E-Paper
Advertisement

AP Deputy Speaker: ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న డిప్యూటీ స్పీకర్

AP Deputy Speaker: ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న డిప్యూటీ స్పీకర్
Advertisement

AP Deputy Speaker: కక్షపూరిత రాజకీయాలు ఉండవు.. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని చేసుకుపోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు పదేపదే ఇదే చెప్తున్నారు.. గత వైసీపీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వారి విషయంలో చంద్రబాబు సానుకూల ధృక్పదంతోనే ఉన్నారు.. వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు కూడా కట్టబెడుతున్నారు.. అయితే పార్టీ కేడర్ని ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ చూపించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదంట. దాంతో వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్న ఒత్తిడి పెంచేస్తున్నారంట.

వైసీపీ హయాంలో ఆర్ఆర్ఆర్‌‌ని తీవ్రంగా వేధించారని ఆరోపణలు

Advertisement

వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసం, చంద్రబాబు నివాసంపై దాడి వంటి దౌర్జన్యాలు ఎన్నో జరిగాయి. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని వైసీపీ సర్కారు తీవ్రంగా వేధించిందన్న ఆరోపణులున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసి సీఐడీ కస్టడీలో టార్చర్ అనుభవించిన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు..

కూటమి అధికారంలోకి వచ్చాక కేసు పెట్టిన రఘురామరాజు

Advertisement

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పట్లో తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయుల్ని ఏ1, ఏ2లుగా చేర్చిన ప్రభుత్వం ఇప్పటివరకూ వారిని అరెస్టు చేయలేదు. అలాగే విచారణకు సైతం పిలవడం లేదు. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటూ పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఐడెంటిఫికేషన్ పెరేడ్‌లో తులసిబాబును గుర్తు పట్టిన ఆర్ఆర్ఆర్

ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయుల్ని ఎందుకు సస్పెండ్ కూడా చేయడం లేదో ప్రశ్నించాల్సిన వారిని త్వరలోనే ప్రశిస్తానంటూ రఘురామ టీజర్ రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కచ్చితంగా వారిపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. తాజాగా ఇదే కేసులో రఘురామ గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో తులసిబాబు ఐడెంటిఫికేషన్ పెరేడ్‌కు వెళ్లిన ఆర్ఆర్ఆర్ అతన్ని గుర్తుపట్టి వచ్చారు. దీంతో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది.

ప్రశ్నిస్తానంటున్న రఘురామకృష్ణం రాజు

అయితే ఈ కామేపల్లి తులసిబాబు టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడంటారు. దీంతో టీడీపీ తులసిబాబు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆర్ఆర్ఆర్‌పై దాడి చేసిన నిందితుడిని ఇంకా పార్టీలో ఉంచడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలోనూ అంతర్గతంగా ఎమ్మెల్యేనా, డిప్యూటీ స్పీకరా తేల్చుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. వెనిగండ్ల రాము ఎన్నారై. ఆయనకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు పార్టీలో బలమైన నేతల అండ ఉందంట. అందుకే ఈ కేసుకు సంబంధించి చర్యల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్నారు.

చర్యల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్న కూటమి శ్రేణులు

అయితే తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ ప్రకటన చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. రెడ్‌బుక్‌లో నోట్ అయిన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదంటున్నారు. విదేశాల్లో కూడా అదే చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వం అక్రమాలపై ఒక్క సారిగా విచారణలు జరిపి చర్యలు తీసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు సరిపోరని, కాలక్రమేణా అందరిపై చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు.

ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు అదే విషయాన్ని పదేపదే విషయాన్ని చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నా చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కూటమి శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆ కన్‌ఫ్యూజన్‌కి కూటమి పెద్దలు ఎప్పుడు తెర దించుతారో అని మిత్రపక్షాల కేడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

 

Related News

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

Big Stories

Advertisement
×