Facial for Natural Glow: మీ చర్మానికి సజమైన మెరుపు కావాలంటే.. ఈ ఫేసియల్స్ ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఏదైనా ఫంక్షన్స్, పండుగలు దగ్గర్లో ఉన్నప్పుడు.. అతి తక్కువ టైమ్‌లోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వేలకు వేలు ఖర్చు చేసి.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే నాచురల్‌గా ఇలా ట్రై చేయండి. కేవలం కొన్ని ఇంగ్రీడియన్స్ యూజ్ చేసి 15 నిమిషాల్లో ఫేసియల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫేసియల్స్ అంటే ఖచ్చితంగా మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే.. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, ఫేస్ ప్యాక్
స్టెప్ 1-క్లెన్జింగ్
ముందుగా పచ్చి పాలు తీసుకుని.. ఫేస్ మొత్తం అప్లై చేసి.. దూది కాటన్‌తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మట్టి, మృతకణాలు తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది.
స్టెప్-2-స్క్రబ్బింగ్
చిన్న గిన్నె తీసుకుని.. అందులో టమాటా గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా మూడు నిమిషాలు మసాజ్ చేసుకుని నీటితో శుభ్రంగా కడిగేసుకోండి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
స్టెప్-3 ఫేస్ ప్యాక్
ఫేస్ ప్యాక్ కోసం పాలు, శెనగపిండి, ముల్తానీ మిట్టి, పసుపు, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇలా మీ ఫేస్‌కి అప్లై చేస్తే.. మీ ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.
స్కిన్ గ్లోయింగా కనిపించాలంటే.. ఈ స్టెప్స్ కూడా పాటించండి.. చాలా అందంగా కనిపిస్తారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తలుసుకుందాం.
స్టెప్-1
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు చెంచాలు నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. ముఖంపై నలుపుదనం తగ్గిపోతుంది.
స్టెప్-2
బేకింగ్ సోడాలో కొంచెం వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మురికి, మలినాలు తొలగిపోతాయి.
స్టెప్-4
అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్యూల్స్, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పెట్టుకుని.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ ఫేస్ చాలా, అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.
స్టెప్-4
బంగాళదుంప రసాన్ని దూది కాటన్‌తో ముఖంపై అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: ఒక్క రాత్రిలో మీ ముఖం తెల్లగా మారాలా? అయితే ఈ రెమిడీ మీకోసమే..
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.