BigTV English

Trinayani Serial Today October 4th: ‘త్రినయని’ సీరియల్‌: లలితమ్మకు  వార్నింగ్‌  ఇచ్చిన తిలొత్తమ్మ – వల్లభకు చీరలు  తీసుకురాలేదన్న హాసిని

Trinayani Serial Today October 4th: ‘త్రినయని’ సీరియల్‌: లలితమ్మకు  వార్నింగ్‌  ఇచ్చిన తిలొత్తమ్మ – వల్లభకు చీరలు  తీసుకురాలేదన్న హాసిని

trinayani serial today Episode:  లలితాదేవి పూజ కోసం తీసుకొచ్చిన చీరలను  అందరికీ ఇస్తుంది. ఇంతలో వల్లభ మా అమ్మకు  ఇవ్వరా ఏంటి అని అడుగుతాడు. ఎందుకు లేవు అంటూ ఆ ఎల్లో చీరను తిలొత్తమ్మకు  ఇవ్వమని వల్లభకు ఇస్తుంది. ఇంతోల వల్లభ మళ్లీ మాకు లేవా అంటూ అడుగుతాడు. ఇప్పుడు ఆడవాళ్లకు మాత్రమే తెచ్చానని దసరా పండగకు పంపిస్తానులే అమ్మవారి పూజ అని ఆడవారికే తీసుకొచ్చాను అని చెప్తుంది లలిత. తర్వాత వల్లభ లోపలికి వెళ్లిపోయాక వీడితో ఎలా కాపురం చేస్తున్నావు హాసిని అని అడుగుతుంది. అసలు చేస్తేనే కదా? అంటుంది. దీంతో నయని అక్కా అంటుంది. మీ మాటలు తర్వాత త్వరగా రెడీ అవ్వండి పూజకు టైం అవుతుంది అని లలిత చెప్పగానే సరే అని నయని, హాసిని లోపలికి వెళ్తారు.


బయటకు  ఫోన్‌ చూస్తూ  ఉన్న సుమన దగ్గరకు విక్రాంత్‌ వస్తాడు. పూజకు టైం అవుతుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి? అని అడుగుతాడు. పూజలో మీరు కూర్చోవడం లేదు. నన్ను కూర్చోబెట్టడం లేదు అప్పుడు ఇంక రెడీ కావడం దేనికి అంటుంది సుమన. చీర ఇస్తారట అని విక్రాంత్‌ చెప్పగానే ఆత్రుతగా దగ్గరకు వెళ్లిన సుమన చీరేంటి అని అడుగుతుంది. పూజలో కూర్చునే మీకు పెద్దమ్మ చీరలు  తీసుకొచ్చిందట అని చెప్పటానే వాళ్లు ఇస్తేనే నేను చీరలు కట్టుకుంటున్నానా..? అని వెటకారంగా మాట్లాడుతుంది.

విక్రాంత్‌ కోపంగా సుమనను తిడతాడు. తల మీద కొడుతే అడుగు భూమిలోకి వెళ్లిపోతావు జాగ్రత్త. పూజ చేయడానికి నీకెందుకు ఇంత అయినా నువ్వు రావొద్దులే ఈ కొత్త చీరలు ఎవరు  బాగా కడితే వాళ్లకు గిఫ్టులు ఇస్తారట అని చెప్పగానే సుమన ఆత్రంగా అసలు  విషయం చివరలో చెబుతారేంటి అని అసలు గిఫ్టులు ఏంటి అని అడుగుతుంది. నాకు తెలియదు. అది పెద్దమ్మకు తెలుసు అని విక్రాంత్‌ చెప్పగానే సరే అయితే పూజకు నేను రెడీ అవుతాను అంటూ లోపలికి వెళ్తుంది.


