E-Paper
Advertisement

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..
Advertisement

సారీ మోడీ సర్… ఇక మీ పప్పులు ఉడకవు. తమరి ఖేల్‌ ఖతమేనంటూ బిలిబిల బయటకు వచ్చేస్తున్నాయి బొద్దింకలు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తరువాత దేనిపై ఉద్యమం చేయాలో క్లారిటీ మిస్సయ్యింది సీజేపీకి. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై నజర్‌ పెట్టినా అదంతగా ప్రజల్లోకి వెళ్లలేదు.

జంతర్‌ మంతర్‌ తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాన సమస్య ఏదో అంతు చిక్కలేదు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు, మోడీ, అమిత్‌షా విధానాలను ఎండగట్టి ప్రజల ముందు దోషిలా నిలిపేందుకు సమయం కోసం చూస్తున్న బొద్దింకలకు.. తొందరగానే ఓ మంచి సబ్జెక్టు దొరికింది.

Advertisement

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) విధానంతో కేంద్రం ఎన్నికల వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తుందనే అంశంపై మీడియాలో పరిశోధన కథనాలు రావడం, సీఈసీ జ్ఞానేశ్వర్‌ తీరు పూర్తి ఆక్షేపణీయంగా ఉండటాన్ని ఇద్దరు ఎలక్షన్‌ కమిషనర్లే బయటపెట్టిన విధానం.. కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు దీన్నే ప్రధాన అస్త్రంగా తీసుకుని సీఈసీ రాజీనామాను కోరుతూ మరోసారి జంతర్‌మంతర్‌ను ఎక్కేందుకు రెడీ అవుతున్నది జెన్‌జీ.

ఇప్పటికే నీట్ పేపర్ లీక్‌ అంశం..సీజేపీ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నెత్తి బొప్పికట్టి పోయి ఉన్న కేంద్రానికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగానే పరిణామాలు మారనున్నాయి.  అక్టోబర్‌ 2, గాంధీ జయంతి నుంచి ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని, మొన్నటి జంతర్‌మంతర్‌ ఆందోళనకు మించి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నామని సీజేపీ ప్రకటించి ఉంది.

Advertisement

మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా మొదటి నుంచి సర్ విధానంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘంలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా బయటపడ్డ లోపాలన్నీ ఇప్పుడు వివరంగా దేశ ప్రజలముందున్నాయి. మోడీ ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని తప్పులు చేసినా ఛాతి విరుచుకు ప్రకటించే బీజేపీ దోరణికి ఈ పరిణామంతో చెక్‌ పడనుందా? జనాల్లో వ్యతిరేతక తీవ్ర రూపం దాల్చుతున్నదా? సీజేపీ ఆందోళన మరింత ఉద్రిక్తతలకు దారి తీసి.. మొత్తానికి మోడీకి, కేంద్రానికి పెద్ద తలవంపులు తెచ్చి పెట్టనున్నాయా? అనే అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.

ఒక చిన్న సంఘటన.. ఒక ఆరోపణ, తప్పుడు విధానం వల్ల అధికారాన్నే చేజార్చే విధంగా ప్రజా వ్యతిరేకత తెచ్చిపెట్టిన సంఘటనలు.. భారత దేశంలో చాలానే ఉన్నాయి. మొన్నటి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఒకెత్తయితే.. సర్‌ ప్రక్రియ విధానమే పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేదిగా ఉందనే సంకేతాలు వెలుతున్న క్రమం బలపడుతూ వస్తోంది.

ప్రధాన ప్రతిపక్షం ఆరోపించినట్టుగా.. ఓట్‌ చోరీ, ఖానూన్‌ చోరీకి బీజేపీ సర్కార్ పాల్పడుతున్నదనే అభిప్రాయం తాజాగా సీఈసీ ఉదతంలో వెల్లడైన సంఘటనలు నిదర్శనంగా నిలిచేలా ఉన్నాయి. ఇవే ఇప్పుడు డిస్కషన్‌కు వస్తున్న అంశాలు.

జంతర్‌ మంతర్ వేదికను జెన్‌జీ మరోసారి ఉద్యమానికి వాడుకోనుందనే కోణం ఒకటైతే, మళ్లీ రాజీనామానే ప్రధాన డిమాండ్‌గా తీసుకుని మరో ఉద్యమానికి సీజేపీ శ్రీకారం చుడుతోందనే అంశం ప్రధానంగా ఎన్‌డీఏను కలవరపెడుతోంది. లాఠీ చార్జీలు చేయలేరు. పెల్లెట్‌ గన్‌లు వాడలేరు. వాటర్ కెనాన్‌లు ఉపయోగించలేరు. మరేం చేస్తారు..? రాజీనామా చేయిస్తారా? తలొగ్గుతారా? దేశం ముందు తలవంచుతారా? లేక వంచేలా సీజేపీ చేయిస్తుందా? దీనికి కాంగ్రెస్‌ కంచుకోటలా వెన్నుతట్టి ఉద్యమానికి ఊతంగా మారనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అంతటా ఉత్పన్నమవుతున్నాయి.

Tags

Related News

తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

Big Stories

Advertisement
×