E-Paper
Advertisement

VishnuKumar Raju: విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి?

VishnuKumar Raju: విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి?
Advertisement

VishnuKumar Raju:  ఉత్తరాంధ్రలో బీజేపీ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుగారు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు…. మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ జరిగితే ఖచ్చితంగా తనకి అవకాశం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు… బిజెపి సిద్ధాంతాలకు లోబడి పని చేసే సైనికుడిగా మాత్రమే కాకుండా కూటమిలోని చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో మంత్రి పదవి వస్తుందని ఆయనలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది… ఉత్తరాంధ్రలో బిజెపి నుండి వాయిస్‌ని గట్టిగా వినిపించే విష్ణుకుమార్‌రాజు మంత్రి పదవి కోసం వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదంట… మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా?

మంత్రివర్గంలో మార్పులుచేర్పులపై కూటమి నేతల ఆశలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 16 నెలలు కావొస్తుంది…. పరిపాలనలో కూటమి పార్టీల అధినాయకత్వం నుండి కిందిస్థాయి నాయకులు వరకు భాగస్వాములై 16 నెలలుగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా.. మేమంతా ఒకటే అనే సంకేతాన్ని ఇచ్చి పాలన సాగిస్తున్నారు… అలా కూటమి ప్రభుత్వం ఏర్పడిందో లేదో ఆరు నెలలు గడిచిన వెంటనే మంత్రివర్గ విస్తరణ గాని మార్పులు చేర్పులు గాని జరుగుతాయని మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎదురుచూపులు చూడడం ప్రారంభించేశారు.

Advertisement

ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు గాని జరిగే అవకాశం ఉందా అంటే కేవలం ఎప్పటికప్పుడు ప్రచారం మాత్రం జరుగుతుంది. కానీ సీఎం చంద్రబాబు ఆచరణలోకి ఎప్పుడు తీసుకుని వచ్చి తన క్యాబినెట్లోకి కొత్త ముఖాలను చూపిస్తారో అర్థం కావడం లేదు… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలంటే కనీసం రెండు సంవత్సరాల సమయం అయిన తీసుకుంటారు…. క్యాబినెట్ లో ఉన్న వాళ్లపై అవినీతి మరకలు అంటుకుంటేనో, కొత్త వాళ్లకి క్యాబినెట్లోకి అవకాశం కల్పించాలని ఆలోచన ఉంటేనే తప్ప వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉండదు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మూడేళ్లకు మంత్రి వర్గాన్ని మార్చి పాత వాళ్లతో పాటు కొత్త వ్యక్తులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపారు… కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 16 నెలలే గడుస్తున్నా, ఎప్పటినుండో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది క్యాబినెట్లో మార్పులు జరుగుతాయి అంటూ జోరుగా ప్రచారం రాష్ట్రంలో సాగుతోంది… దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టేస్తున్నారు…

మంత్రి వర్గ విస్తరణలో ప్రచారం

ఏపీ ప్రభుత్వం నుండి ముఖ్యంగా కూటమి పార్టీల నుండి ఇప్పటివరకు క్యాబినెట్లో జరిగే మార్పుల గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. ఇలా ప్రచారం జరగడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పని చేస్తున్న కొంతమంది మంత్రుల విషయంలో కూటమి పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు బయటకు రావడం, చేతిలో అధికారం ఉన్న కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదాని కూడా పొందలేని వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే భావన ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా జరుగుతుంది అనే ప్రచారం జోరు అందుకుంది.

కేజినెట్ సహచరులపై సీరియస్.. సీఎం

Advertisement

మంత్రివర్గ సమావేశాల్లో సీఎం, మంత్రులకు దిశా నిర్దేశం చేయడం చూస్తూనే ఉంటాం… కోపంలోనో మంత్రివర్గ సహచరులను జాగ్రత్తగా ఉంచడం కోసమో సీఎం తన కేబినెట్ సహచరులపై సీరియస్ గా మాట్లాడే సందర్భాలు చూస్తూనే ఉంటాం… మంత్రివర్గ సమావేశాల్లో సీఎం నోటి నుండి ఏదైనా ఒక మాట వస్తే చాలు బయట ఉండే మీడియా అదిగో మంత్రివర్గ ప్రక్షాళన ఇదిగో మంత్రుల మార్పులు అంటూ ఆకాశాన్నంటే ప్రచారాలు చేసేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు అనే ప్రచారం రావడానికి కూటమిలోని పార్టీల్లో ఆశావహులే కారణమంటున్నారు.

నాగబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారా?

