E-Paper
Advertisement

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!
Advertisement

పుత్రోత్సాహంబు తండ్రికి .. పుత్రుడు జ‌న్మించిన‌పుడే పుట్ట‌దు జ‌నులా. పుత్రుని గ‌నుకొని పొగ‌డ‌గ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమ‌తీ! ఈ సుమ‌తి శ‌త‌కం అంద‌రికీ తెలిసిందే. భావ‌ము కూడా. దీని తాత్ప‌ర్య‌ము, సారాంశ‌మూ ఏంటంటే..పుత్రుడు పుట్ట‌గానే సంబ‌రం కాదు.. ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తున్న సంద‌ర్భంలో ఆ త‌ల్లిదండ్రుల కీర్తిని మ‌రింత ఇనుమ‌డింప‌జేసే విధంగా వ్య‌వ‌హ‌రించిన నాడు అప్పుడు సంబ‌ర ప‌డాలె అని. ఇప్పుడు కొండా సురేఖ దంపుతులు త‌మ పుత్రిక‌ను చూసి సంబ‌ర‌ప‌డాల్సిందే.

ఎందుకంటే ఆమె అంత డేర్‌గా, నేరుగా వ‌చ్చీరానీ మాట‌ల‌తో, అప‌రిప‌క్వ వ్యాఖ్య‌ల‌తోనైనా స‌రే త‌ల్లిదండ్రుల కోసం ఎదురించి బెదిరించినందుకు. సీఎంనే.. ఏం క‌ళ్లు నెత్తికెక్కాయా అని గొంతుపై బ‌హిరంగంగా క‌త్తి పెట్టినందుకు. ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఎందుకియ్య‌లేద‌ని అడ‌గ‌డంతో పాటు .. ప‌ద‌వులు ఇచ్చిన వారికి ఎందుకిచ్చావ‌ని నిల‌దీసినందుకు. రా చూస్కుందాం అని బ‌రిగీసి నిలిచినందుకు.

Advertisement

ఇవ‌న్నీ చూసి ఆ త‌ల్లిదండ్రులు ఎంత ముచ్చ‌ట ప‌డి ఉంటారు. అబ్బ‌బ్బ కంటే కూతుర్నే క‌నాలి .. సినిమా టైటిల్ త‌మ‌కు క‌రెక్టుగా యాప్ట్ అయింద‌నుకున్నారు కావొచ్చు. న‌న్ను భ‌యం లేకుండా పెంచాడు నా తండ్రి అన‌డ‌మే కాదు.. వారు ఎంతో ఓపిక ప‌డుతున్నారు.. నేన‌లా కాదు. సివంగిని అని రేవంత్‌ను బెదిరించే విష‌యంలో పీక్‌కు వెళ్లిపోయిందామె.

ఇప్ప‌టికే ఓసారి బెదిరించి వ‌దిలేసిందామె. దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. అన్న‌ట్టుగా ఓ సారీ చెప్పి ఆ ఎపిసోడ్‌కు ముగింపు ఇచ్చారా త‌ల్లి అప్పుడు.  ఆ త‌ల్లికీ ఎంతో సంతోషంగా ఉండి ఉంటుంది.. త‌న బిడ్డె త‌న ప‌ద‌వి కోసం.. తండ్రి ప‌ద‌వి కోసం.. మొత్తంగా ఫ్యామిలీ ప్యాకేజీ రాజ‌కీయాల కోసం ఎంత‌లా ఎదురించి నిల‌బ‌డిందీ ధీర వ‌నిత అని కూడా సంబ‌ర‌ప‌డి ఉంటారు.

Advertisement

అందుకే పుత్రికోత్సాహంబు ఆ త‌ల్లిదండ్రుల‌కు అని మార్చుకుని చూడాలి ఇక్క‌డ‌. ముర‌ళి అంటే ఎవ‌రు..? కింగ్ మేక‌ర్‌.. అని కూడా చెప్పుకొచ్చిందామె. త‌మ‌కు తాము చెప్పుకోక‌పోతే.. ఇంకెవ‌రు చెబుతారు..? అలా చెప్పినా.. ఇలా బెదిరించినా.. రేవంత్ విన‌క‌పోతే మ‌న‌మేం చేస్తాం .. వాళ్ల ఖ‌ర్మ‌.. అంతే!

స‌మంత, కేటీఆర్‌కు లింకులు పెట్టి మాట్లాడిన ఆ మాతృమూర్తి అనుకుని ఉంటారు.. త‌ల్లిని మించిన త‌న‌యా అని. ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడ‌తామ‌ని వారికి వారే ఆత్మ‌వంచ‌న చేసుకునేలా ఆ మాట్లాడే తీరును అత్యుత్సాహం, అవ‌గాహ‌న లేమి, అప‌రిప‌క్వ‌త‌, నోటి దురుసు అనే ప‌దాల‌తో పోల్చుతారని బ‌హుశా తెలియ‌దేమో.

ఈ నిబంధ‌న‌లేమీ కాంగ్రెస్‌లో పార్టీలో ఉండ‌వేమో..? అందుకే స్వేచ్చా ప‌రిధులు దాటి.. త‌మ ప‌ద‌వుల కోసం కూర్చున్న కొమ్మ‌నైనా న‌రుక్కుంటాం గానీ ఎదిరించి బెదిరించి నిల‌బ‌డి క‌ల‌బ‌డ‌తామ‌నేదే బ‌హుశా ఆ పార్టీ డీఎన్ఏ అయి ఉంటుంది. సినిమా చివ‌రి ద‌శ‌లో క‌థ ఆస‌క్తిగా, రంజుగా , క‌నువిందుగా, హ‌స్య‌భ‌రితంగా మారుతుండ‌టంతో ఇది క‌చ్చితంగా హిట్ సినిమానే అవుతంద‌ని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్‌.

కొస‌మెరుపేమిటంటే.. మేము కాపుద‌న‌పోళ్లం, ప‌ద్మ‌శాలోల్లం.. ! అమ్మ మంత్రి ప‌ద‌వి ఎట్లా తీస్తాడు రేవంత్‌.. నేనైతే తీసెయ్య‌డ‌నే అనుకుంటున్నా..! అని అప్ప‌టిదాకా జుట్టుప‌ట్టుకుని ఆ వెంట‌నే బీసీ కార్డు ప్ర‌యోగించి కాళ్లు ప‌ట్టుకున్న‌ట్టుగా అనిపించింది.

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×