BigTV English

Bed Light Alarm: వేకప్ లైట్.. నిద్రపుచ్చే అలారం.. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ..

Bed Light Alarm: వేకప్ లైట్.. నిద్రపుచ్చే అలారం.. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ..

Bed Light Alarm: ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్‌లో వేళకు నిద్రపోవడం,నిద్ర లేవడం క్లిష్టంగా మారింది. ఉదయం లేవాలంటే అలారం మోగలేదనో లేజీగా ఉందనో ఏవేవో కారణాలు చెబుతుంటాం. అయితే ఇక ఆ సాకులు చెప్పకుండా ఈ ‘వేకప్ లైట్’ను వాడొచ్చు. ఇది వేళకు నిద్రపుచ్చడమే కాదు వేళకు అలారం పెట్టి మరీ మనల్ని లేపుతుంది.


ఇది ఉత్త బెడ్‌లైట్ మాత్రమే కాదు. మంచి అలారం కూడా! ఇందులోని 6 వాట్ల బ్లూటూత్ స్పీకర్ సిస్టమ్ మరో అదనపు సౌకర్యం. పడుకునే సమయంలో ఈ బెడ్‌లైట్‌ను ఆన్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న దీని యాప్ సాయంతో కోరుకున్న సంగీతాన్ని వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఇది అలెక్సా సాయంతో పని చేస్తుంది.

మన కళ్లకు ఇబ్బంది లేకుండా దీని కాంతిని కోరుకున్న స్థాయిలో, కోరుకున్న రంగుల్లో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పడుకునే ముందు పొద్దున్నే నిద్ర లేవాల్సిన సమయాన్ని అలారంలో సెట్ చేసుకుంటే చాలు. వేళకు ఠంచనుగా నిద్రలేపుతుంది. అమెరికన్ కంపెనీ డబ్ల్యూఐఐఎం ఈ అలారం బెడ్లైట్‌ను ‘వేకప్ లైట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. మీకూ నచ్చితే కొనేయండి మరి.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×