BigTV English

Telangana BJP: లోటస్ మార్క్ లుకలుకలు.. కేంద్రం మొట్టికాయలు

Telangana BJP: లోటస్ మార్క్ లుకలుకలు.. కేంద్రం మొట్టికాయలు

తెలంగాణ బీజేపీలో గ్రూప్ తగాదాలు

అధిష్టానం వీరినెలా గాడిన పెడతారన్న విషయమై ఉత్కంఠతెలంగాణ బీజేపీలో గ్రూప్ తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయట. పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ పై అధిష్టానం కన్నెర్ర చేస్తోందట. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామ క్రమాలపై ఢిల్లీ కి గట్టి రిపోర్టులే వెళ్లాయట. దీంతో అమిత్ షా, నడ్డా రాష్ట్ర నేతలకు దిమ్మ తిరిగే క్లాసులైతే పీకారట.


రాజాసింగ్ రూపంలో మరో హెడ్డేక్

ఇప్పటికే పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. మీలో మీకే గ్రూపు తగాదాలున్నాయని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి కూడా. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు రాజా సింగ్ రూపంలో ఉన్న హెడ్డేక్ ఎన్ని శారిడాన్ మాత్రలు వేసుకున్నా తగ్గని దుస్థితి. ఆయనసలు రాష్ట్ర పార్టీగానీ కార్యాలయంగానీ పట్టకుండా పేరలల్ గా పార్టీ నడుపుతున్నట్టు ఏకంగా పేపర్లు, టీవీల్లో పతాక శీర్షికలకు ఎక్కడంతో ఇదెక్కడి గొడవో అర్ధం కావడం లేదని వాపోతున్నారట సగటు కమలం పార్టీ కార్యకర్తలు.

గ్రూప్ పాలిటిక్స్ ఆపకుంటే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరిక

ఎప్పుడైతే రాజా సింగ్ దాదాపు సొంత కుంపటి పెట్టినంతగా రెచ్చిపోతున్నారో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చేజేతులా.. ఆయుధాలు సప్లై చేసినట్టు అవుతోందట. ఇదే పెద్ద సమస్య అనుకుంటే.. గ్రూప్ పాలిటిక్స్ కారణంగా పార్టీకి భారీ ఎత్తున డ్యామేజీ జరుగుతోన్నట్టు కేంద్ర నాయకత్వం ఫిక్సయ్యిందట. ఒక వేళ మీరుగానీ.. మీ తీరుగానీ మార్చుకోకుంటే.. సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

2018 నాటికీ 2023 నాటికీ స్టేట్ బీజేపీలో చాలానే తేడా

2018 ఎన్నికల నాటి సీన్ కి.. 2023 ఎన్నికల తర్వాతి నాటి సీన్ కీ తెలంగాణ బీజేపీలో చాలానే తేడా. అప్పట్లో ఒక్కడంటే ఒక్కడిగా.. రాజాసింగ్ రూపంలో ఉన్న అసెంబ్లీ సీట్ సీనేరియో.. తాజాగా ఎనిమిది మందికి ఎగబాకింది. ఇక ఎంపీల్లో కూడా అష్టదిగ్గజాల్లా..ఎనిమిది మంది లోక్ సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు.. ఇద్దరు కేంద్ర మంత్రులు బండి, కిషన్ రూపేణా.. రాష్ట్ర బీజేపీకి ఫ్లాగ్ షిప్- లీడర్షిప్ మెయిన్ టైన్ చేస్తున్నారు కూడా. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ విజయ బావుటా ఎగుర వేయటంతో.. ఏకంగా ప్రధాని మోడీ నుంచే ప్రశంసల వర్షం కురిసిన పరిస్థితులు.వచ్చే స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయిత్తం చేసి.. చాపకింద నీరులా మరింత ముందుకెళ్లాలనుకుంటే.. ఈ గ్రూపు తగాదాలేంటో అర్ధం కావడం లేదని వాపోవడం.. బీజేపీ అగ్రనాయకత్వానికి అతి పెద్ద సవాలుగా నిలుస్తోందట.

కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కాదు బీజేపీ ప్రత్యామ్నయం అన్న సంకేతాలనిస్తోన్న గణాంకాలు

ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు బీజేపీ.. అన్న సంకేతాలనిస్తోంది బీజేపీ గణాంకాల పట్టిక. అంతగా బీఆర్ఎస్ కుదేలయ్యి కూర్చుంది. ఈ సిట్యువేషన్లో.. స్థానిక బీజేపీ నేతలు కుదురుగా ఉండాలన్నది పై నుంచి అందుతున్న సందేశాల సారాంశం. కానీ ఇక్కడ వీరు మాత్రం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బృందగానాలు వినిపిస్తున్నారట. దీంతో ఢిల్లీ పెద్దలు తెలంగాణ బీజేపీ పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

రిజర్వేషన్ల అంశంలో ఫుల్ కన్ ఫ్యూజన్లో రాష్ట్ర బీజేపీ

రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫుల్ కన్ ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వైపు మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది బీజేపీ. అసెంబ్లీ సాక్షిగా.. ఈ అంశాన్ని లేవనెత్తడంలో.. లోకల్ లోటస్ గ్యాంగ్ మొత్తం ఫెయిల్ అయ్యిందనే టాక్ నడుస్తోంది.

ఆ 42 శాతం రిజర్వేషన్లు ముస్లిమ్స్ ని కలుపుకునా? కలకుండానా?

తాజా తెగని పంచాయితీ ఏంటంటే.. ముస్లిమ్స్ ని కలుపుకుని బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇచ్చారా? లేక 10 శాతం ముస్లిం రిజర్వేషన్లను తీసేసి.. బీసీలకు 42 శాతం ఇచ్చారా? ఇటు బీజేపీ ఎమ్మెల్యేలకే కాదు అటు ఎంపీల కూడా ఒక క్లారిటీ లేనేలేదట. అంతే కాదు రాష్ట్ర నాయకత్వంలోనే అగ్ర నేతలుగా పేరున్న వారికి కూడా ఈ విషయంలో ఒక స్పష్టత లేదట. 10 శాతం రిజర్వేషన్లపై ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని నిలదీయటంలో ఎందుకు విఫలమయ్యారనే చర్చ ఇందుకు అదనం. ఈ అంశాన్ని సభలో కనీసం ప్రస్తావించక పోవడమేంటి? అన్న విషయమై అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం.

కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేల కామెంట్

అయితే ఈ విషయంలో కేంద్రానికి మరో రకమైన సమాధానాలు వెళ్లాయట. రాష్ట్ర నాయకత్వం నుంచి తమకు సరైన గైడెన్స్ లేదని ఎమ్మెల్యేలు ఉల్టా బనాయించారట. దీంతో వీరెంత ఇన్ డైరెక్టుగా అన్నా.. అది నేరుగానే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిందట. ఏది ఏమైనా.. రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రాకుంటే.. సోమవారం నుంచి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేలా పోరాడుతామని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారట బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి.

సోమవారం నుంచి ప్రభుత్వ కుట్ర అడ్డుకుంటామన్న ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి

అయితే ఇలాంటి కంటి తుడుపు చర్యలతో పెద్దగా ప్రయోజనం లేదన్న మాట కూడా ఇంతే స్థాయిలో వినిపిస్తోందట. రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టేటపుడు.. పాస్ అయ్యేటపుడు.. స్పందించకుండా.. కనీసం అడ్డుకునే యత్నం చేయకుండా.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు అన్నట్టు.. ఏంటీ నిర్లక్ష్యం? ఇలాగేనా.. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేదన్న సందేహాలు సొంత పార్టీ లీడర్ల నుంచే వ్యక్తమవుతున్నాయట.

కేంద్ర పెద్దలు మొట్టికాయలు వేసే వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తించక పోవడమేంటి?

ఈ విషయంలోనే రాష్ట్ర పార్టీ ఎంత అప్రమత్తంగా ఉందో అర్ధమై పోవట్లేదా? అన్న ప్రశ్న వినిపిస్తోందట. ఎక్కడో ఉన్న కేంద్ర పెద్దలు.. ఈ విషయం గుర్తించి మొట్టికాయలు వేసే వరకూ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు విషయం అర్ధం చేసుకోక పోవడమేంటన్న చర్చ నడుస్తోందట.

ఎమ్మెల్యేలొక గ్రూపు, ఎంపీలొక గ్రూపు, రాష్ట్ర నాయకత్వం మరో గ్రూపు..

