AP : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించినదేంటి? జనం కోరింది దక్కిందా లేదా? సంక్షేమాభివృద్ధి ఎక్కడి వరకూ వచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కూటమి పాలనపై ప్రజల స్పందన ఎలా ఉంది? సిక్కోలు రోడ్ల నుంచి మొదలు పెడితే.. అనంతపురం అన్న క్యాంటీన్ వరకూ.. ప్రజాభిప్రాయం 90 పర్సెంట్ పాజిటివ్ గా కనిపించింది. ఈ ఏడాదిలో.. ఫించన్ల పంపిణీ మొదటి స్థానంలో నిలుస్తుంది. 64 లక్షల మందికి నెల నెలా రూ. 2720 కోట్లు పంపిణీ చేశారు. ఏడాదిలో ఈ ఖర్చు 34 వేల కోట్ల రూపాయలు.
మెగా డీఎస్సీ.. దీపం 2..
16, 347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి.. మొదటి సంతకం హామీ నెరవేర్చింది ప్రభుత్వం. నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీపం-2 పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వరకూ కోటి సిలండర్లు డెలివరీ చేయగా.. ఈ ఒక్క పథకం కోసమే ఏడాదికి రూ. 2684 కోట్లు వెచ్చించింది. మహిళా లోకం ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తోంది.
రోడ్లు.. అన్న క్యాంటీన్లు..
గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది. రూ.12వందల కోట్లు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రోడ్లు బాగు చేసింది ప్రభుత్వం. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే 217 జీవోను రద్దు చేసింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా రూ. 20 వేల ఆర్ధిక సాయం కింద రూ.259 కోట్లు ఇప్పటికే అందజేసింది. 203 అన్న క్యాంటీన్లు తెరవడం మాత్రమే కాకుండా మరో 61 క్యాంటీన్లను సిద్ధం చేసింది. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చే యత్నం చేస్తోంది ప్రభుత్వం.
మద్యం.. ధాన్యం..
కొత్త మద్యం విధానం ద్వారా జే బ్రాండ్లకు చెక్ పెట్టి.. నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తున్నారు. వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా మన మిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టారు. కూటమి సర్కారు వచ్చాక.. 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందు కోసం 8,50,342 మంది రైతులకు రూ.13,584 కోట్లు చెల్లించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1674 కోట్లను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చెల్లించింది. పంచాయితీల్లో అభివృద్ధి పనులకు రూ.990 కోట్లు కేటాయించింది. రూ.4500 కోట్లతో గ్రామాల్లో వెలుగులు తీసుకొచ్చింది. 30 వేల పనులకు శ్రీకారం చుట్టారు.
ఏపీకి పెట్టుబడుల వరద..
రాష్ట్రానికి రూ.9.28 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. వీటి ద్వారా 5 లక్షల 70 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో 1. 85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంఖుస్థాపన జరిగింది. శ్రీసిటీలో 5 వేల కోట్లతో ఎల్జీ ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. 65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, అమరావతికి కేంద్రం ద్వారా పదిహేను వేల కోట్ల ఆర్ధిక సాయం.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి రూ.11,400 కోట్ల కేంద్రం ప్యాకేజ్.. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం రూ.5 వేల కోట్ల కేటాయింపు, విశాఖ రైల్వే జోన్ మంజూరు, నిర్మాణ పనులు ప్రారంభం.. అనకాపల్లిలో రూ.1 లక్ష 35 వేల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అవగాహన, రామాయ పట్నంలో రూ.96,862 కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం.. ఇలా కూటమి పాలనలో అభివృద్ధి పరుగులుదీస్తోంది.
రైతుల కోసం..
175 నియోజకవర్గాల్లో MSME పార్కులకు ఇప్పటికే 42 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతంగా మారింది. రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించారు. పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మించారు. హంద్రీనీవా కాలువ విస్తరణకు ఒకే ఏడాదిలో రూ. 3800 కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలను పునరుద్దరించారు. గత బడ్జెట్ లో బీసీల కోసం రూ. 47 వేల 456 కోట్లను కేటాయించారు.
బీసీల ప్రభుత్వం..
చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల కేటాయింపు ద్వారా.. ఈ సామాజిక వర్గం వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు, సోలార్ విద్యుత్ పథకం లో బీసీలకు 3 కిలో వాట్లకు గానూ మొత్తం 98 వేల రూపాయల సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం.
చంద్రబాబు మార్క్..
పీఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, వేద విద్యార్ధులకు మూడు వేల రూపాయల భృతి, అర్చకుల జీతాలు పదిహేను వేలు, ఇమామ్ లకు పది వేలు, మౌజన్లకు ఐదు వేలు, పాస్టర్లకు ఐదు వేలు, జూనియర్ లాయర్లకు పదివేల చొప్పున గౌరవ వేతనాలను అందించి ఏడాదిలోనే తన మార్క్ పాలన స్థాయి ఏంటో తెలియ చెప్పింది కూటమి సర్కార్. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను ఇరవై ఐదు వేలకు పెంచారు. అధికారికంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించింది ప్రభుత్వం. అమరావతిలో ఐదెకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం, స్మారకం నిర్మించే ఏర్పాట్లు సైతం చేస్తోంది.
ఉద్యోగుల కోసం..
టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేసింది. యాప్ ల ద్వారా వారి పని భారాన్ని తగ్గించింది. పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేసింది. ఉద్యోగులకు ఏడాది కాలంలో రూ.7500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేసింది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు 1. 50 లక్షల మేరలబ్ది చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశారు. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ తో పాటు.. డ్రగ్స్ గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం సైతం ఏర్పాటు చేశారు.
హైటెక్ ప్రభుత్వం..
నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు, లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఐదు చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు, విశాఖలో టీసీఎస్ తో ఒప్పందం, భూముల కేటాయింపు చేశారు. సరిగ్గా అదేసమయంలో అమరాతిలోనూ క్వాంటం వ్యాలీకి భూములు కేటాయించేలా కేబినేట్ భేటీలో ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం. వీటితో పాటు 72 వేల కోట్ల హైవే ప్రాజెక్టులు, 79 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించింది ప్రభుత్వం. 2245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరయ్యింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశ పెడుతున్నారు. వీటన్నిటి ద్వారా.. ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు భావిస్తున్నారు ఆంధ్రప్రజానీకం.
బాబు వచ్చారు.. మార్పు వచ్చింది..
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు దీస్తుంటే రాష్ట్రం తిరిగి గాడిన పడ్డట్టుగా అభిప్రాయ పడుతున్నారు అధిక శాతం ఏపీ ప్రజానీకం. గతంలో కన్నా పాలన ఎంతో మెరుగ్గా ఉందని.. ఆనాటి రాక్షస పాలన పోయి దేవతల పాలన వచ్చినట్టుగా తాము భావిస్తున్నట్టు చెబుతున్నారు. మిగిలిన పరిపాలనా కాలమంతా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.
Story By –Adinarayana, BIG TV.
ప్రజల అభిప్రాయం ఎలా ఉందో.. పబ్లిక్ బైట్స్ ఈ వీడియోలో చూడండి…