E-Paper
Advertisement

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!
Advertisement

Delhi Protest: ఇండీ కూటమి ఢిల్లీ ఆందోళనలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. నీట్‌ పరీక్ష లీక్‌పై జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ పార్టీ చేపట్టిన ఆందోళనను మించి యావత్‌ దేశం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నది. ప్రియాంక గాంధీ కూడా రాహుల్‌ గాంధీకి తోడుగా నిలవడంతో ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతున్నది. పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం, అరెస్టు చేసే క్రమంలో తోపులాటలు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అయినా ఏమాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్‌ నేతలు, ఇండీ కూటమి నాయకులు. ప్రియాంక గాంధీ కింద పడుకుని మరీ పోరాడుతున్న దృశ్యాలను టీవీల్లో జనం చూస్తూ నివ్వెరపోయారు. కేంద్రం వైఖరిపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆందోళన మరింత ఉధృతం..

కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాపై పట్టు పెరుగుతూ వస్తోంది. కేంద్రం పంతానికి పోతూ ఉంది. కయ్యానికి కాలు దువ్విన చందంగానే కేంద్రం తీరు ఉండటంతో ఆందోళన మరింత ఉధృతం దిశగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల కార్యాలయానికి, చీఫ్‌ కమిషనర్‌కు భద్రత పెంచడం పరోక్షంగా ప్రతిపక్షాల ఆందోళనలపై కారం చల్లినట్టే కేంద్రం వైఖరి ఉండటంతో.. అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతోంది. అయితే మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తతల నడుమ రాహుల్ తన గళాన్ని మరింత పదునుగా వినిపిస్తున్నారు. ఆయన తాజాగా తీసుకున్న నినాదం, చేసిన శపథం వైరల్‌గా మారుతోంది.

Advertisement

Also read: ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

రాహుల్‌ కొత్త నినాదం..

దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ఆ నలుగురు కుట్ర పన్నుతున్నారని ప్రధానంగా నలుగురినే టార్గెట్ చేస్తూ రాహుల్‌ కొత్త నినాదం అందుకున్న వైనం చర్చకు వస్తోంది. మోడీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఇప్పుడు తాజాగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కూడా తోడయ్యారు. అందుకే వీరి నలుగురిని ఒక్క గాటనే కట్టారు రాహుల్‌. ఈ నలుగురు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న రాహుల్‌.. ఢిల్లీ ఆందోళనల వేదికగా.. దేశ ప్రజలనుద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి. మీరే చూస్తారు. వీరికి శిక్ష తప్పదు. నాది హామీ… తప్పక వీరికి శిక్షలు పడతాయి..! అంటూ పరోక్షంగా ప్రభుత్వ పతనంపై ఢిల్లీ వేదికగా శపథం చేశారు రాహుల్.

ఇండీయా కూటమి సక్సెస్‌..

Advertisement

కేంద్ర ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టించి, జనం ఓటు హక్కును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో ఇండీయా కూటమి సక్సెస్‌ అవుతోంది. దీనికి తగిన మూల్యం చెల్లించేలా చేసేందుకే ఈ ఆందోళనను ఉధృతం చేస్తోంది ప్రతిపక్ష కూటమి. మొన్నటి వరకు ముగ్గురే టార్గెట్. ఇప్పుడు ఈ ముగ్గురు సరసన.. జ్ఞానేశ్‌ను కూడా చేర్చారంటే ఎస్‌ఐఆర్‌లో అతని జోక్యం, లోపాయికారి తప్పిదాలు ఎంతటి ప్రమాదకరమైనవో తెలియజేయడం రాహుల్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆ నలుగురు అంటూ ఆయన కొత్త నినాదం అందుకున్నారు. మొదట తక్షణ కర్తవ్యంగా జ్ఞానేశ్‌ కుమార్‌ను రాజీనామా చేయించడం ద్వారా ఎన్డీయే సర్కార్‌ కోరలు పీకినట్టేనని భావిస్తోంది ఇండీ కూటమి. సర్కార్‌కు ఇంకా మూడేండ్లు కూడా నిండకముందే ఇంతటి వ్యతిరేకత రావడం,ఈ స్థాయి ఆందోళనలతో హస్తినా అట్టుడికిపోవడం.. ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయమనే సంకేతాలను జనానికి చేరవేయడం కూడా కూటమి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Also read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

Tags

Related News

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

Big Stories

Advertisement
×