E-Paper
Advertisement

Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

Telangana Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ సారి జరగనున్న బడ్జెట్ సెషన్స్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. బడ్జెట్ సమావేశాలంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోయే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ సారి అలాగే చేస్తారా? అసెంబ్లీ హాజరు కోసమన్నట్లు వచ్చి వెళ్లిపోతారా? లేకపోతే ప్రస్తుత సమావేశాల్లో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటారా అన్నది అటు గులాబీ శ్రేణులతో పాటు అన్ని పార్టీల్లో చర్చకు కారణమవుతోంది.? అసలు బడ్జెట్‌ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహాం ఏంటి?

వ్యూహా ప్రతివ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. సోమవారం ఉదయం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తొలి రోజు అసెంబ్లీ హాలులో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిచనున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎలా వ్యవహారించబోతుందనే చర్చ ఆసక్తకరంగా మారింది. గత అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన బీఆర్ఎస్ …ఈసారి సభలో ఏం చేయబోతుందనేది పొలిటికల్ సర్కిల్స్ చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా వర్క్‌షాప్ కూడా నిర్వహించింది. పార్టీ చరిత్రలో తొలిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ వర్క్‌షాప్‌ జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయడంలో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏకంగా గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో వర్క్ షాపు నిర్వహించి శిక్షణ ఇవ్వడం గమనార్హం.

Also Read: WhatsApp AI Update: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద ప్రభృతులు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమనిబంధనలు , రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తోపాటు పలువురు సీనియర్ నేతలు ప్రసంగించారు. ముగింపు సెషన్ లో కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకం చేశారు. వర్క్‌షాపులో విద్య, వైద్యం, వ్యవసాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సబ్జెక్టులపై ఎక్కువ ఫోకస్ చేశారట.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సభలో బీఆర్ఎస్ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంలో బీఆర్ఎస్ ఉందట. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు తొలగింపు అంశం, హైడ్రా కూల్చివేతలపై పార్టీ గట్టిగా నిలదీయనుందట. రైతు భరోసా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలను బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావు .. సభలో మెయిన్ రోల్ పోషించాలని పార్టీ డిసైడ్ అయిందంట. కేసీఆర్ సభకు దూరంగా ఉన్న సమయంలో సభలో బీఆర్ఎస్‌ వాయిస్‌గా హరీశ్ రావు లీడ్‌ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితులయ్యారు. అంశాల వారీగా ఎవరేవరూ ఏ అంశాలపై మాట్లాడాలనే విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు హరీశ్ రావు,కేటీఆర్ దిశానిర్దేశం చేశారట. కేటీఆర్, హరీశ్ రావు కలిసి ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి అనే విషయంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారంట.

కేసీఆర్ సభకు హాజరవుతారా?

ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ పూర్తిస్థాయిలో పాల్గొంటారా…లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 2025 బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ సభకు హాజరై తన చాంబర్‌లో ఎమ్మెల్యేలతో సమావేశమై వెళ్లిపోయారు. డిసెంబర్‌లో నిర్వహించిన సమావేశాల్లోను కేసీఆర్‌ సభకు వచ్చారు…తొలిరోజు సభకు హాజరైన కేసీఆర్…కొద్ది నిమిషాల పాటు సభలో ఉండి…తర్వాత తన చాంబర్‌లో ఎమ్మెల్యేలతో భేటీ అయి…తిరిగి వెళ్లిపోయారు. తర్వాత సభకు హాజరుకాలేదు. తొలిసారి పార్టీ నిర్వహించిన వర్క్‌షాప్‌కు కూడా హాజరు కాలేదు. కేసీఆర్ సభకు హాజరుకాకపోవడంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు రాకపోవడాన్ని ఆయన కుమార్తె కవిత కూడా తప్పబడుతున్నారు. ఇలాంటి తరుణంలో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎంహాజరు అవుతారో…లేదా అనేది చర్చినీయంశంగా మారింది.

సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్

ఇక పార్టీ మారారంటూ 10మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్‌ చేసిన పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. బీఆర్ఎస్ ఫిర్యాదులను తోసిపుచ్చుతూ స్పీకర్ తీర్పు వెల్లడించారు. సుప్రీంకోర్టులోను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లను డిస్పోజ్ అయ్యాయి. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన కొన్ని తీర్పులపై బీఆర్ఎస్ అసంతృప్తిగా ఉంది. స్పీకర్ ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు తేల్చి చెప్పడంతో దానిపై సభలోనే కాకుండా న్యాయస్థానాల్లో కూడా దీనిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్నారు గులాబీ నేతలు. అయితే సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పడంతో … సభలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ఈ బడ్జెట్ సమావేశాల్లో గులాబీపార్టీ బాయ్‌కాట్ మంత్రం పఠించకుండా, కేసీఆర్ కూడా చర్చల్లో పాల్గొంటే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం ఉందంటున్నారు.

Also ReadAnil Kapoor: ఆ సినిమా నన్ను మిలియనీర్‌ను చేసింది.. అనిల్ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×