E-Paper
Advertisement

తెలంగాణలో 22A రచ్చ.. సామాన్యుడి ఆస్తి హక్కులపై బీజేపీ పొలిటికల్ వార్!

తెలంగాణలో 22A రచ్చ.. సామాన్యుడి ఆస్తి హక్కులపై బీజేపీ పొలిటికల్ వార్!
Advertisement

Telangana 22A: 22A తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ ప్రెజర్‌ క్రియేట్‌ చేస్తోంది. భూమి 22Aలో ఉంటే సాధారణంగా దాని రిజిస్ట్రేషన్‌పై ఆంక్షలు వస్తాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, బూదాన్, ఎండోమెంట్, వివాదాస్పద భూములు వంటి వివిధ కేటగిరీలను రక్షించడమే ఈ నిషేధ జాబితా అసలు ఉద్దేశం. కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది. తప్పు సర్వే నంబర్లు, పాత రికార్డులు, డేటా ఎంట్రీ పొరపాట్ల కారణంగా ప్రైవేట్ భూములు కూడా 22A జాబితాలోకి వచ్చాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని ఇప్పుడు బీజేపీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటోంది.

భూమి భద్రత లేదు..

ప్రజల భూములపై హక్కులు లేకుండా చేసే 22A నిబంధనలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అంటే సమస్యను కేవలం రిజిస్ట్రేషన్ శాఖ సమస్యగా కాకుండా… రైతులు, మధ్యతరగతి, సామాన్య ప్రజల ఆస్తి హక్కుల సమస్యగా బీజేపీ ప్రొజెక్ట్ చేస్తోంది. అందుకే దీక్షతో పాటు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. రాజకీయంగా చూస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే అంశమే. అంటే 22Aని ఒక ఇష్యూగా కాకుండా కాంగ్రెస్ పాలనలో సామాన్యుడికి భూమి భద్రత లేదు అనే యాంగిల్‌లో పోరాటం చేయాలన్నది బీజేపీ వ్యూహం.

Advertisement

Also Read: హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఆగస్టు 24 నాటికి..

ప్రతిపక్షాల ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ కూడా సిద్ధంగానే ఉంచుకుంది. ఇప్పటికే ప్రభుత్వం.. 22A జాబితాలో అధికారుల పొరపాట్లు జరిగాయని అంగీకరించింది. అంతేకాదు ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, కేసులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తామని చెబుతోంది. ఆగస్టు 24 నాటికి 980 ఫిర్యాదుల్లో సుమారు 90 శాతం పరిష్కరించామని, పెండింగ్ రిజిస్ట్రేషన్లలో 98 శాతం క్లియర్ చేశామని అధికారులు చెబుతున్నారు. 22Aని రద్దు చేస్తే ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులు, ఎండోమెంట్, అసైన్డ్ భూములకు రక్షణ ఉండదు అనేది ప్రభుత్వ వాదన. ప్రభుత్వం 22Aని రద్దు చేయకుండా… తప్పుగా చేర్చిన భూములను ఒక్కొక్కటిగా తొలగించి, ఆన్‌లైన్‌లో రికార్డులు క్లియర్ చేస్తే… బీజేపీ చేస్తున్న 22A వల్ల ప్రజల భూములు బ్లాక్ అయ్యాయి అనే ప్రచారం బలహీనపడే అవకాశం ఉంది.

తెలంగాణలో 22A..

Advertisement

బీజేపీ అసలు టార్గెట్ 22A కంటే పెద్దదే. ప్రభుత్వం తప్పులను అంగీకరించాల్సి వచ్చింది. దాన్ని పట్టుకునే… ప్రభుత్వం విఫలమైంది. ప్రజల భూముల విషయంలో గందరగోళం సృష్టించింది అనే రాజకీయ దాడిని మరింత పెంచాలని బీజేపీ చూస్తోంది. ప్రభుత్వం చెబుతున్న క్లీనప్ ప్రజలకు కనిపించే స్థాయిలో జరిగేలోపు బీజేపీ ఈ అంశాన్ని ఎంతవరకు రాజకీయంగా విస్తరించగలుగుతుంది? అనేదే తెలంగాణలో 22A వివాదానికి పొలిటికల్ ట్విస్ట్.

Also read: ఏఐ టెక్నాలజీతో సంచలనం.. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ నినాదంతో షార్ట్ ఫిల్మ్!

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×