తిలొత్తమ్మ దగ్గరకు వల్లభ చీర తీసుకెళ్లి ఎలా ఉందని అడుగుతాడు. బాగానే  ఉందని తిలొత్తమ్మ చెప్పగానే నీకోసం నేనే తెచ్చాను అంటాడు. దీంతో నాకోసం నువ్వు మంచినీళ్లు కూడా తీసుకురావు కానీ ఈ చీర తెచ్చాను అంటే ఎలా నమ్మాలి అంటుంది. ఇంత ఖరీదైన చీర నేను తీసుకురాలేను కానీ ఇది పెద్ద పెద్దమ్మ తీసుకొచ్చింది. పూజకు అందరికీ చీరలు తెచ్చింది వాటిలో ఇది నీకు బాగుంటుందని నా పెళ్లాం.  నయని నీకు ఈ చీర సెలెక్ట్‌ చేశారు అని చెప్తాడు. దీంతో చీరలదేముందిరా.. ముందు ఆ భుజంగమణి ఎలా కొట్టేయాలో ఆలోచిద్దాం అంటూ లోపలికి వెళ్తారు.

ఇంట్లో మానసాదేవి పూజలకు నయని, హాసిని అన్ని ఏర్పాట్లు  చేస్తారు. అమ్మవారిని చూసిన లలితమ్మ అమ్మవారు చాలా అందంగా ఉన్నారని చెప్తుంది. డెకరేషన్‌లో నా చేయి కూడా ఉంది అని చెప్పు చెల్లి అంటుంది హాసిని. నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది  కాదు వదిన అంటుంది. ఇంతలో అందరూ  వస్తారు. ఎవ్వర పిల్లలను తీసుకురాలేదేంటి అని లలితమ్మ అడుగుతుంది. పూజలో ఉండాల్సింది భుజంగమణి కానీ పిల్లలు కాదు కదా? అంటూ చెప్తారు.

మణి ఎక్కడుంది నయని అని విశాల్‌ అడగ్గానే కొత్త బట్టలో చుట్టి  కిచెన్‌ లో పెట్టిందని లలితమ్మ చెప్పి నువ్వు వెళ్లి తీసుకురా హాసిని అంటుంది. దీంతో సుమన, తిలొత్తమ్మ కూడా నేను వెళ్తానంటే నేను వెళ్తాను అంటూ హాసినితో పాటు కిచెన్‌ లోకి పరుగెడతారు. కిచెల్‌ లోకి వెళ్లి మణిని వెతుకుతుంటారు. మణి ముందు  మా అమ్మకే దొరకాలి అని వల్లభ మనసులో అనుకుంటాడు. లోపల మణి కోసం ముగ్గురు వెతుకుతుంటారు. బయట హాల్లో పూజ చేయడానికి ముందు  దీపాలు వెలిగిస్తుంటారు. లోపల మణి ఎవరికీ దొరకకపోవడంతో ముగ్గురూ బయటకు వచ్చి లోపల మణి లేదని చెప్తారు. నయని లోపలే ఉందని చెప్తుంది.

లేదు కచ్చితంగా అక్కడ మణి లేదని చెప్తారు. దీంతో నయని ఎవరో తీసి ఉంటారు అని చెప్తుంది. ఇంతలో లలితమ్మ సరే ముందు పూజ అయితే చేయండి అని చెప్తుంది. మణి లేకుండా పూజ చేయోచ్చా పెద్దమ్మ అని విశాల్‌ అడుగుతాడు. మణి ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా ఏం కాదులో అంటుంది లలితమ్మ.  దీంతో పూజ పూర్తి చేస్తారు. పూజ అయిపోయాక లలితమ్మ వెళ్లిపోతానంటుంది. దీంతో తిలొత్తమ్మ ఆగు అక్కా నువ్వు కొట్టేసిన భుజంగమణిని ఇక్కడ పెట్టేసి వెళ్లు అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?

GudiGantalu Today episode: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Nindu Noorella Saavasam Serial Today october 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన మంగళ

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Gundeninda Gudigantalu Prabhavathi: ‘గుండెనిండా గుడిగంటలు ‘ ప్రభావతి రియల్ లైఫ్.. అస్సలు ఊహించలేదు..

Mogalirekulu Devi : ‘మొగలిరేకులు’ దేవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?

Big Stories

×