E-Paper
Advertisement

భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!

భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!
Advertisement

Miyapur Murder: భార్యా భర్త ఓ బాయ్ ఫ్రెండ్ ఇజ్ ఈక్వల్టూ ఒక మర్డర్ స్కెచ్. ఇదేదో క్రైమ్ రొమాంటిక్ స్టోరీ అనుకునేరు. దేశ వ్యాప్తంగా నడుస్తోన్న లేటెస్ట్ క్రైమ్ ట్రెండ్. పూణే సియా నుంచి మియాపూర్ సత్యవతి వరకూ ఒకటే స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్. కాకుంటే కేరెక్టర్సే వేరువేరు. భార్యాభర్త మొదట హ్యాపీగానే ఉంటారు. ఇంతలో ఆమె ఒక ప్రియుడి మోజులో పడుతుంది. ఇంతలో భర్త అడ్డొస్తాడు. ఆ తర్వాత హబ్బీని అడ్డు తొలగించేసుకోవాలనుకుంటారు. అంతే ఖేల్ ఖతం ఆ పతి దుకాణం బంద్. తాజాగా బయట పడ్డ ఉదంతం.. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

బిల్డర్ పెంటేశ్ ప్రేమకథ..

Advertisement

ఇదిగో ఈ బాధిత భర్తను చూశారా? పేరు పెంటేశ్.ఆల్రెడీ ఒక పెళ్లయ్యి భార్యతో తేడా కొట్టడంతో విడిపోయి వేరుగా ఉండేవాడు. బేసిగ్గా పెంటేశ్ ఒక బిల్డర్. ఆయనకు మియాపూర్ లో సొంతంగా అపార్ట్ మెంట్లున్నాయి. వాటిని అద్దెకు ఇస్తుంటాడు కూడా. అందులో భాగంగా మరో బిల్డింగ్ నిర్మిస్తుండగా ఎంట్రీ ఇచ్చింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవతి. పనికోసం వచ్చిన ఆమె- ఒంటరిగా ఉన్న తనకు పనికొచ్చేలా కనిపించింది. మొదట సహజీవనం మొదలు పెట్టి, ఆపై ఇద్దరూ కలసి పెళ్లి చేసుకున్నారు.

పెంటేశ్ కి ఎలా మొదటి పెళ్లి జరిగిందో. సరిగ్గా అలాగే సత్యవతికి కూడా ఇది వరకే పెళ్లయ్యింది. కానీ, ఇక్కడే పని మనిషి సత్యవతి తన పని తనం చూపించింది. తనకు ఆల్రెడీ పెళ్లయిన సంగతి దాచి పెట్టి.. మీరే నా ఫస్ట్ హజ్బెండ్ అంటూ కలరింగ్ ఇచ్చింది.

Advertisement

Also Read: వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

పెంటేశ్ జీవితంలో మరో ట్విస్ట్..

సత్యవతి రాకతో పెంటేశ్ ఫ్యామిలీ లైఫ్ తిరిగి ఊపందుకుంది. కానీ, కాలం సజావుగా సాగితే.. వింతేముందీ? ఇంతలో మరో కేరెక్టర్ అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆ పాత్ర పేరే మధుసూదన్ రెడ్డి. మధు- పెంటేశ్ అపార్ట్ మెంట్లో అద్దెకు దిగాడు. మధు సూదన్ రెడ్డి- సత్యవతి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. అది వివాహేతర బంధంగా మారింది. ఆపై పెంటేశ్ కి తెలియడంతో ప్రళయంగా రూపాంతరం చెందింది. దీంతో మధుసూదన్ రెడ్డిని ఇల్లు ఖాళీ చేయించాడు పెంటేశ్.

భర్త హత్యకు కుట్ర?..

మాములుగా అయితే ఈ ట్రయాంగిల్ రొమాంటిక్ స్టోరీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలి. కానీ, ఇక్కడే ఈ స్టోరీ క్రైమ్ కహానీగా మలుపు తీసుకుంది. ఇద్దరూ కలసి తమకు అడ్డుగా మారిన పెంటేశ్ ని లేపేయాలని ప్లానేశారు. దీంతో సత్యవతి- తన భర్తకు నిద్రమాత్రలతో కూడిన భోజనం పెట్టింది. అతడా మత్తులో ఉండగానే మొహంపై దిండుతో అదిమి చంపేసింది. తన ప్రియుడు మధుతో కలసి.. పెంటేశ్ డెడ్ బాడీని ఇక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించింది సత్యవతి. తూల్జాపూర్ కి దగ్గర్లో ఒక చోట తన భర్త మృతదేహాన్ని తగలబెట్టేసిందా భార్యామణి.

Also Read: అంతరిక్షంలోకి మన వరంగల్ కళ.. సూది రంధ్రంలో సైన్స్ దిగ్గజాలు, అమెరికాను సైతం అధిగమించి..

బయటపడిన హత్య మిస్టరీ..

అక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. గతేడాది నవంబర్ 19న మియాపూర్ పీఎస్ లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. తనకు పెంటేశ్ నుంచి చివరిసారిగా ఎప్పుడు కాల్ వచ్చిందో కొన్ని వివరాలు చెప్పింది. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీసిన పోలీసులకు అది బేగంపేట నుంచి అని తెలిసింది. వీళ్లే పోలీసులను మిస్ లీడ్ చేయడానికి గానూ పెంటేశ్ ఫోన్ బేగంపేట్ తీసుకెళ్లి అక్కడ స్విచ్డ్ ఆఫ్ చేసినట్టు తెలుసుకున్న పోలీసులు.. తీగలాగారు.

పోలీసులకు దొరికిన కీలక ఆధారాలు..

దానికి తోడు సత్యవతి డైలీ లైఫ్ పై కన్నేసిన బంధువులు పోలీసులకు మరో హింట్ ఇచ్చారు. ఆమె తరచూ ఎవరితో ఎక్కువ మాట్లాడుతోంది? ఏయే హోటళ్లు, రెస్టారెంట్లకు తిరుగుతోంది? వంటి క్లూస్ అందించారు. దీంతో కూపీ లాగిన పోలీసులకు ఆమె బాగోతం మొత్తం తెలిసిపోయింది. రెండో భర్త పెంటేశ్ ను హతమార్చి- తన ప్రియుడితో కలసి ఈ మొత్తం ఆస్తిని ఎంజాయ్ చేయాలని చూసిన సత్యవతి, ఇప్పుడు ప్రియుడితో కలిసి ఊచల్లెక్కిస్తోంది.

Also Read: ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

మరో పిడుగు.. E20 స్థానంలో E25 ఇంధనం, ధర తగ్గుతాది ఒకే.. మరి ఆ డ్యామేజ్?

సిటీలో కోచింగ్ సెంటర్ల గుట్టురట్టు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×