E-Paper
Advertisement

Bengal Elections: బెంగాల్ రణక్షేత్రం.. మమతకు చెక్ పెట్టేందుకు మోదీ మాస్టర్ ప్లాన్!

Bengal Elections: బెంగాల్ రణక్షేత్రం.. మమతకు చెక్ పెట్టేందుకు మోదీ మాస్టర్ ప్లాన్!
Advertisement

Bengal Elections: వెస్ట్ బెంగాల్.. ఇప్పుడు దేశం మొత్తం కళ్లు పెద్దవి చేసుకొని చూస్తున్న స్టేట్. ఎందుకంటే.. అక్కడ ఎన్నికల వాతావరణం అంత హీటెక్కింది. ఈసారి కూడా గెలిచి.. వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు మమతా బెనర్జీ. మరి.. బెంగాల్ ఏమనుకుంటోంది అన్నదే.. మెయిన్ పాయింట్. పరిస్థితులు.. మమతకు సానుకూలంగానే ఉన్నాయా? లేక ఊహించని పరాభవం ఎదురవుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

గత ఫలితాలు చెప్పే కథ

అయితే.. గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాలుంటాయో కొంతవరకు అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈసారి.. కేవలం రెండు దశల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాల్లో గెలిచింది. 2021లోనూ ఏమాత్రం తగ్గకుండా.. 215 సీట్లలో ఘన విజయం సాధించింది. 2016లో.. కేవలం 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. 2021కి వచ్చేసరికి 77 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. 2016లో కాంగ్రెస్ 44, సీపీఎం 26 స్థానాల్లో విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం.. ఒక్క చోట కూడా ఇంపాక్ట్ చూపలేకపోయాయ్. ఫలితంగా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయ్. మరి.. ఈసారి బెంగాల్‌లో ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుందన్నది.. ఆ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఆసక్తి రేపుతోంది.

మమత మ్యాజిక్ కొనసాగుతుందా?

Advertisement

మమతా బెనర్జీకి బెంగాల్ వ్యాప్తంగా కావాల్సినంత పాపులారిటీ ఉంది. ముఖ్యంగా.. మహిళా ఓటర్లలో ఆమెకు ఉన్న ఆదరణ మరే నేతకు లేదు. అదే.. తృణమూల్ కాంగ్రెస్‌ని తిరుగులేని పార్టీగా నిలబెడుతుందనే నమ్మకం.. పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికీ.. క్షేత్రస్థాయిలో టీఎంసీ బలంగా కనిపిస్తోంది. పొలిటికల్ వార్‌ని.. కేంద్రం వర్సెస్ బెంగాల్ అన్నట్లుగా ఫ్రేమ్ చేసే సత్తా మమతకు ఉంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయ్. ఇదే.. బెంగాల్ ఓటర్లు.. మళ్లీ దీదీ వైపు చూసేలా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. అయినప్పటికీ.. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రజల్లో తలెత్తే సహజ వ్యతిరేకత.. ఈసారి కచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. బోనస్‌గా.. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు కూడా ఉన్నాయ్. ఇవన్నీ.. పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు.

మమత ఆగ్రహం ఓట్లుగా మారుతుందా?

అయితే, లక్ష్మీర్ భండార్, స్వస్థ్య సాథీ, యువ సాథీ లాంటి పథకాలతో.. కోట్లాది మందికి ప్రయోజనం కలిగింది. ఈ సంక్షేమ పథకాలు.. టీఎంసీకి సానుకూల పవనాలు వీచేలా చేసే ఛాన్స్ ఉంది. బెంగాల్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై మమతా బెనర్జీ ఆగ్రహవేశాలు ఓటర్లను మొబిలైజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే, అదే ఎస్.ఐ.ఆర్.. చాలా స్థానాల్లో టీఎంసీ కోర్ బేస్‌ని దెబ్బకొట్టబోతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా.. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవడం కూడా టీఎంసీకి ఇప్పుడు సవాల్‌గా మారబోతోందనే టాక్ బెంగాల్‌లో వినిపిస్తోంది.

బెంగాల్‌లో బీజేపీకి మరో ఛాన్స్?

Advertisement

బీజేపీ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలు గెలిచి ఆశ్చర్యపరిచింది కమల దళం. అంతకుముందు 3 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఏకంగా.. బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. ఈసారి కూడా అదే జోష్‌తో.. డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్‌ని బెంగాల్‌లో రీసౌండ్ వచ్చేలా వినిపించేందుకు సిద్ధమైంది. దీనికి మించి.. టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. టీచర్లు, ఆశావర్కర్లు.. ఇలా అనేక వర్గాల్లో ఉన్న యాంటీ టీఎంసీ ఓటర్లందరినీ.. తమ వైపు తిప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయినప్పటికీ.. బెంగాల్ బీజేపీలో.. మమతా బెనర్జీ పాపులారిటీని నేరుగా సవాల్ చేసే స్థాయిలో ఉన్న బలమైన లీడర్ కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో స్ట్రాంగ్ క్యాడర్‌ని నిర్మించుకోవడంలోనూ బీజేపీ వెనుకబడిందనే చర్చ ఉంది. ఆఖరి మైల్ దాకా పార్టీని బలోపేతం చేసే విషయంలో బీజేపీ సీరియస్‌గా కనిపించలేదు.

బెంగాల్‌లో బీజేపీకి అసలు పరీక్ష మొదలు

కేవలం.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలోనూ అధికారమిస్తే.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పడం తప్ప.. చేసిందేమీ లేదనే చర్చ ఉంది. కేవలం.. కేంద్రాన్ని నమ్ముకొనే ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఎస్.ఐ.ఆర్ వల్ల.. కొన్ని స్థానాల్లో బీజేపీకి ఎడ్జ్ ఉంటుందనేది.. కొంత మేలు చేస్తుంది. ఇదే క్రమంలో.. బీజేపీ బలంగా ఉన్న మటువా బెల్ట్, రాజ్‌బాన్షీ ప్రాంతాల్లో.. బీజేపీకి దెబ్బపడుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రజాదరణలో తృణమూల్ కాంగ్రెస్ నేతలతో సరిపోయే నేతలు బీజేపీలో లేకపోవడం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ లెక్కన.. బెంగాల్‌లో ఈసారి బీజేపీ గత ఎన్నికల కంటే ఎక్కవ సీట్లు సాధిస్తుందా? మమత పాపులారిటీని ఏ మేరకు సవాల్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Also Read: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×