E-Paper
Advertisement

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!
Advertisement

Veligonda Project: ఐదేళ్లో.. పదేళ్లో కాదు.. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు దగ్గర రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఫేజ్‌-1 ప్రారంభం కానుంది. ఈ చారిత్రక క్షణాన్ని కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల మండలాల రైతులు, యువత, మహిళలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తర్వాత.. మళ్లీ తానే ప్రారంభిస్తుండటం అదృష్టమని ఆయన చెప్పారు.

రెండో దశలో..

శ్రీశైలం నుంచి 18.8 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా కృష్ణా నీటిని నల్లమల సాగర్‌కు తరలిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 10 వేల కోట్లకు పైనే. తొలి దశలో లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని అంచనా. రెండో దశలో 3 లక్షల 28 వేల ఎకరాలకు నీళ్లు చేరతాయి. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్‌ పీడిత, కరువు ప్రాంతాలకు ఇది ప్రాణాధారం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, కరవు మండలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ తెలిపారు. పంటల వైవిధ్యం, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ ట్యాప్‌ కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు.

Advertisement

Also read: టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

అరుదైన ఘట్టం..

మరోవైపు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటికే.. 6 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయలు అందించారు. మిగతా 132 కోట్ల పరిహారాన్ని త్వరలోనే చెల్లించనున్నారు. శంకుస్థాపన చేసిన చేయే.. ప్రారంభోత్సవం చేసే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణా నీళ్లు కరువు నేలకు చేరాక.. ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయంటున్నారు.

Advertisement

Also read: NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

Tags

Related News

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

Big Stories

Advertisement
×