Best eye care monitors for freelancers: ఉదయం నుంచి రాత్రి వరకు.. ల్యాప్ టాప్ స్క్రీన్ ముందు గడిపే ఫ్రీలాన్సర్లకు కంటి సమస్యలు, తల నొప్పి సర్వసాధారణం . ఇలా రోజంతా.. స్క్రీన్ ముందు పని చేయడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. అందుకే ప్రత్యేకమైన ‘ఐ-కేర్’ ఫీచర్లు ఉన్న మానిటర్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. బ్లూ లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్ , ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండే.. ఈ బెస్ట్ కంప్యూటర్ మానిటర్లు కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. లాంగ్ అవర్స్ పని చేసే.. వారి కోసం మార్కెట్లో.. లభిస్తున్న టాప్ 5 ఐ-కేర్ కంప్యూటర్ మానిటర్ల ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రీలాన్సర్ల కోసం బెస్ట్ బ్రాండ్ ఏంటంటే.. టక్కున గుర్తొచ్చే పేరు బెన్ క్యూ (BenQ). ఈ 27 అంగుళాల మానిటర్ స్పెషల్ ఐ-కేర్ టెక్నాలజీతో.. వస్తుంది. ఇందులో.. ఉండే బ్రైట్ నెస్ ఇంటెలిజెన్స్ ప్లస్ (B.I.+) టెక్నాలజీ రూంలోని.. వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్ నెస్ వాటంతట అవే సర్దుబాటు చేసుకుంటుంది.
ప్రత్యేకతలు: యాంటీ-గ్లేర్ ప్యానెల్,హైట్ అడ్జస్టబుల్ స్టాండ్, లో బ్లూ లైట్ మోడ్.
ధర:రూ.16,500-18,500 మధ్య ఉంటుంది.
2. Dell SE2725HM :
తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ సమయం పనిచేసే.. వాళ్ల కోసం డెల్ బ్రాండ్ నుంచి ఇది అద్భుతమైన ఆప్షన్. 100Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల స్క్రీన్.. స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది కంటిపై పడే ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది.
ప్రత్యేకతలు: VA ప్యానెల్, 100Hz రిఫ్రెష్ రేట్, కంఫర్ట్ వ్యూ ఫీచర్.
ధర: రూ.11,000-13,000 మధ్య ఉంటుంది.
హెచ్‌పి (HP) సంస్థ నుంచి వచ్చిన ఈ 23.8 అంగుళాల మానిటర్ ఆఫీస్ , ఫ్రీలాన్స్ వర్క్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసారు. ఇందులో ఉన్న.. ‘HP Eye Ease’ టెక్నాలజీ రంగుల క్వాలిటీ కోల్పోకుండానే హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గిస్తుంది.
ప్రత్యేకతలు: ఐ-ఈజ్ హార్డ్‌వేర్ బ్లూ లైట్ ఫిల్టర్, అల్ట్రా-స్లిమ్ డిజైన్, యాంటీ-గ్లేర్ స్క్రీన్.
ధర: రూ.12,500-14,000 మధ్య ఉంటుంది.
4. Acer EK220Q Ebi :
మీరు తక్కువ ధరలో మంచి కలర్ ఆక్యూరసీ, ఐ-ప్రొటెక్షన్ కోరుకుంటే ఏసర్ మానిటర్ మంచి ఛాయిస్. ఇది 21.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండటం వల్ల స్క్రీన్.. బ్లింక్ అవ్వకుండా కళ్లకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
ప్రత్యేకతలు: 99% sRGB కలర్ గ్యామట్, 100Hz రిఫ్రెష్ రేట్, బ్లూ లైట్ షీల్డ్.
ధర:రూ.7,500-9,000 మధ్య ఉంటుంది.
Also Read: 10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్
సామ్‌సంగ్ ఎం5 కేవలం కంప్యూటర్ మానిటర్ మాత్రమే కాదు, ఇందులో స్మార్ట్ టీవీ ఫీచర్లు కూడా ఉంటాయి. వర్క్ అయిపోయిన తర్వాత వినోదం కోసం కూడా దీన్ని వాడొచ్చు. అడాప్టివ్ పిక్చర్ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా కాంతిని నియంత్రిస్తుంది.
ప్రత్యేకతలు: ఐ సేవర్ మోడ్, ఫ్లికర్ ఫ్రీ, బిల్ట్-ఇన్ స్పీకర్లు, ఓటీటీ యాప్స్ సపోర్ట్.
ధర: రూ.18,000-21,000 మధ్య ఉంటుంది.