Janhvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ప్రస్తుతం సౌత్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. దివంగత నటి శ్రీదేవి (Sridevi) వారసురాలుగా ఇండస్ట్రీకి ధడక్ సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైన ఈమె ప్రస్తుతం రామ్ చరణ్(Ramcharan) పెద్ది(Peddi ) సినిమాలో నటిస్తున్నారు.
సౌత్ పై ఫోకస్ చేసిన జాన్వీ….
ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తాజాగా సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన పరం సుందరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు తన తల్లి శ్రీదేవి సినిమాల గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. దివంగత నటి శ్రీదేవి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా వందల సినిమాలలో నటించిన శ్రీదేవి కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నాయి .
రీమేక్ కు సిద్ధమైన చాల్ బాజ్…
ఈ క్రమంలోనే శ్రీదేవి గారు నటించిన సినిమాలలో తనకు చాల్ బాజ్(Chaalbaaz) సినిమా రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది కాస్త వైరల్ అవుతుంది. శ్రీదేవి, రజనీకాంత్ (Rajinikanth), సన్నీ దేవోల్ నటించిన ఈ క్లాసిక్ సినిమా రీమేక్ చేయబోతున్నారని తెలియడంతో శ్రీదేవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ సినిమాలో శ్రీదేవి పాత్రలో జాన్వీ కపూర్ నటించబోతున్నారు. మరి ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు ఇతర నటీనటులు ఎవరు? ఏంటి? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాని రీమేక్ చేయబోతున్న నేపథ్యంలో శ్రీదేవి గారికి నివాళులు అర్పించినట్టు ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో పెద్ది…
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు ఈమె రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా తాజాగా మైసూర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో భాగంగా టైటిల్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్లో భాగంగా చిత్ర బృందం శ్రీలంక వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Rama Naidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్ లో దారుణం.. ప్రొఫెసర్ కు తప్పని వేధింపులు!