E-Paper
Advertisement

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Bellampalli: ఈ కథ మొదలైంది స్వచ్ఛ సర్వేక్షన్‌తో. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా 2021లో బెల్లంపల్లి వార్డుల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ట్రాలీలు వచ్చాయి. వాహనాలు కొన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చెత్త కుప్పల్లోనే మూలుగుతున్నాయి. మొత్తం 34 వార్డులకు గాను నడుస్తున్నవి కేవలం 13 ట్రాలీలు మాత్రమే. అదికూడా డ్రైవర్ల కొరతతో రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే వచ్చి చెత్త ఎత్తుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..

దీంతో వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కొన్ని వార్డులు డంపింగ్‌ యార్డులుగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క అధికారుల నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్‌ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పాత వాహనాలకు మరమ్మతులు చేయించకుండా, కొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Also read: తెలంగాణలో 22A రచ్చ.. సామాన్యుడి ఆస్తి హక్కులపై బీజేపీ పొలిటికల్ వార్!

మళ్లీ కొత్త వాహనాలు..

లక్షల రూపాయలు వెచ్చించి తెప్పించిన జేసీబీని కూడా మూలన పడేశారని MCPIU నేతలు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లిలో ఉన్న ట్రాలీలను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాత వాహనాలను రిపేర్‌ చేయించకుండా, మళ్లీ కొత్త వాహనాలకు తెరలేపడంలో అసలు రహస్యం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. బొగ్గు గనుల బెల్లంపల్లి.. ఇప్పుడు చెత్త రాజకీయంతో వేడెక్కింది. మూలన పడ్డ వాహనాలను తిరిగి రోడ్డెక్కిస్తారా? మున్సిపల్‌ అధికారులు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

Advertisement

Also read: వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

Tags

Related News

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

Big Stories

Advertisement
×