E-Paper
Advertisement

అక్రమ బంధం పెట్టిన ఘోర వినాశనం.. ఇంటిపై పెట్రోల్ పోసిన బాధితులు!

అక్రమ బంధం పెట్టిన ఘోర వినాశనం.. ఇంటిపై పెట్రోల్ పోసిన బాధితులు!
Advertisement

Bhadradri: రహస్యంగా మొదలైన ప్రతి అక్రమ బంధం.. బహిరంగమైన రోజు తెచ్చే ప్రళయాన్ని తట్టుకోలేరు. కక్షలు, కత్తులు, కన్నీటి వరదలు ఊరు ఊరంతా రగిలే చిచ్చును ఎవరూ ఆపలేరు. భద్రాది కొత్తగూడెం జిల్లా జింకలగూడెం గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌, మౌలానా ఇద్దరు ప్రాణస్నేహితులే.. కానీ ఇప్పుడు ప్రాణాలు తీసుకునేంత బద్ధశత్రువులయ్యారు. ఓ వైపు ఆవుల అక్రమ రవాణాను మౌలానా అడ్డుకుంటున్నాడన్న కసి.. మరోవైపు వివాహేతర బంధం తెచ్చిపెట్టిన ద్వేషం ఇస్మాయిల్‌లో రాక్షసత్వాన్ని నింపాయి.

రక్తంమడుగులో..

లాస్ట్ సండే మౌలానా నడిరోడ్డుపై విపరీతమైన గాయాలతో రక్తంమడుగులో పడి ఉన్నాడు. గ్రామస్తులు హుఠాహుటినా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్‌ కావాలనే కారుతో ఢీకొట్టి మౌలానాను చంపాలని చూశాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందో పక్కన పెడితే.. మౌలానా పరిస్థితి విషమించింది. శనివారం తెల్లవారుజామున ఆస్పత్రి బెడ్‌పైనే ప్రాణాలు విడిచాడు.

ఇంటిపై పెట్రోల్‌ పోసి..

Advertisement

మౌలానా మృతి వార్త.. గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వ్యక్తిని పోగొట్టుకున్న దుఃఖం.. క్షణాల్లోనే ఆగ్రహంగా మారింది. ఆవేశం నషాళానికెక్కిన గ్రామస్తులు నేరుగా నిందితుడు ఇస్మాయిల్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆ ఇల్లు.. ఎన్నో ఏళ్ల కక్షను, ద్వేషాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది.

Also raed: నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

నిందితుడి ఇంటి ముందే..

Advertisement

అంతటితో ఆగలేదు కుటుంబసభ్యులు.. మౌలానా పార్థివదేహాన్ని నేరుగా నిందితుడి ఇంటి ముందే ఉంచి కన్నీటి నిరసనకు దిగారు. రోదనలు.. ఆవేశపూరిత నినదాలతో ఆ వీధి దద్దరిల్లిపోయింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి పరుగులు తీసి మంటలను ఆర్పివేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఎలాగోలా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పగుళ్ల చరిత్ర..

ఒక్క తప్పటడుగు ఇంటి గోడల్లో పగుళ్ల చరిత్రను పరిచయం చేసింది. క్షణికమైన మోహం వెంట పరుగులు తీస్తే చివరకు మిగిలేది రక్తపు చరిత్రలే.. నెత్తుటి గాయాలే.. అక్రమ సంబంధాలవైపు అడుగులు వేశారా. మీ కుటుంబాల్ని మీరే పాతళంలోకి నెట్టిసినట్టే..

Also read: నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×