E-Paper
Advertisement

కరీంనగర్ జిల్లాలో గజదొంగలు హల్‌చల్.. జంకుతున్న స్థానికులు!

కరీంనగర్ జిల్లాలో గజదొంగలు హల్‌చల్.. జంకుతున్న స్థానికులు!
Advertisement

Gangadhara Theft: గడియారంలో ముల్లు రెండున్నర దాటింది. ఊరంతా గాఢనిద్రలో మునిగిపోయింది. కానీ ఆ చిమ్మని చీకట్లో.. ఎవరో నీడలా కదులుతున్నాడు. వీడే దొంగ.. ఇళ్లకు తాళం వేసి కనిపిస్తే చాలు. వీడి చేతులకు పనిదొరుకుతుంది. తాళం పగులకొట్టకుండానే దాన్ని ఊడదీయడం వీడి టాలెంట్.. ఇంట్లోకి దర్జాగా వెళ్లి ఇళ్లంతా సోదా చేస్తాడు. ఎక్కడ ఏ చిన్న విలువైన వస్తువు కనిపించినా దాన్ని జేబులో వేసుకుంటాడు. గోల్డ్, సిల్వర్, క్యాష్ దేన్ని వదిలిపెట్టడు. బీరువాలో దాచినా.. పరుపు కింద దాచినా వెతికి మరీ కొట్టేస్తాడు.

ఏ శబ్దం లేకుండా..

ఈనెల 28వ తేదీ.. రాత్రి సరిగ్గా 2గంటల 20 నిమిషాలు. కరీంనగర్ జిల్లా మధురానగర్‌లోని మునిందర్‌ ఇంటి తలుపు వద్ద ఆగింది ఆ నీడ. నిశ్శబ్దంగా.. ఏ శబ్దం లేకుండా.. తాళం విరిచేసింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు తమ పనిముగించుకుని మాయమయ్యారు. కొన్నిరోజుల గ్యాప్ తర్వాత అవే నీడలు.. తాళాలు వేసి ఉన్న ఇళ్ల జాడలను వెతుక్కుంటూ బయల్దేరాయి. ఈసారి నేరుగా గంగాధర మండల కేంద్రంలోని కనపర్తి మల్లికార్జున్ ఇంటి దగ్గర ఆగాయి ఆ నీడలు.

Advertisement

Also read: ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

తాళం వేసి ఊరెళ్లారు..

అసలే పండుగ పూట.. ఇళ్లకు తాళాలేసి బంధువుల ఇళ్లకు వెళ్లడం మామూలే. కానీ ఆ ఖాళీ ఇళ్లే.. ఇప్పుడు దొంగల కళ్లు గురిపెట్టిన లక్ష్యాలు. గంగాధర మండల కేంద్రానికి చెందిన కనపర్తి మల్లికార్జున్‌ కూడా అదే చేశారు ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఉదయం.. మల్లికార్జున్‌ ఇంటికి తిరిగివచ్చాడు. కళ్లముందు కనిపించిన దృశ్యం గుండె జల్లుమనిపించింది. పగలగొట్టిన తలుపు తాళం.. చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లను చూసి గుండె వేగం పెరిగింది.

15 తులాల కాళ్ల పట్టీలు..

Advertisement

లోపలికి వెళ్లి చూస్తే.. అలమారు ఖాళీ. 2 తులాల బంగారు గొలుసు.. 15 తులాల కాళ్ల పట్టీలు.. 45వేల నగదు — అన్నీ మాయమయ్యాయి. వెంటనే వణుకుతున్న చేతులతో పోలీసుకు ఫోన్ కొట్టాడు. పోలీసులు సైరన్ వేసుకుంటే వెంటనే వాలిపోయారు. క్లూస్‌ టీం వేలిముద్రల కోసం, ఆధారాల కోసం ఇంటిని జల్లెడ పట్టారు. వంశీకృష్ణ గంగాధర ఎస్సై. గంగాధర ఇప్పుడు గజదొంగల అడ్డాగా మారింది. ఇంటికి తాళం పడితే చాలు.. రాత్రి దొంగలు పడుతున్నారు. గల్లీ గల్లీకి ఐదారు సీసీ కెమరాలున్నా.. తాళాలు ఊడుతూనే ఉన్నాయి. బీరువాల్లో సొమ్ము మాయం అవుతూనే ఉంది. కన్నీళ్లు మిగులుస్తున్న ఈ గజదొంగల ఆటను పోలీసులు కట్టిస్తారా? గ్రామస్తుల భయాన్ని పోగొడతారా?

Also Read: డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

Tags

Related News

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!

అక్రమ బంధం పెట్టిన ఘోర వినాశనం.. ఇంటిపై పెట్రోల్ పోసిన బాధితులు!

గండక్ నది ఉప్పెనపై బీహార్ హై అలర్ట్.. నేపాల్ ప్రళయంతో డేంజర్ బెల్స్!

Big Stories

Advertisement
×