BigTV English

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో  అదరగొట్టిన మణికంఠ..!

Bigg Boss 8 Day 33 Promo1.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పుడు 33వ రోజుకి చేరుకుంది. ఈ రోజుకు సంబంధించి ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో మార్నింగ్ మస్తీ అంటూ చాలా ఫన్నీగా సాగింది. మరి ఈ ప్రోమోలో చిలక జోస్యంతో మణికంఠ అదరగొట్టేసారని చెప్పాలి. మరి ఆ ప్రోమో ఏంటో ఇప్పుడు చూసేద్దాం.


నేను చెప్పిందే జరుగుద్ది..

33వ రోజు మొదటి ప్రోమోకు సంబంధించి, బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్..” నేను చెప్పిందే జరుగుద్ది”.. మణికంఠ ఇంటి సభ్యులందరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో జాతకం చెప్పాల్సి ఉంటుంది అంటూ ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగానే మణికంఠ జ్యోతిష్యుడు గెటప్ లో అదిరిపోయాడని చెప్పవచ్చు. ఇక టాస్క్ అలా మొదలైందో లేదో అప్పుడే నబీల్ జాతకం చెప్పడం మొదలెట్టేశారు మణికంఠ. ఏ రోజు పుట్టావు అని అడగ్గా 22 ఫిబ్రవరి అని చెబుతాడు నబీల్. దానికి ఏదో ఆలోచించి.. బేషుక్ అయిన జాతకమే అని చెబుతాడు మణికంఠ.. ఆ తర్వాత సీత గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా కనుక్కో అని అడిగితే.. భూతద్దం పెట్టి మరీ చూస్తూ రేకలు చాలానే ఉన్నాయ్ అబ్బాయ్ అంటూ అందరినీ నవ్వించేశాడు మణికంఠ. టైగర్ ఏమైనా చేతిలో కనిపిస్తోందా చూడు అని నబీల్ అడగగా.. అడవిలో సింహాలు, నక్కలు అన్నీ వుంటాయి బాబూ.. అందులో నువ్వు షేర్ వి.


జ్యోతిష్యుడిగా అదరగొట్టిన మణికంఠ..

ఇక తర్వాత ప్రేరణ వంతు వచ్చింది.. ప్రతిసారి చీఫ్ కి దగ్గర్లో వచ్చి చేజారిపోతోంది అంటూ తన బాధను చెప్పుకుంది ప్రేరణ. దీంతో మణికంఠ.. తల్లీ నీ నోట్లో ఎవరూ ఆగలేరు.. ఎంత ఖర్చీఫ్ అయినా చీఫ్ అయినా నీ ముందు దిగదుడుపే. ఆ తర్వాత విష్ణు ప్రియ వచ్చి ఈ హౌస్ లో.. నాకు అంతా బానే ఉంది. కానీ ఒక వ్యక్తి మీద మనసు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటోంది అని అంటుంది. దీంతో మణికంఠ ఈ బిగ్ బాస్ పంజరంలో రెండు ప్రేమ చిలకలు అంటే మీవే తల్లీ అంటూ పృథ్వీ, విష్ణుప్రియ ను చూపించేశారు. ఆ తర్వాత యష్మీ సింగిల్గానే ఉండిపోతానా లేక వైల్డ్ కార్డు ఎంట్రీ లో ఎవరైనా మంచి హ్యాండ్ సమ్ హంక్ వస్తారా..? అని అడిగింది. దీంతో మణికంఠ హంక్ అంటే వాడు నీతో బంక్ అయితాడమ్మా అంటూ నవ్వించాడు మణికంఠ. చీల్చి చెండాడే టైపు నువ్వు. ఎంగిలి పడిన ఇస్తరాకు కూడా చిరిగిపోవాల్సిందే. పని మణికంఠ అంటే, దానికి యశ్మీ.. అది క్లారిటీ ఉందిగా నీకు అంటూ నవ్వించేశారు .ఆ తర్వాత సీతతో టాప్ ఫైవ్ లో ఉండే అంచనాలు కనిపిస్తున్నాయి అని తెలిపాడు. అలా మొత్తానికి అయితే జ్యోతిష్కుడు గెటప్ లో మణికంఠ అగరగొట్టేసారంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Huzurabad Politics: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Big Stories

×