E-Paper
Advertisement

Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!

Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!
Advertisement

Prashna Ravan: జోసెఫ్ అనగా ప్రశ్నా రావణ్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదఅయ్యాయి. అయినా రావణ్‌లో ఎటువంటి మార్పు రాలేదు. జోసెఫ్ యువతను, విద్యార్థులను రెచ్చగోట్టి నిషేధిత ఉగ్రవాద, మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాడని అతని పై రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో సామాజిక, మత పరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుందని అతని వివిధ కేసులు నమోదు చేశారు.

మతపరమైన విద్వేషాలు..

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతిని సృష్టించి యుద్ధం చేయాలనే ఉద్దేశం రావణ్‌లో ఉందనీ దర్యాప్తులో తెలిసిందని పేర్కోన్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రావణ్ పవన్ కళ్యాణ్ పై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాష్ట్రంలో రాజ్యంగా బద్ద పదవుల్లో ఉన్న వారిని కూడా రావణ్ దూషించారని పోలీసులు పేర్కోన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, అశాంతి, వైషమ్యాలు సృష్టిస్తున్నారని అన్నారు. రావణ్ రాష్ట్రంలో సామాజిక ఉద్రిక్తతలు, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, మావోయిస్ట్ పార్టీకి చెందిన మాడ్వీ హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడని పేర్కోన్నారు.

Advertisement

Also Read: Urban Bill: జీహెచ్‌ఎంసీ చట్టం రద్దు.. సరికొత్త పాలనపై ముసాయిదా విడుదల!

హిందూ దేవుల్లపై వ్యాఖ్యలు..

దేశంలో నిషేధిత మావోయిస్టు సంస్థల భావజాలాన్ని రావణ్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, హిందూ దేవుల్లపై వ్యాఖ్యలు చేయడం ద్వారా, మతపరమైన భావాలను రెచ్చగొట్టి, అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా రావణ్ పని చేస్తున్నారని పేర్కోర్కోన్నారు. తన పేరు జోసెఫ్ అయినా కూడా రావణ్ అనే పేరును పెట్టుకోవడం కూడా అందులో ఒక భాగమే అని అన్నారు. రావణ్ కు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరో తేల్చాల్సి ఉందని, రావణ్ వెనుక కొందరి పాత్ర ఉందని, త్వరలో వారిని కూడా విచారించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం కోంత మంది వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Also read: బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !

Related News

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×