OTT Movie : ఫాంటసీ జానర్ లో వచ్చే హారర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీలో చిన్నపిల్లల్ని మంత్రగత్తెలు ఎలకలుగా మార్చేసి కాళ్లతో తొక్కి చంపుతూ ఉంటారు. అలా చేస్తే ఆ మంత్రగత్తెలకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఈ మూవీ పేరు ఏమిటి? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది విచెస్‘ (The witches). 2020లో విడుదలైన ఈ మూవీకి రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అన్నే హాత్వే, ఆక్టేవియా స్పెన్సర్, స్టాన్లీ టుక్సీ, క్రిస్టిన్ చెనోవెత్, జహ్జీర్ బ్రూనో నటించారు. ది విచెస్ స్ట్రీమింగ్ సర్వీస్ HBO మ్యాక్స్‌లో అక్టోబర్ 22, 2020న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయబడింది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
పది సంవత్సరాల చార్లీకి చిన్నతనంలోనే అనుకోని సంఘటన జరుగుతుంది. తన తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో చనిపోతారు. అప్పటినుంచి చార్లీని తన బామ్మ పెంచుతుంది. అతన్ని ఆ బాధలో నుంచి బయటికి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక వింత ఆడ మనిషి చార్లీకి చాక్లెట్ ఇస్తూ కనిపిస్తుంది. అయితే ఆమె శరీరంలో నుంచి ఒక పాము బయటికి వస్తుంది. అది చూసి భయపడి బామ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తాడు. అప్పుడు ఆ బామ్మ నీ దగ్గరికి వచ్చింది ఒక మంత్రగత్తని చెప్తుంది. కొంతకాలం క్రితం తన ఫ్రెండ్ ని కూడా కోడిగా మార్చేశారని చార్లీతో అంటుంది. వాళ్లు అక్కడక్కడ మనుషుల రూపంలోనే ఉంటారని, ఎక్కువగా పిల్లలను ఎలకల రూపంలో మార్చి చంపుతూ ఉంటారని చెప్తుంది. చార్లీ ని వాళ్ళ నుంచి కాపాడటానికి వేరొక ప్రదేశానికి ప్రయాణం అవుతుంది బామ్మ. ఆ ప్రాంతంలో చిన్న పిల్లలపై జరిగే హింసని అరికట్టే ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మనుషుల రూపంలో ఉండే మంత్రగత్తెలు దీనిని నిర్వహిస్తారు.
ఈ విషయం తెలియని చాలా మంది అక్కడికి వస్తారు. ఈ మంత్రగత్తెలకు హెడ్ అయిన పెద్ద మంత్రగత్తే ఒక లిక్విడ్ తన అసిస్టంట్ లకు ఇస్తుంది. దీనిని కొంచెం తినే పదార్థాలలో కలిపి ఇస్తే, కాసేపట్లోనే వాళ్ళు ఎలకగా మారిపోతారని చెబుతుంది. ఈ క్రమంలోనే అందులో ఉండే ఒక బృనో అనే చిన్న పిల్లవాడికి చాక్లెట్ రూపంలో ఆ పదార్థం ఇస్తుంది. కాసేపట్లోనే అతడు ఎలకగా మారిపోతాడు. ఇదంతా గమనిస్తున్న చార్లీ బాగా భయపడతాడు. చార్లీ ని కూడా ఆ మంత్రగత్తె పట్టుకొని ఎలుకగా మారుస్తుంది. చివరికి ఆ మంత్రగత్తెలను చార్లీ ఎలా ఎదుర్కొంటాడు? వారి బారిన ఇంకా ఎంతమంది పిల్లలు బలవుతారు? చార్లీ మళ్లీ మనిషిగా మారతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ది విచెస్’ (The witches) మూవీని మిస్ కాకుండా చూడండి.