Instagram: మెటా సంస్థ తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ నుండి సరికొత్త ‘మ్యూజ్ ఇమేజ్ AI’ (Muse Image AI) మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా సరే మన యూజర్ నేమ్ (Handle) టైప్ చేసి, AI సాయంతో కొత్త ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు. దీనికోసం మన ప్రొఫైల్‌లో ఉన్న పబ్లిక్ కంటెంట్‌ను ఆ AI వాడుకుంటుంది.
పైగా మనకు తెలియకుండానే ఈ కంటెంట్ రీ-యూజ్ అవుతుంది. త్వరలోనే వీడియోల కోసం కూడా ‘మ్యూజ్ వీడియో’ మోడల్‌ను తెచ్చేందుకు మెటా ప్లాన్ చేస్తోంది. అనుమతి లేకుండా మన రీల్స్, ఫొటోలు, ఆడియోను AI వాడకూడదనుకుంటే.. కింద పేర్కొన్న పద్ధతుల ద్వారా దీనిని నిలిపివేయవచ్చు.
మన ఫొటోలను AI వాడకుండా అడ్డుకోవడానికి అత్యంత సులువైన మార్గం మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చడం. దీనికోసం ఇన్‌స్టా యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ పేజీకి వెళ్లాలి. అక్కడ పైన కుడిచేతి వైపు ఉన్న మూడు గీతలను నొక్కి ‘సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ‘Who can see your content విభాగంలోకి వెళ్లి, Account Privacyని క్లిక్ చేసి, Private Account ఆప్షన్‌ను ఆన్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది.
Also Read: వావ్ అనిపించే ఫీచర్లు.. ల్యాప్‌టాప్ కొనేవారికి పండగే, అసూస్ నుంచి ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్!
ఒకవేళ మీ అకౌంట్ పబ్లిక్‌గానే ఉంచుతూ AI మీ కంటెంట్‌ను వాడకుండా చేయాలనుకుంటే మరో మార్గం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. How others can interact with you అనే సెక్షన్‌ను వెతకాలి. అందులో Sharing and Re-use ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ Allow people to re-use your content అనే విభాగంలో పోస్ట్‌లు, రీల్స్‌కు సంబంధించిన టోగుల్ బటన్లను ఆఫ్ చేయాలి. అలాగే ఆడియో రీ-యూజ్ ఆప్షన్‌ను కూడా ఆఫ్ చేసుకోవాలి.
మొత్తం అకౌంట్‌కు కాకుండా కేవలం కొన్ని నిర్దిష్టమైన పోస్ట్‌లకు మాత్రమే AI యాక్సెస్‌ను ఆపాలనుకుంటే.. ఇన్‌స్టాగ్రామ్ అందుకు కూడా అవకాశం ఇస్తోంది. దీనికోసం మీరు ఏ పోస్ట్ లేదా రీల్‌ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో దానిని ఓపెన్ చేయాలి. ఆ పోస్ట్ పైన కుడి వైపున కనిపించే ఆప్షన్లపై క్లిక్ చేసి, Turn off reuse అనే బటన్‌ను నొక్కాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై వచ్చే పాప్-అప్ మెసేజ్‌లో Turn off అని కన్ఫర్మ్ చేస్తే ఆ ఒక్క పోస్ట్‌ను AI వాడలేదు.
Also Read: లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!