E-Paper
Advertisement

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?
Advertisement

Artemis II: చంద్రుడి వైపు చూస్తే.. తెల్లగా మెరిసే ఉపరితలం కనిపిస్తుంది. కానీ.. అదే చంద్రుడి చీకటి భాగంలో ఒక్కసారిగా చిన్న వెలుగు మెరుస్తే..? ఆర్టెమిస్-2 మిషన్‌లో ఇదే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడి చుట్టూ ప్రయాణిస్తున్న ఓరియన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఆస్ట్రోనాట్స్ .. చంద్రుడి ఉపరితలంపై ఐదు ఫ్లాష్ లైట్ లను గుర్తించారు. అది కూడా దాదాపు 74 వేల కిలోమీటర్ల దూరం నుంచి. ఇంతకీ ఆ ఫ్లాష్ లు ఎలా వచ్చాయి?

ఇంత చిన్న రాళ్లు చంద్రుడిని ఎలా చేరుతున్నాయి..?

Advertisement

చిన్న చిన్న రాతి ముక్కలు.. వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి. ఆ శిలల పరిమాణం.. బహుశా కొన్ని అంగుళాలు మాత్రమే. కానీ వేగం మాత్రం చాలా ఎక్కువ. అంతటి వేగంతో చంద్రుడిని ఢీకొట్టడంతో.. ఆ క్షణంలో భారీ శక్తి విడుదలైంది. అదే.. మన కంటికి కనిపించేంత చిన్న కాంతి మెరుపుగా మారింది. మరి ఇంత చిన్న రాళ్లు చంద్రుడిని ఎలా చేరుతున్నాయి..?

చంద్రుడికీ.. భూమికీ ఉన్న పెద్ద తేడా

Advertisement

ఇక్కడే చంద్రుడికీ.. భూమికీ ఉన్న పెద్ద తేడా. భూమికి వాతావరణం ఉంది. అంతరిక్షం నుంచి వచ్చే చాలా చిన్న రాళ్లు వాతావరణంలోనే కాలిపోతాయి. చంద్రుడికి దాదాపు వాతావరణం లేదు. అందుకే అంతరిక్షం నుంచి వచ్చే చిన్న శిలలు కూడా నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టగలవు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పరిశీలనలు జరిగిన సమయంలో ఓరియన్‌ చంద్రుడి వెనుక భాగం వైపు ప్రయాణిస్తోంది. అదే సమయంలో దాదాపు గంటపాటు సూర్యగ్రహణం లాంటి చీకటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సూర్యుడిని చంద్రుడు అడ్డుకోవడంతో.. చుట్టూ చీకటి మరింత పెరిగింది. దాంతో.. ఈ చిన్న కాంతి మెరుపులు కూడా వ్యోమగాముల కంటికి చిక్కాయి.

చంద్రుడిపై కనిపించిన ఈ 5 చిన్న వెలుగులు

అపోలో మిషన్లలో కూడా వ్యోమగాములు ఇలాంటి ఫ్లాష్‌లను గతంలో గుర్తించారు. చంద్రుడిపై కనిపించిన ఈ 5 చిన్న వెలుగులు.. చూడటానికి చిన్నవే కావచ్చు. కానీ.. భవిష్యత్తులో చంద్రుడిపై మనుషుల నివాసాలకు ఇవి పెద్ద క్లూ. ఎందుకంటే.. చంద్రుడిపై ఎంత తరచుగా చిన్న రాళ్లు పడుతున్నాయో తెలుసుకుంటే.. అక్కడ నిర్మించే హాబిటాట్లు, శాస్త్రీయ పరికరాలు, భవిష్యత్ మిషన్ల భద్రతకు మెరుగైన ప్రణాళికలు రూపొందించొచ్చు.

Also Read: ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

Tags

Related News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

Big Stories

Advertisement
×