Big Stories

CM Revanth Return Gift to KCR: కేసీఆర్‌కు రేవంత్ రిటర్న్ గిఫ్ట్.. మామూలుగా లేదుగా

- Advertisement -

అవును.. గులాబీ పార్టీకి గడ్డుకాలం ఎదురవబోతోంది. ఆ పార్టీ ఏది ముట్టుకున్నా కలిసి రావడం లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల టైం ఉంది. సో ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. ఇప్పటికైతే ఎంపీలెవరూ ఆ పార్టీ నుంచి గెలవలేకపోయారు. సో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తున్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. అది కూడా వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఇది జరిగిపోయేలా ప్లాన్ నడుస్తోందంటున్నారు.

- Advertisement -

పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే.. బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందంటున్నారు. అయితే ఓసారి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైపోల్ వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో సంఖ్య 38కి తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Also Read: రాహుల్ గాంధీ బర్త్ డే.. విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ఫైనల్ గా గులాబీ పార్టీకి ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో 22 మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ఎల్పీ విలీనమవుతుంది. ఇప్పటి లెక్క ప్రకారం 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంత చేసినా విలీనానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. సో విలీనానికి టైం ఉన్నా.. ప్రస్తుతానికైతే 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్నైతే ప్రయోగించింది. నిజానికి హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తూ వచ్చారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఈ కోరస్ తగ్గలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు చూసి వచ్చే వారికి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలని డిసైడ్ అయ్యారు. నిజానికి పార్టీ మారాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న కేసీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో నాలుగున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నచ్చజెబుతున్నారు. అయితే గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తమ సెగ్మెంట్ కు, నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారని అసంతృప్త ఎమ్మెల్యేలు చెబుతున్న మాట.

నిజామాబాద్ జిల్లా నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యే.. హస్తం పార్టీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానానికి ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ ఓకే చేస్తే.. ఈ చేరిక జరుగుతుందంటున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో మరింత బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇప్పటికే పాలమూరు లోక్ సభ స్థానంలో హస్తం పార్టీ గెలవలేకపోయింది. అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో అక్కడ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించారు. పార్టీని పాలమూరులో మరింత బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేశారు.

అటు మెదక్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఒకరు క్యాబినెట్ బెర్త్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు.. వారి రాకను అడ్డుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ చూపించలేకపోయింది. మొన్నటి కంటోన్మెంట్ బైపోల్ తో పుంజుకున్నా.. మిగితా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలనుకుంటోంది. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

Also Read: కేసీఆర్‌కు కరెంటు షాకులు.. చత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంలో తిరకాసులేంటి?

అదే సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ కావాలనుకుంటున్న వారు కూడా హస్తం పార్టీలో ఉన్న తమ పాతమిత్రులను సంప్రదిస్తూ బెర్త్ కన్ఫామ్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. గ్రేటర్ పరిధి నుంచి నలుగురు గులాబీ ఎమ్మెల్యేలు హస్తంతో టచ్ లో ఉన్నారంటున్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం రకరకాల పదవుల తాయిలాలను రెడీ చేశారంటున్నారు. విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు. అయితే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తమకు బీఆర్ఎస్ హయాంలో ఎదురైన చేదు అనుభవాలను, సహకారం అందించని విషయాన్ని, కేసీఆర్ దర్శనం లేకపోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారట.

ఇంకోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందంటున్నారు. నిజానికి కొందరు గులాబీ నేతలు తమ వ్యాపారాలు కాపాడుకునేందుకు, కేంద్ర దర్యాప్తు సంస్థల రెయిడ్స్ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ బీజేపీలోకి ప్రచారం జోరందుకున్న టైంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసిందంటున్నారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News