయిస్తున్నాడు. బిల్డింగ్‌ కూలిందని తెలియగానే ఫోన్‌స్విచ్చాఫ్‌ చేసి చెక్కేశాడు. కానీ పోలీసులు  వెంటపడి అతన్ని అరెస్ట్‌ చేశారు.  ప్రాథమిక దర్యాప్తులోనే ఎన్నో సంచలనాలుబయటపడ్డాయి.ఒక్క అంజయ్యనగర్‌లోనే అతను ఇలాంటి  5 బిల్డింగ్‌లు కట్టాడు. ఏ ఒక్కటి నిబంధనలకు అనుగణంగా లేదు. అన్నీ పక్కాగా కబ్జా బాపతే అని గుర్తించారు అధికారులు

ఎవరీ సాజిద్‌?

 అతని తండ్రికి కారు మెకానిక్‌ షెడ్‌ వుంది. సాజిద్‌ అక్కడే పనిచేసేవాడు. కారు రిపేరింగ్‌ కోసం వచ్చే అధికారులు, నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. కారు మెకానిక్‌ పనిని పక్కకు నెట్టి క్విడ్‌ ప్రోకో  దందా చేపట్టారు.  ఫస్ట్‌ ప్లానే వర్కవుటయింది. అధికారులకు, నేతాలకు లంచాలు ఇచ్చి ఏకంగా ప్రభుత్వ పార్క్‌ స్థలాన్ని కబ్జా చేశాడు. బిల్డింగ్‌ లేపాడు.ప్లాట్లుగా సేల్‌ చేశాడు.దండిగా డబ్బు వచ్చింది. అంతే పేదల స్థలాలపై కన్ను పడింది.నయన్నో భయన్నో వాళ్ల నుంచి 40.50  గజాల స్థలాన్ని చేజిక్కించుకొని 3ఏళ్లలో బిల్డింగ్‌లు కట్టాడని గుర్తించారు అధికారులు. అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ పెట్టారు. అంజయ్య నగర్‌లోని  మరో రెండు బిల్డింగ్స్‌కు నోటీసులిచ్చి ఖాళీ చేయించారు. ఆ రెండు భవనాలకు పవర్‌ కట్‌ చేశారు. వాటిని ఎప్పుడైనా కూల్చే అవకాశముంది.

అక్రమ కట్టడాలు..

అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తన్నారు.. అక్రమ కట్టడాలపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదని వాపోయారు అంజయ్య నగర్‌ వాసులు. ఏడంతస్తుల బిల్డింగ్‌ కూలిన కేసులో  అక్రమ నిర్మాణాలను  అడ్డుకోవడంలో విఫలమయ్యారని మాదాపూర్‌ టౌన్‌ ప్లానింగ్‌ఆఫీసు సంతోష్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. రాయదుర్గం పీఎస్‌లో  నాన్‌ బెయిల్‌బుల్‌కేసు ఫైలయింది. దారుణం జరిగాక చట్టం పని తాను చేసుకెళ్తుంది సరే. ముందే లోపాలను గుర్తిస్తే ఈ ఘోరం జరిగేదా? కారు మెకానిక్‌  నుంచి బిల్డర్‌ ఎదగడం వెనుక సాజిద్‌కు సహకరించిందెవరు?  ఇలాంటోళ్లు ఇంకెంత మందివున్నారు? ఇట్టాంటి బిల్డింగ్‌ మాఫియాలో ఎవరి వాటా ఎంత? నాలా స్థలాన్ని..పార్కులను..పేదల ప్లాట్లను  కబ్జాచేశాడంటే.. ఏ ధైర్యంతో అంత బరితెగింపు?  సాజిద్‌ సహకరించిన ఆ అధికారులు, లీడర్లు ఎవరు?

కబ్జా చేసి..

చెరువుల్లో ఇంచు కబ్జా చేసినా గుడిసెల్లి,ఆకాశ హర్మ్యాలను నేలమట్టంచేస్తున్నారు సరే. మరి జనవాసాల్లో  ఇంత దర్జాగా అక్రమ నిర్మాణాలను  చేస్తుంటే  అధికారయంత్రాంగం ఏంచేస్తోంది?
Tags

Related News

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

Big Stories

Advertisement
×