E-Paper
Advertisement

ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

ఆపరేషన్ ఫైర్‌వాల్..  విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!
Advertisement

Navy Spy Network: తూర్పు తీరంలో భారత నేవీకి విశాఖ అత్యంత కీలక కేంద్రం. ఈస్టర్న్ నావల్ కమాండ్‌తో పాటు యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతుంటాయిక్కడ. దీంతో రక్షణ సమాచారం కోసం శత్రు నిఘా నెట్‌వర్క్‌లు విశాఖపై ఫోకస్‌ పెడుతున్నాయన్న డౌట్స్‌ ఉన్నాయి. 2019లో డాల్ఫిన్స్ నోస్ కేసులో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా నేవీ సిబ్బందిని వలలోకి దింపినట్టు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో 15 మంది అరెస్టు కాగా.. 11 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు NIA తెలిపింది.

అందాల వల.. రక్షణ సమాచారం ఖాళీ..

Advertisement

ఆ తర్వాత కూడా పాక్ లింక్‌డ్ నేవీ గూఢచర్య కేసులు వెలుగులోకి వచ్చాయి. విశాఖ నుంచి కర్వార్ నేవల్ బేస్ వరకు లింకులు ఉన్నట్టు NIA దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా ద్వారా మహిళా ఏజెంట్లుగా పరిచయం పెంచుకుని నేవీ సిబ్బంది నుంచి సమాచారం పొందేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే ప్లాట్‌ఫామ్ మారినా.. టార్గెట్ మాత్రం రక్షణ సమాచారం అనేది క్లియర్.

ఆపరేషన్ ఫైర్‌వాల్..

Advertisement

ఇప్పుడు ఆపరేషన్ ఫైర్‌వాల్‌తో మరో నెట్‌వర్క్ తెరపైకి వచ్చింది. 18 మంది అనుమానితుల్లో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. ప్రదీప్ ముఖర్జీ, అన్నం సాయి వరప్రసాద్ అరెస్టయ్యారు. సోషల్ మీడియా, వాట్సాప్, వాయిస్‌, వీడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని నౌకలు, జలాంతర్గాములు, కదలికలు, ఫొటోలు లాంటి ఇంపార్టెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ను సేకరించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు రాగా.. దర్యాప్తు కంటిన్యూ అవుతోంది.

Also Read: సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

Tags

Related News

ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ

తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

Big Stories

Advertisement
×