BigTV English

Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంటికి కోర్టు నోటీసులు –  శోకసంద్రంలో ఇందిరాదేవి  

Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంటికి కోర్టు నోటీసులు –  శోకసంద్రంలో ఇందిరాదేవి  

Brahmamudi serial today Episode: కరెంట్‌ షాక్‌ కొట్టిన రుద్రాణిని కర్రతో కొట్టి రక్షిస్తుంది స్వప్న. దీంతో రాహుల్‌, రుద్రాణిలకు  వార్నింగ్‌ ఇచ్చి మీ అమ్మ ప్రాణాలు నేనే కాపాడాను కాబట్టి జీవితాంతం మీరు నాకు సేవలు చేయాలి అంటూ వెళ్లిపోతుంది. రుద్రాణి కోపంగా కరెంట్‌ షాక్‌ ఐడియా నీదేనా అని  రాహుల్‌ను అడుగుతుంది. అంటే నువ్వు వస్తావని నేను అనుకోలేదు అంటాడు రాహుల్‌. దీంతో కర్ర తీసుకుని రాహుల్‌ను కొడుతుంది రుద్రాణి.


అప్పు తనకు ఇష్టమైన బట్టలు ఏవే చెప్తుంటే.. కళ్యాణ్‌ బ్యాగు సర్దుతుంటాడు. అప్పు ఏదేదో చెప్తుంటే.. ఇక నా వల్ల కాదు కూచి నేను సర్దలేను నీకేం కావాలో నువ్వే సర్దుకో అంటాడు. అప్పు బుంగమూతి పెడుతూ.. అంటూ నేను నిన్ను విసిగిస్తున్నానా..? చికాకు తెప్పిస్తున్నానా..? కన్పీజ్‌ చేస్తున్నానా..? అంటుంది. కళ్యాణ్‌.. మాత్రం నేను పాట కూడా ఒక వర్షన్‌ రాసి ఫైనల్‌ చేస్తాను. నువ్వు కిరాణ షాపుకు వెళ్లిన చిన్న పిల్లలా అది ఇది అంటూ నన్ను కన్పీజ్‌ చేస్తున్నావు. నీకేం కావాలో ఒకటి ఫైనల్‌ చేసుకుని  చెప్పు నేను సర్దుతాను. ఏమోద్దు నేను సర్దుకుంటాను అంటుంది అప్పు.. నేను సర్దుతానులే అంటాడు కళ్యాణ్‌.

ఏమీ వద్దులే అంటూ అప్పు బ్యాగు సర్దుకుంటుంటే కళ్యాణ్‌కు అపర్ణ ఫోన్‌ చేస్తుంది. కళ్యాణ్‌ ఎక్కుడున్నావు నేను అడిగితే ఒక నిజం చెప్తావా అని అడుగుతుంది. మీ దగ్గర నిజం దాచాల్సిన అవసరం నాకెందుకు వస్తుంది అంటాడు కళ్యాణ్‌. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంటుంది అపర్ణ. దీంతో అసలు ఏమైంది పెద్దమ్మ అని కళ్యాణ్‌ అడుగుతాడు. కావ్య నీ దగ్గర ఏదైనా చెప్తుందా..? అంటే అవునని అంటాడు కళ్యాణ్‌. రాజ్‌, కావ్య కలిసి మన గెస్ట్‌ హౌస్‌ తాకట్టు పెట్టారు. అది చెప్పారా..? అని అడుగుతుంది. లేదని చెప్తాడు కళ్యాణ్‌. సరే అయితే నేను ఫోన్‌ చేసినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది అపర్ణ. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ కళ్యాణ్‌ ఆలోచిస్తుంటే అప్పు వచ్చి ఏమైంది డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదని నీ ట్రైన్‌కు టైం అవుతుంది వెళ్దాం పద అంటాడు.


