E-Paper
Advertisement

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller Series OTT : ఒక హత్యను కళ్లారా చూసిన తర్వాత మనిషి జీవితం ఎలా మారిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా ? బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని, ఇంటికే పరిమితమైపోయిన ఓ రచయిత్రికి టీవీలో కనిపించిన వ్యక్తి తన అక్కను చంపిన హంతకుడేనని అనిపిస్తుంది. అలాంటి టైమ్ లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు అతడిని స్వయంగా ఉచ్చులోకి లాగాలని డిసైడ్ అవుతుంది ఆ మహిళ. ఈ నిర్ణయం ఆమెను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉన్నా, గతాన్ని ఎదుర్కోవాలని సిద్ధపడుతుంది. ఇలాంటి ఎత్తుగడలతో సాగే జర్మన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘ది ట్రాప్’ (The Trap). మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

లీసా కొన్రాడ్ ఓ సక్సెస్ ఫుల్ రచయిత్రి. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ విషాదం పూర్తిగా మార్చేస్తుంది. తన అక్క అన్నా హత్యకు గురైన తర్వాత… దాదాపు పదేళ్లుగా లీసా ఇంటి నుంచి బయటకు రావడం మానేస్తుంది. బయట ప్రపంచం అంటే భయం, గతాన్ని గుర్తు చేసే ప్రతి విషయం ఆమెకు బాధ. తనకు తెలిసిన పరిధిలోనే జీవిస్తూ, ఆ సంఘటనను మనసులో మోస్తూ ఉంటుంది. ఒక రోజు టెలివిజన్‌ లో కనిపించిన ఓ వ్యక్తిని చూసినప్పుడు ఆమెకు గతం మళ్లీ గుర్తుకొస్తుంది. తన అక్కను హత్య చేసిన వ్యక్తి ఇతడేనని లీసా అనుమానిస్తుంది.

Advertisement

ఇన్నేళ్లుగా తనను వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఇదేనని భావిస్తుంది. అయితే కేవలం అనుమానంతో ముందుకు వెళ్లడం ప్రమాదకరం. ఆ వ్యక్తి నిజంగానే హంతకుడా, లేక లీసా గతం కారణంగా తప్పుగా గుర్తించిందా అన్నది మొదటి చిక్కు. పోలీసులపై ఆధారపడటం మాత్రమే కాకుండా, తనే ఓ ప్రణాళిక రూపొందించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అందులో భాగంగా తనను తానే ఎరగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. తన ఇంటి నుంచి బయటకు రావడమే పెద్ద సవాలుగా ఉన్న లీసా, ఇప్పుడు తనను ప్రమాదంలో పడేసే అవకాశం ఉన్న ఆటలోకి అడుగు పెడుతుంది.

మరోవైపు ఆమె అనుమానిస్తున్న వ్యక్తి ఉద్దేశాలు కూడా స్పష్టంగా ఉండవు. వేటాడుతున్నది ఎవరు ? వేటకు గురవుతున్నది ఎవరు ? అన్న విషయం క్రమంగా గందరగోళంగా మారుతుంది. లీసా తన అనుమానాన్ని నిరూపించగలదా ? తన అక్క హత్యకు సంబంధించిన నిజం వెలుగులోకి వస్తుందా ? ఆమె వేసిన ఉచ్చు హంతకుడిని పట్టుకుంటుందా ? లేక ఆమెనే మరో ప్రమాదంలోకి నెడుతుందా ? అనే ప్రశ్నల చుట్టూ కథ నడుస్తుంది.

Advertisement

Also Read : అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

తెలుగులో ఉందా ?

మెలనీ రాబే (Melanie Raabe) నవల ఆధారంగా రూపొందిన ఈ ఆరు భాగాల సిరీస్‌ కు ఇసాబెల్ క్లెఫెల్డ్ (Isabel Kleefeld) దర్శకత్వం వహించారు. ఫ్రీడెరికే బెఖ్ట్ (Friederike Becht), హాన్స్ ల్యో (Hans Löw), మాథియాస్ బ్రాండ్ట్ (Matthias Brandt) ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అన్ని ఎపిసోడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. నెమ్మదిగా ఉత్కంఠను పెంచే సైకలాజికల్ మిస్టరీ కథలు ఇష్టపడే వారికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది.

Tags

Related News

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

బాక్సింగ్ రింగ్‌లో ప్రపంచాన్ని వణికించిన మైక్ టైసన్… కట్ చేస్తే వివాదాలు, జైలు జీవితం, పతనం

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

Big Stories

Advertisement
×