Big Stories

BRS Confusion Politics: రైతుల కష్టాలట! బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ గేమ్..!

 BRS Confusion Politics

- Advertisement -

BRS Confusion Politics: క్లారిటీ ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి. మరింత కన్‌ఫ్యూజ్ చేయాలి.. విమర్శలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు. అర్థంలేని ప్రతివిమర్శలు చేయాలి.ఇదే ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న పని. ఫోన్‌ ట్యాపింగ్‌పై సమాధానం చెప్పలేరు. లిక్కర్‌ కేసుపై నోరు తెరవలేరు. కబ్జాలపై నోరు మెదపలేరు. అలాగని సైలెంట్‌గా ఉంటే అసలుకే మోసం. ప్రాజెక్టుల ఊసే ఎత్తలేరు. అందుకే కొత్త పాట పాడుతున్నారు. ఏనాడో మరిచి.. ఎన్నడూ పట్టించుకోని రైతన్న రాగం ఎత్తుకున్నారు..

- Advertisement -

రైతులను ఆదుకోవాలి. సాగునీరు అందించాలి. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. పంటలు ఎండిపోతున్నాయి.. సాయం చేయాలి. రుణమాఫీ ప్రకటించాలి. పంట రుణాలు తీసుకున్న వారికి బ్యాంకర్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే.. లక్షలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం. ఇది బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు..
అంతా బాగానే ఉంది.. మరి నిజంగా పరిస్థితి అలానే ఉందా?

హరీష్‌రావు వ్యాఖ్యలకు అప్పుడే కొంచెం కాదు. చాలా ఎక్కువగానే కౌంటర్లు వచ్చాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల..
పదివేలు పరిహారం ప్రకటిస్తామని ఎప్పుడో హామీ ఇచ్చారు. సాగునీరుపై మంత్రి జూపల్లి ఇప్పటికే సమాధానమిచ్చారు. నిజానికి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో గడీని దాటి పంటల దగ్గరికి వెళ్లింది..
వెళ్ల మీద లెక్కపెట్టవచ్చు. గతేడాది ఎలక్షన్స్‌ టైమ్‌లో బీఆర్‌ఎస్‌ సేమ్ ఇలాంటి హడావిడే చేసింది. ఎకరానికి 10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు అప్పటి సీఎం కేసీఆర్.. 150 కోట్లు పంపిణీ కూడా చేశారు. మరో 350 కోట్లకు జీవో జారీ చేసినా.. నిధులు మాత్రం విడుదల చేయలేదు. లక్షా 25 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు కుచ్చుటోపి పెట్టింది బీఆర్ఎస్‌ సర్కార్.

Also Read: కాదు కాదంటూనే కాపు ఓట్ల కోసం.. పవన్ దారి.. ఉభయ గోదావరి

ఇవన్నీ కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు. అయితే బీఆర్ఎస్‌ రైతురాగం ఎత్తుకోవడం వెనక అసలు రీజన్స్ వేరే ఉన్నట్టు కనిపిస్తోంది.. లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌ డౌన్ కంటిన్యూ అవుతోంది. కల్వకుంట్ల కుటుంబాన్ని స్కామ్‌లు.. వాటితో పాటు వస్తున్న కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కవిత తీహార్‌ జైలుకు వెళ్లింది. మరికొందరు కీలక నేతల పేర్లు కేసుల్లో వినిపిస్తున్నాయి.. FIRలలోకి ఎక్కుతున్నాయి. ఇది ఇంటి పరిస్థితి.. ఇక పార్టీ పరిస్థితి అగమ్యగోచరం.. రాత్రి గులాబీ కండువాతో పడుకున్న నేత.. తెల్లారి లేచి ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి.. పిలిచి టికెట్ ఇస్తామన్నా మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. దీనికి తోడు పార్టీ పెద్దల ముందే బూతులు .. కొన్నిసార్లు ఏకంగా దాడులు.. ఇది పార్టీ పరిస్థితి.. ఇక ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న అసహనం తగ్గలేదు. రాష్ట్రంలో పరిస్థితులు మారలేదు. దీంతో కారు పార్టీలో ఉన్న కంగారు అంతా ఇంతా కాదు.

ఏం చేయాలి? ప్రజల అటెన్షన్‌ గ్రాబ్ చేయడం ఎలా? ఏం చేస్తే ప్రజలు పట్టించుకుంటారు? మేడిగడ్డ కుంగుబాటును మరిపించాలంటే ఎలా? కాళేశ్వరం అవినీతిని కనుమరుగు చేయడం ఎలా? గులాబీ నేతల సీటు కిందకు వస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని. మరిచేలా ఏం చేయాలి? బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందన్న ఆలోచన నుంచి ప్రజల దృష్టిని ఎలా మరిపించాలి? ఇదిగో ఈ ప్రశ్నల నుంచి వచ్చిందే బీఆర్‌ఎస్‌ రైతు పోరాటం.. మరి బీఆర్ఎస్‌ రైతు పోరాటంలో అయినా చిత్తశుద్ధి ఉందా? అంటే ఆన్సర్ ప్రజలే చెబుతారు. కానీ బీఆర్‌ఎస్‌ హయాంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. ఏం జరిగిందో మాత్రం మేం చెబుతాం..

వరి వేస్తే ఉరి.. ఇది కేసీఆర్‌ సీఎంగా ఆనాడు చెప్పిన మాట.. ధాన్యం కొనడం లేదని రోడ్డెక్కిన రైతును పట్టించుకున్నారా? ఐకేపీ సెంటర్ల ముందు ధాన్యాన్ని పారబోసి కాలబెట్టిన ఆ దిక్కుకైనా చూశారా?
అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పుడు ఆ దిక్కుకైనా చూశారా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పట్టించుకున్నారా? లేదు.. మరి అప్పుడు రైతుల ఆవేదనను ఎందుకు గుర్తించలేదు?వారి ఆక్రోశాన్ని ఎందుకు చూసిచూడనట్టు వదిలేశారు? ఇవీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు గులాబీ నేతలకు వేస్తున్న ప్రశ్నలు..

Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం.. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే బాధితుడిని..

ఇవే కాదు గత కొన్ని రోజులుగా నీటి ఉద్యమాలు అంటూ కొత్త పోరాటానికి దిగారు బీఆర్ఎస్‌ నేతలు.. ఆనాడు కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు అంగీకరించి.. తర్వాత ఆ నెపాన్ని కాంగ్రెస్‌ పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ కౌంటర్‌ అటాక్‌తో కారు జోరు తగ్గింది.

నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ను రగులుస్తోంది. ప్రతి ఎన్నిక ముందు ఇదే సీన్ రీపిట్.. ఈసారి కూడా అదే జరుగుతోంది..
ప్రజలు తెలివైన వారు.. ఒకప్పటిలా నోటి నుంచి వచ్చిందే నిజమనుకునే పరిస్థితిలో లేరు. మాటల వెనుక గుట్టును ఇట్టే పట్టేస్తున్నారు. రాజకీయ రంగును పసిగట్టేస్తున్నారు..

ఈసారి బీఆర్ఎస్‌ డైవర్ట్ పాలిటిక్స్‌ అంతగా సక్సెస్‌ అయ్యే చాన్సెస్‌ లేవనే చెప్పాలి. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలు.. నమోదవుతున్న కేసులను.. ప్రజలు చాలా కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నారు. పదేళ్ల పాలనలో ఎవరు లాభపడ్డారు? ఎవరు నిండా మునిగారు? అన్నది వారికి ఇప్పటికే అర్థమైపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News