మరోవైపు దుగ్గిరాల ఇంటికి కొరియర్‌ వస్తుంది. కావ్య వెళ్లి తీసుకుని చూసి షాక్‌ అవుతుంది. సుభాష్‌ ఏంటమ్మా అది అని అడగ్గానే.. కోర్టు నోటీసు మామయ్య అంటుంది. కోర్టు నోటీసా మనకెవరు పంపించారు చూడు ఎవరు పంపించారో అంటాడు.. సుభాష్‌. ఇంతలో ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ కిందకు వస్తారు. మేమే పంపించాం అని ప్రకాష్‌ చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు. ఇందిరాదేవి కోపంగా ఏంటి అని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ అవును అత్తయ్యా మా వాటా ఆస్థి మాకు కావాలని కోర్టుకు వెళ్తున్నాం. అలా బొమ్మలా నిలబడతారేంటి చెప్పండి అంటుంది. ప్రకాష్‌ అవునమ్మా.. అంటాడు. దీంతో ఇందిరాదేవి కోపంగా తిడుతుంది. దీంతో స్వప్న ఇది వాళ్లకు పుట్టిన బుద్ది కాదు.. ఇందులో మా అత్త హస్తం కచ్చితంగా ఉంటుంది అంటుంది.

రుద్రాణి నాకేం తెలియదని సిటీలో మంచి లాయర్‌ ఎవరంటే నేను చెప్పాను.. కానీ కోర్టు నోటీసులు పంపించడానికి అని నాకెలా తెలుసు అంటుంది. ధాన్యలక్ష్మీ కోసంగా స్వప్న మీ అత్తను ఎందుకు అంటావు.. ఇంట్లో మీ అక్క వెలగబట్టేది చూడటం లేదా..? అంటుంది. ఏరా ఒక్కమాట కూడా మాకు చెప్పకుండా ఇలా చేశావేంట్రా అని ప్రకాష్‌ను అడుగుతాడు. ప్రకాష్‌ అమాయకంగా నీకు ఎన్ని సార్లు చెప్పాను అన్నయ్యా.. నువ్వు కూడా ఎప్పుడూ కావ్యనే సపోర్టు చేశావు. పైగా ధాన్యం పోరు పడలేక కోర్టుకు వెళ్లాల్సి వచింది అంటాడు. దీంతో అపర్ణ తిడుతుంది. మీ నాన్న హాస్పిటల్‌ లో ఉంటే నువ్వు ఇలా చేయడం కరెక్టేనా అంటుంది.  దీంతో ఇంట్లో అందరి మధ్య గొడవ జరుగుతుంది. ఇందిరాదేవి బాధతో ఎమోషనల్‌ అవుతుంది.

ఇంతలో కావ్య కలగజేసుకుని పరిస్థితులు నా చేత అలా మాట్లాడించాయే తప్పా తండ్రి లాంటి మామయ్యగారిని నేను అలా మాట్లాడగలనా..? ఒక్కటి మాత్రం నిజం ఈ ఆస్థి తాతయ్యగారి ఆస్తి ఆయన వారసులందరికీ ఈ ఆస్థి చెందుతుంది. ఇదంతా మూటగట్టుకుని మా పుట్టింటికి మోసుకుపోలేను.. దయచేసి ఇదంతా ఇక్కడితే ఆపండి.. కోర్టు దాకా వెళ్లి.. తాతయ్య, అమ్మమ్మ వాళ్లను బాధపెట్టకండి అంటూ కావ్య ప్రాధేయపడుతుంది. అయినా ధాన్యలక్ష్మీ వినదు. మేము కోర్లు వెళ్తామని కరాకండిగా చెప్తుంది. ప్రకాష్‌ ను అడిగితే కూడా నువ్వు మా మాట విననప్పుడు మేము ఎలా మీ మాట వింటాము అంటాడు. రాజ్‌ కలగజేసుకుని మేము మీకు శత్రువులం కాదు.. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా చేయకూడదు అంటాడు. ఎవరెన్ని చెప్పినా ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ వినరు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×