EPAPER

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన సర్కారు

మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహిస్తూ అర్హుల వివరాలపై ఆరా తీస్తోంది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఒప్పించి.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు మాజీ మంత్రులు వేరే వేరే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.


ప్రజలను ఒప్పించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలింపు

నోరు ఉంది కదా అని తోచింది మాట్లాడేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తలో మాట మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు కారు పార్టీ నేతలు. దీంతో సామాన్య ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం షాక్ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

ప్రజల్ని గందరగోళానికి గురి చేసేలా బీఆర్ఎస్ నేతల మాటలు

సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్.. 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయని.. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు ఆ ఇళ్లను పేదవాళ్లకు ఇవ్వాలన్నారు కేటీఆర్. గతంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియా సాక్షిగా చెప్పిన మాటలు ఇవి.

Also Read: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!

ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్ గా వ్యాఖ్యలు

కానీ మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం.. కేటీఆర్ కామెంట్స్ కి పూర్తి భిన్నంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎక్కడా లేవని బాంబ్ పేల్చారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివారు ప్రాంతాల్లో, అది కూడా అరకొర డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. తలసాని ఈ రకంగా మాట్లాడడం… ప్రజలనే కాకుండా కారు పార్టీ నేతలు, కార్యకర్తలని కూడా విస్మయానికి గురి చేస్తోంది.

నిర్వాసితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

మూసీ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇచ్చిన మాట మేరకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించడం పట్ల.. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూసీ నిర్వాసితుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే పలు కుటుంబాలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు చేరుకున్నారు. సంబంధిత అధికారులు మూసీ నిర్వాసితులకు సహాయసహకారాలు అందిస్తూ ఇళ్లు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో కరెంటు, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించడంతో.. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్‌కు సన్మానం చేశారు.

హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌ ట్వీట్‌

మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ ఓ కీలక ట్వీట్‌ చేశారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్‌ స్పష్టం చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలిచడం లేదన్నారు.. మూసి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయడం లేదన్నారు.. అక్కడి ఇళ్లపై కూడా మార్కింగ్‌ చేస్తుంది హైడ్రా అధికారులు కాదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజక్ట్‌న్నారు. దీనిని రివర్‌ ఫ్రంట్‌డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతోందన్నారు హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌. కూల్చివేతల్ని బూచిగా చూపి బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని అంతా ఫైర్ అవుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో వారికే క్లారిటీ లేనట్టు మాజీ మంత్రులే తలో మాట మాట్లాడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×