ఇవన్నీ ఇలాగుంటే.. మీ లక్ష్యం కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వల్ల పార్టీకి నష్టమని మీకు అర్ధం కావడం లేదా? అన్న మాట వినిపిస్తోందట. కాంగ్రెస్ కి మనం ప్రత్యామ్నాయం అని ఎస్టాబ్లిష్ కావాలి కానీ.. నానాటికీ డీలా పడుతున్న బీఆర్ఎస్ తో పోటీ పడ్డమేంటన్న ప్రశ్న తలెత్తుతోందట.

BJYM-అసెంబ్లీ ముట్టడిలో బయట పడ్డ ఎమ్మెల్యేల అనైక్యత

బీజేపీ గుర్తు కమలంలో ఎన్ని రెక్కలున్నాయో.. తెలీదు కానీ, రాష్ట్ర పార్టీ నాయకత్వంలోనూ అంతకన్నా మించిన లుక లుకలున్నాయని పార్టీ కేడర్లో బహిరంగ చర్చ నడుస్తోందట. ఒకప్పుడు బీజేపీ అంటే ఓ ఇద్దరు ముగ్గురు నేతల పేర్లే ఎక్కువగా వినిపించేవి. వారిలో ఎన్నేసి తగువులున్నా.. పైకి మాత్రం ఒక్కటిగానే కనిపించేవారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలొక గ్రూపు, ఎంపీలొక గ్రూపు, రాష్ట్ర నాయకత్వం మరో గ్రూపు.. ఇదే అతి పెద్ద వ్యవహారం అనుకుంటే.. పాత-కొత్త నేతలది మరో గ్రూపు తయారవడంతో.. తలపట్టుకుంటోందట కేంద్ర అధిష్టానం. ఇక సంస్థాగతంగానూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారట. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ గల ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుచుకునే పార్టీ లీడర్లేనా? ఇలా బిహేవ్ చేస్తోందన్న మాట కూడా వైల్డ్ గానే వినిపిస్తోందట. వీళ్లందరిలోకీ రాజాసింగ్ ది అయితే.. అతి పెద్ద సమస్యాత్మకంగా మారిందట.

రబ్బర్ స్టాంప్ అధ్యక్షులు వద్దంటూ మరో వాదన తెరపైకి

ఎంపీల పరిస్థితి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేల్లో ఒకరిపట్ల మరొకరికి ఒక సఖ్యత అంటూ ఉండాలి. వారి మధ్య స్పష్టమైన ఐక్యత ఉన్నట్టు వెలుగు చూడాలి. కానీ, ఇటీవలBJYM ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి వ్యవహారంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మరోరకమైన చర్చకు తెరలేపిందట. ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందన్న మాటకు దీంతో మరింతగా ఊతమిచ్చినట్టు అయ్యిందట. ఇటు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్, అటు రిజర్వేషన్ వంటి పలు అంశాల పట్ల స్పష్టత కొరవడ్డం.. వంటి వాటితో.. రాష్ట్ర బీజేపీలో వర్గ విబేధాలున్న మాట వాస్తవం అన్నది తేట తెల్లమై పోయిందట. అసలు పోరు వదిలి కొసరు పోరాటం చేస్తున్న వీరందికీ గట్టిగానే బుద్ధి చెప్పాలని కేంద్ర నాయకత్వం కూడా అంతే బలంగా భావిస్తోందట. దీంతో పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందన్నది మరో చర్చకు తెరలేచిందట.

అధిష్టానం వీరినెలా గాడిన పెడతారన్న విషయమై ఉత్కంఠ

తాజాగా మాకు.. రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దన్న వాదన తెరపైకి రావడం తెలిసిందే. ఇక పార్టీలో కొందరు సీనియర్లు.. ఎవరు సీఎంగా ఉంటే, వారితో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారనీ.. పాత స్క్రాప్ బయటకు పోతేనే పార్టీ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటీవల రాజాసింగ్ చేసిన కామెంట్ల కాక.. సంగతి సరే సరి. దీని ప్రకారమే.. వీరంతా వ్యవహరిస్తున్నట్టు కేంద్ర నాయకత్వం దృష్టికి వెళ్లిందట. ఈ అంశంపై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద స్టేట్ లోటస్ లో జరుగుతున్న గ్రూప్ గొడవలపై అధిష్టానం పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీరినెలా గాడిలో పెడతారన్నది ఉత్కంఠభరితంగా మారిందట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×