మూడు పార్టీల్లోనూ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో చిన్న అవకాశం వచ్చినా తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశలతో ఎదురుచూపులు చూస్తున్నారు…. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీకి కీలక నేతగా ఉన్న నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అని ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. నాగబాబు ఎమ్మెల్సీ అయినా ఎందుకో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ జరగకలేదు..

బిజెపికి మరో మంత్రి పదవి ఆశ

ఏపీ క్యాబినెట్లో సీఎం కాకుండా మొత్తం 25 బెర్తులు ఉన్నాయి… 2024 జూన్ 12న జరిగిన మంత్రివర్గం 24 మందితో మాత్రమే కూర్పు జరిగింది… మంత్రివర్గంలో 20 మంది టీడీపీ నుంచి ముగ్గురు జనసేన నుండి ఒకరు బిజెపి నుండి క్యాబినెట్లో స్థానం సొంతం చేసుకున్నారు…. ఎప్పటినుండో బిజెపికి మరో మంత్రి పదవి వస్తుందనే ఆశ వెంటాడుతుంది… ఎందుకంటే మంత్రివర్గంలో బిజెపికి అన్యాయం జరిగిందని ఫీలింగ్ ఉండడంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బిజెపికి మరో స్థానం వస్తుందని ఆశ ఉండడంతో ఈ ప్రచారానికి ఊపందుకుంది.

2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్‌రాజు

బిజెపికి మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది… బిజెపి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు మంత్రి పదవికి తానే అర్హుడని నిక్కచ్చిగా చెప్తున్నారు…. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పాటు బిజెపిలో కూడా తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మంత్రి పదవి తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది.

మంత్రి పదవికి తానే అర్హుడ్ని అంటున్న విష్ణుకుమార్‌రాజు

2014లో కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో విష్ణుకుమార్ రాజు బీజేపీ నుండి శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించారు… విష్ణుకుమార్ రాజుకు మంచి వాగ్దాటి ఉండడంతో పాటు ప్రత్యర్థులను గట్టిగా విమర్శించగలరనే పేరు ఉంది… రాజకీయాల్లో అనుభవంతో పాటు చాలా విషయాల మీద పట్టు ఉండడంతో బిజెపి నుండి మంత్రివర్గంలోకి తీసుకుంటే తానే సరైన వ్యక్తినని విష్ణుకుమార్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తుంది… ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గోదావరి జిల్లాల నుండి విశాఖ వచ్చి స్థిరపడ్డ బలమైన వ్యక్తిగా పేరు పడడంతో పాటు 2024 మంత్రి వర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఏ పార్టీ నుండి చోటు దక్కకపోవడంతో మంత్రివర్గ విస్తరణలో విష్ణు కుమార్ రాజుకు ఈసారి మంత్రి పదవి కాయం అనే ప్రచారం జోరుగా సాగుతుంది…

బీజేపీ జాతీయ స్థాయిలో పెద్ద పార్టీగా ఉండడంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడానికి కారణంగా బిజెపి నాయకులు చెబుతున్నారు… 2014 ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికీ మంత్రి పదవి ఇచ్చారు కానీ 2024 ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుండి గెలిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చారనే అసంతృప్తి బిజెపి నాయకుల్లో ఉంది… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకో మంత్రి పదవి నాగబాబు రూపంలో జనసేనకు ఇవ్వడానికి కూటమి రంగం సిద్ధం చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.

క్షత్రియ సామాజికవర్గానికి చెందిన విష్ణుకుమార్‌రాజు

8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపికి ఒక మంత్రి పదవి ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, రెండో మంత్రి పదవి బిజెపికి ఇస్తే విష్ణుకుమార్ రాజు ఈక్వేషన్ ని ఉపయోగించుకుని మంత్రి పదవి కోరుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది… ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి విషయం మీద ముక్కు సూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే విష్ణుకుమార్ రాజు విశాఖలో రీసెంట్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా లక్షల్లో ఉద్యోగాలు రావు వేలల్లోనే ఉద్యోగాలు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

మరోవైపు టిడిపి నాయకులు గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు… కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి పదవిని ఆశిస్తున్న ఇలాంటి టైంలో ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పే విష్ణుకుమార్ రాజు మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఎలా ఆలోచిస్తాయనేది చర్చల్లో నలుగుతోంది. విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి ఇవ్వడానికి ముందడుగు వేస్తారా లేక సాగదీత ధోరణితో విష్ణుకుమార్ రాజుకు చెక్ పెట్టి ముందుకు ప్రభుత్వాన్ని లాగించేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.

Story by Apparao, Big Tv

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×