Varun Tej Comments : మెగా ఫ్యామిలీలో అందరూ అగ్రిసివ్ మోడ్‌లోనే ఉంటారు. మెగాస్టార్ చిరంజివి కాస్త కూల్‌గా కనిపించినా… నాగ బాబు, పవన్ కళ్యాణ్‌తో సహా చాలా మంది అగ్రిసివ్ మోడ్‌లో కనిపించడం మనం చాలా సార్లు చూశాం. అయితే అందరిలో వరుణ్ తేజ్ వ్యక్తిత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూనే కనిపిస్తుంటాడు. కానీ, నిన్న (ఆదివారం) మట్కా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మొదటిసారి వరుణ్ తేజ్ చుట్టూ కాంట్రవర్సీ అలుముకుంది.
వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే సినిమా రాబోతుంది. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. వరుణ్ తేజ్ ఎప్పుడు మాట్లాడిన చాలా సహజంగా అనిపిస్తుంది. తన మొదటి సినిమా ముకుంద అప్పుడు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఇంక తన తండ్రి నాగబాబు ఉన్నది ఉన్నట్లు చెబుతారు గాని వరుణ్ మాత్రం కాంట్రవర్సీ కి దూరంగా ఉంటాడు. తన చెల్లెలు నిహారిక నటించిన ఒక మనసు ఆడియో ఫంక్షన్ కి అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. అల్లు అర్జున్ స్పీచ్ అంతటిలో దాదాపు పవన్ కళ్యాణ్ ప్రస్తావన మాత్రమే వచ్చింది. అయితే అప్పుడు కూడా చేతులు కట్టుకొని సైలెంట్ గా కూర్చున్నాడు తప్ప ఒక మాట కూడా మాట్లాడలేదు.
కానీ నిన్న వరుణ్ మాట్లాడిన కొన్ని మాటలు కొంతమందికి కంట్రోల్ తప్పడా అని అనిపిస్తున్నాయి. ఇంతకు వరుణ్ మాట్లాడిన మాటలు ఏంటంటే.. “మొన్న ఎవరో అన్నారు ప్రతిసారి మీ పెదనాన్న,బాబాయి గురించి మాట్లాడుతూ ఉంటారు అని.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్ళిద్దరూ, వాళ్ళు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయం మర్చిపోతే మనం ఎంత సక్సెస్ సాధించాం అనేది కూడా వేస్ట్ అని చెప్పుకొచ్చాడు.” వరుణ్ మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ వచ్చిందో మనకి తెలియంది కాదు. ఒకప్పుడు టైం దొరికిన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఆఖరికి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా శివాజీ క్యారెక్టర్ ను అల్లు అర్జున్ తో పోల్చి రాశారు. ఇవన్నీ కామన్ గా యాంటీ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు.
Also Read : Samantha: తల్లి కావాలని ఉంది.. హాట్ బాంబ్ పేల్చిన సమంత..!
ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ ఎందుకు అలా మాట్లాడాడు అని చాలామందికి కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా వరుణ్ మీద ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే అల్లు అర్జున్ పై మొదట స్పందించిన వ్యక్తి నాగబాబు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళగానే ఇన్ డైరెక్ట్ గా ట్విట్టర్ వేదిక కొన్ని ట్వీట్స్ కూడా చేశారు. అలా నాగబాబు స్పందించడం వల్లనే ఈరోజు ఒక కొడుగ్గా వరుణ్ కూడా కంట్రోల్ తప్పడా అని చర్చలు మొదలయ్యాయి.